నిరంతరం కేంద్రక సంయోజనంతో వెలుగుని ప్రసాదించే ఒక అతి పెద్ద హైడ్రోజన్ బాంబులాంటి వాడు సూర్యుడు, మన సౌరకుటుంబ పెద్ద, భూమికి జీవ పోషకుడూనూ.. సూర్యుని అయస్కాంత క్షేత్రం సౌర కుటుంబం దాటి చాలా దూరం వ్యాపించి ఉం ది మన పాలపుంతలో.. ఐతే ప్రశ్నేంటంటే.. ![]() సూర్యుని అయస్కాంత క్షేత్రం ఎలా వ్యాపిస్తుంది, ఎలా ఎందుకు ఎటువంటి మార్పులను చోటు చేసుకుంటుంది, అది మన భూగోళం పైన ఎలాంటి చర్యలను చూపించొచ్చు ఇలా చాలానే ఉన్నాయ్.. ![]() మన మామూలు జీవన విధానానికి సూర్యుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నాడనిపిస్తుంది కానీ నిజానికి మన భూమి పదివేల సంవత్సరాలకొకసారి మంచు యుగాన్ని చవి చూస్తుంది.. ![]() ఇప్పుడుండే కాలంలో వ్యక్తమౌతున్న సౌర పరిస్థితులలో మనం శాస్త్ర, సాంకేతికాలలో అద్బుతమైన నవీనతని సంతరించుకున్నప్పటికీ.. ఇది ఎప్పటికీ ఇలా ఉండే విషయం మాత్రం కాదు. ![]() ఇప్పుడిప్పుడే మనిషి సూర్యునికీ-భూమికీ మద్యనున్న సంభందాన్ని అర్దం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ క్షణం సూర్యుడి నుండి కొన్ని కోట్ల మిలియన్ టన్నుల ప్లాస్మా ఒక తుఫాను లాగా రోదసీలోనికి వెదజల్లబడుతుంది, ![]() ఆ ప్లాస్మా ఎక్కువ మొత్తంలో భూమిని తాకినప్పుడు ఆకాశంలో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలకీ, భూమి మీద ఉండే పవర్ గ్రిడ్సుకీ వాటి వలన ఉత్పాతం సంభవిస్తూ ఉంటుంది. ![]() ఆ తుఫాను వాచ్చే సమయంలో ఉపగ్రహాల్లో ఉన్న శాస్త్రజ్ఞులను సురక్షిత ప్రదేశాలకి చేరమని చెబుతారు, ఆయా సమయాల్లో, కరెంటుని నిలుపు చెయ్యటం కూడా జరుగుతూ ఉంటుంది.. ![]() ఈ ప్లాస్మా సూర్యుని అంతర్భాగంలోంచి బయటకి విస్ఫోటనంగా వచ్చి, ఉపరితలంపైన మచ్చలుగా కనిపిస్తాయి.. చక్రీయంగా వాటి సంఖ్య 11 సంవత్సరాలపాటు మారుతూ ఉంటుంది. ![]() అత్యధిక సంఖ్యలో సూర్యుని పై మచ్చలుంటే దానిని సోలార్ మాగ్జిమం అనీ అత్యలంగా ఉంటే సోలార్ మినిమం అనీ అంటారు, ఆ ప్లస్మాలో అధిక మొత్తంలో అయస్కాంత శక్తి దాగి ఉంటుంది. "నాకేంటి..!!" ఇదే కదా మీ ప్రశ్న?.. ![]() శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం ఈ అయస్కాంత తత్వం కలిగిన ప్లాస్మా భూమి మీద జరిగిన చాలా చారిత్రాత్మక భౌగోళికాంశాలలో ప్రధాన పాత్ర వహించిందని చెప్పవచ్చు.. ఈ విషయాన్ని క్షుణ్ణంగా అర్దం చేసుకుంటే మనం భవిష్యత్తులో ఎలాంటి మార్పులనైనా తట్టుకునేందుకు రంగం సిద్దం చేసుకోవచ్చు. ![]() 2006లో NASA రెండు శాటిలైట్సుని సూర్య గోళం నుండి వెలువడే అయస్కాంత తుఫాన్లను ఇంకా సూర్యునిలో ఏర్పడే మచ్చల అధ్యయన నిమిత్తమై రోదసీలోనికి పంపింది. వాళ్ళు పంపిన రెండు శాటిలైట్సూ వేర్వేరు ప్రదేశాలలో ఉండి సూర్యుని ఉపరితలాన్ని (3D view) త్రిపరిమాణాకృతిలో చిత్రీకరిస్తాయి.. ![]() కొన్ని బిలియన్ల కొద్దీ టన్నుల ద్రవ్యరాశి ఉన్న సౌర తుఫానులు సూర్యుని నుండి ప్రసరించి భూమికి చేరే తరుణంలో వాటి అయస్కాంత శక్తి భూ అయస్కాంత శక్తితో తాడనం చెందినపుడు భూఉపరితలం మీద జీవరాశి పైన ఆ ఎఫెక్టులేవీ చూపకుండా భూఅయస్కాంత క్షేత్రం చూసుకుంటుంది.. ![]() ఆ అయస్కాంత క్షేత్ర తుఫాను దృవాల వద్ద, భూఅయస్కాంత క్షేత్రాన్ని తాకినపుడు అద్భుతమైన రంగులు విరజిమ్మే అరోరాలు ఏర్పడతాయి. ఈ సౌర గాలులు సూర్యుని నుండి భూమిని చేరేందుకు కనీసం రెండు రోజుల సమయాన్ని తీసుకుంటాయి.. ![]() వాటి తీవ్రత ఎక్కువున్న సమయంలో పన్నెండు గంటలలోనే అవి భూమిని చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు... అలాంటి సమయాలలో పవర్ గ్రిడ్లను, శాటిలైట్లను సేఫ్ మోడ్‌లోనికి మార్చుకోవటం జరుగుతుంది.. లేకుంటే ఆ సౌర పవనాల తాకిడికి ఇవి మట్టి .. సారీ సారీ అయస్కాంతం కొట్టుకుపోతాయి.. ![]() సూర్యాంతర్భగంలో జరిగే పరమాణు కేంద్రక సంయోగం వలన విడుదలయ్యే వేడి వాయువులు అధికమైన అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటాయి, అలాంటి అయస్కాంత క్షేత్రాలు ఏర్పడి ఈ చిత్రాలలో చూపబడే వలయాల వలె ఏర్పడినప్పుడు అవి మనకి సూర్యునిలో మచ్చలవలె కనిపిస్తాయి. ఇవి ఎలా ఏర్పడతాయి అన్నదానికి మన కిచెన్లోనే సమాదానం చూడవచ్చు.. ![]() సేమ్యా ఉడకబెట్టినప్పుడు వేడి చెయ్యబడిన నీరు ఉబికి ఉపరితలానికి వచ్చి వేడిని వెదజల్లుతుండటం జరిగినప్పుడు ఎలా సేమ్యాకూడా బయటికి వస్తుందో, సూర్యునిలో అయస్కాంత క్షేత్రాలు కూడా అంతరాళంలోంచి ఉబికి వస్తాయి. ![]() సూర్యునిలో ఏర్పడే మచ్చల తీవ్రతా ఇంకా గమనంలో పరిశీలించగలిగే అడ్డదిడ్డ చలనాలకి కారణం సూర్యునిలో ఉండే వేడిమి ఒక్కటే కాకుండా, సూర్య భ్రమణం కూడా దానికి కారణం.. ![]() భూమిలాంటి ఘన పదార్దసహితమైన గ్రహం భ్రమణంలో ఉన్నప్పుడు భూమి కేంద్రకం నుండి ఉపరితలం వరకూ ఎటువంటి తేడాలూ లేకుండా తిరుగుతుంది.. కానీ సూర్యుడు పూర్తి వాయు గోళం కావున అది సాధ్యం కాదు.. ![]() సూర్యగోళంలో దృవాలు ఒకసారి భ్రమణం చెందటానికి 25 రోజులు తీసుకుంటే, సూర్యమధ్యరేఖ మొత్తం భ్రమణానికి 35 రోజులు తీసుకుంటుంది.. ![]() ఈ భ్రమణాసమతుల్యత వలన అయస్కాంత క్షేత్ర భ్రమణం కూడా మారుతూ ఉండి.. ఆ క్షేత్రాలు ఎక్కడైతే ఉపరితలాన్ని చేరతాయో ఆ ప్రదేశాలలో సూర్యునిపై మచ్చలు ఏర్పడతాయ్.. ![]() ఆ మచ్చలు విభిన్నమైన ఆకృతులను, పరిమాణాలనూ సంతరించుకుని ఉంటాయి.. కొన్ని మన ఆఫ్రికా ఖండమంత ఉంటే ఇంకొన్ని మన భూగోళం కంటే నలభై వంతులు పెద్దవిగా ఉండొచ్చు.. ![]() మచ్చ పెద్దదిగా ఉంటే ఆ ప్రదేశంలో అయస్కాంత క్షేత్రపు అస్థిరత ఎక్కువగా ఉందని అర్దం.. అంతే కాకుండా ఆ ప్రదేశం నుండే అధిక మొత్తంలో సౌరగాలులు అతి తీవ్రతని సంతరించుకుని వెలువడతాయ్.. ![]() వాటితో పాటుగా ఎక్స్-కిరణాలు, గామా కిరణాలూ కూడా వెలువడుతుంటాయి.. నల్లగా కనిపించే ఆ మచ్చలు నిజానికి నల్లవి కావు అవి చంద్రుని కంటే ఒక పది రెట్లు తెల్లగా ఉంటాయి.. కానీ మిగిలిన ఉపరితల భాగం అంతా ఎక్కువ తెల్లగా ఉండటంతో అవి నల్లగా కనిపిస్తాయి.. ![]() ఐతే ఈ సన్ స్పాట్సుకీ, భూమ్మీద కొన్ని వందల, వేల ఏళ్ళ వాతావరణ చరిత్రకీ సంభందం ఉందా.. ఉంటే అది ఎలా తెలుస్తుంది..?? ![]() ఈ విషయం తెలియాలంటే చాలా ఏళ్ళుగా సన్‌స్పాట్స్ సమయానుగుణంగా ఎలా మారుతున్నాయో తెలియ చేసే ఆధారాలు కావాలి ![]() క్రీ.శ. ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో మొట్టమొదటి సారిగా సన్‌స్పాట్సుని లెక్కించటం జరిగింది.. గెలీలియో(16th century)ని సన్‌స్పాట్సుని శాస్త్రీయంగా లెక్కించిన మొదటి శాస్త్రజ్ఞుడి చెప్పవచ్చు ![]() ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కల ప్రకారం 1645-1714 కాలంలో ఈ సన్‌స్పాట్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది.. ఆ కాలంలోనే యూరప్ మరియు నార్త్ అమెరికా, శీతల స్థితిని అనుభవించాల్సి వచ్చింది.. దీనిని స్వల్ప హిమయుగంగా పేర్కొంటారు. ![]() ఈ కాలంలో ఒక డెబ్భై సంవత్సరాలు పాటు ఆయా ప్రదేశాలలో నదులు మిగిలిన జలాశయాలు గడ్డకట్టి బండ్లతో ప్రయాణానికి అనుకూలంగా అయ్యాయి. లండన్లో జనాలు నదుల మీద జాతర్లు కూడా చేసుకున్న సందర్బాలున్నాయి. ![]() సైంటిస్టులు సన్‌స్పాట్సునే కాకుండా, కాస్మిక్(రోధసీ)కిరణాలను కూడా పరిశీలించటం ప్రారంభించారు.. ![]() ఈ కాస్మిక్ కిరణాలు విశ్వమంతా ప్రసరించబడుతూ ఉంటాయి, ఇవి నక్షత్రాల మహా విస్ఫోటనాల నుండి ఆవిర్భవిస్తూ ఉంటాయి.. ఇవి ప్రోటానుతో సమానంగా ధన విద్యుదాత్మకత కలిగి ఉండి.. కాంతి వేగంతో విశ్వమంతా ప్రాయాణిస్తూ ఉంటాయి.. ![]() ఈ కాస్మిక్ కిరణాలు నిరంతరం భూమిని కూడా తాకుతూ ఉంటాయ్.. కాస్మిక కిరణాల తాకిడి వలన వాతావరణంలో ఉన్న వాయువులలో ఐసోటోపులను ఏర్పరుస్తాయి.. ![]() కార్బను పధ్నాలుగు(C14) ఐసోటోపు చెట్ల వార్షిక వలయాలలోనూ, బెరీలియం పది(Be10)ఐసోటోపుని మంచులో ఉండటాన్ని కనుక్కున్నారు.. ![]() చెట్లలో ఉండే కార్బన్ పధ్నాలుగు ఐసోటోపుతో కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉండే సౌర పరిస్థితుల ను అంచనా వేశారు. సూర్యుని అయస్కాంత తత్వం వలన కూడా కార్బన్ మరియు బెరీలియంలలో తేడాలు కలుగుతాయి. ![]() సూర్యుని అయస్కాంత క్షేత్రం ఎనిమిది బిలియన్ మైళ్ళ దూరం రోధసీలో వ్యాపించి ఉంది.. అయస్కాంత పరంగా సూర్యుని చర్యలు అధికమైనప్పుడు ఈ దూరం పది బిలియన్ మైళ్ళకు చేరుతుంది. ![]() కాస్మిక్ కిరణాలు విద్యుదావేశపూరితమైనవి కావున ఈ అయస్కాంత తత్వం వాటి దిశని మార్చే లక్షణం కలిగి ఉంటుంది.. ![]() సూర్యునిలో అయస్కాంత తత్వం ఎక్కువైనప్పుడు ఎక్కువ కాస్మిక్ కిరణాలు వాటి దారిని మార్చుకుని వెళ్ళిపోతాయి.. ![]() ఆ కారణం చేత కాస్మిక్ కిరణాల ప్రభావం ఆయా కాలాలలో భూమ్మీద ఉండే చెట్లలో కార్బను పైన తక్కువ ప్రభావశాలి అయి ఉంటుంది. ![]() ![]() అయస్కాంత తత్వాన్ని విద్యుదావేశపు దిశని మార్చటానికి భూమి మీద చాలా కాలంగా వాడటం జరుగుతూ ఉంది, మీరు టీవీ సెట్లను గమనించినట్లైతే వాటిలో cathod ట్యూబులు అదే పనిమీదుంటూంటాయి .. ![]() ఇక్కడ కనిపించే చిత్రంలో ఉండే ఎలక్ట్రాన్ల కాంతి రేఖలని అయస్కాంత శక్తితోనే అలా వంచటం జరిగింది. మాండర్ మినిమం లేదా స్వల్ప హిమయుగ కాలంలో ఈ సన్‌స్పాట్లు తక్కువ కావటం వలన సూర్యుని అయస్కాంత తీవ్రత తగ్గి ఆ సమయంలో కాస్మిక కిరణాల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన చెట్లలో కార్బన్ ఐసోటోపుల సంఖ్య అధికమైనట్లు చెబుతారు. ![]() అంతే కాకుండా ప్రతీ లక్ష సంవత్సారాలకొకసారి, భూమి ఒక అత్యధిక హిమయుగాన్ని చేరుకుంటుంది, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యయొక్క దూరంలో సంభవించే మార్పు వలన ఇది చోటు చేసుకుంటుంది. భూకక్ష్య వృత్తాకారంలో ఉంటుంది, ![]() కానీ కాలానుగుణంగా దానిలో మార్పులు చోటు చేసుకుంటాయి.. కక్ష్య దూరమయ్యే కొలదీ, వృత్తం కాస్తా దీర్ఘ వృత్తం అయ్యి సూర్యకాంతి తీవ్రత ఇరవై మూడు శాతం తగ్గుతుంది, ఈ కారణం చేత భూగోళం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ![]() ఇప్పుడున్న దీర్ఘవృత్తం వ్యాసంలో ఏడు శాతం మాత్రమే దూరంలో తేడా ఉండటం వలన మనకి ఆవాస యోగ్యమైన వాతావరణంతో కూడిన భూమిని కలిగి ఉన్నాం మనం.. ![]() ఈ కాలచక్రానుగుణంగా సంభవించే మార్పులు కాకుండా సూర్యునిలో ఇంకెలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయ్..?? సూర్యునిలో జరిగే కాంతి తీవ్రతల మార్పులొక్కటే మన వాతావరణ క్రమాన్ని మార్పులకు గురి చేస్తుందా..?? ![]() సమాధానం మాత్రం సూర్యునిలో ఎంత కాలం పాటు ఆయా మార్పులు స్థిరంగా ఉన్నాయి అనేదానిపైన అధారపడి ఉంటుంది. పదకొండు సంవత్సారాల కాలంలో వచ్చే సన్‌స్పాట్ సైకిల్లో వచ్చే సౌరశక్తి మార్పులని అంత గణనీయంగా తీసుకోలేము, ఎందుకంటే అవి అంత పెద్ద మార్పులను చేకూర్చే తీవ్రత కలిగి ఉండవు.. ![]() మన భూతలంపై ఉండే మహాసముద్రాలు అంత వేగంగా వేడెక్కవు, భూగోళమంతా మార్పు వచ్చేంత మార్పులు ఒక దశాబ్ద కాలంలో ఇక్కడ జరిగే ఆస్కారం లేదు. ![]() స్వల్పహిమ యుగానికి కారణం దశాబ్ద కాలం కంటే ఎంతో ఎక్కువ కాలం సూర్యుని మచ్చలలో వచ్చిన మార్పులై ఉండొచ్చని ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనా.. మొదటి ప్రశ్న ఏంటంటే సూర్యునిలో ఎంత కాలం ఈ మార్పు వచ్చి నిలకడగా ఉంది. ![]() దానికి ఒక వేళ జవాబివ్వగలిగినా భూమి ఏ విధంగా ఆ మార్పులకి స్పందించింది అనే విషయానికి చాలా ఆధారాలు కావాలి, దానికి కొన్ని వేల సంవత్సరాలుగా సూర్యునిలో వచ్చిన మార్పులను తెలుసుకోగలిగే అవకాశాలు మనం కలిగి ఉండాలి. ![]() (శిలాజావరణ శాస్త్రజ్ఞుడు)పేలియో క్లైమటాలజిస్ట్ యెమానీ ఆస్మెరోం ఆ అధారాలను వెలికి తీసేందుకు చక్కని మార్గాన్ని కనుగొన్నారు.. స్టెలాగ్మైట్స్ రూపంలో.. ఇవి అతి పురాతనమైన గుహలలో ఉండే శిలాజాలు. ఇవి అమెరికాలో దక్షిణ పడమరల మద్యలోనున్న న్యూ మెక్సికోలో ఉన్నాయ్. కొన్ని వేల సంవత్సరాల వాతావరణ మార్పులను ఇవి చక్కగా వాటిలో దాచుకున్నాయని చెప్పొచ్చు. వార్షిక వలయాలలాగానే వీటిలో కూడా వలయాలు ఏర్పడి ఉంటాయి, కాల చక్రంలో మార్పులని వాటి పొరలలో రసాయన మార్పులద్వారా పొందుపర్చుకుని ఉంటాయి. వీటి పొరలలో దాగుని ఉన్న యురేనియం మరియు థోరియం పరమాణు మూలకాల పరిమాణం ఆధారంగా యురేనియం రేడియో ధార్మికత వలన ఎంత థోరియం ఏర్పడిందో కొలిచి వాటి వయసుని నిర్ణయిస్తారు.. అంతే కాకుండా ఆ శిలాజాలలో ఉండే ఖనిజ లవణాల మిశ్రమ పరిమాణం ఆధారంగా అప్పటి వాతావరణపు తేమ శాతాన్ని కూడా లెక్కించొచ్చు.. ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే.. అప్పటి కరువు పరిస్థితులకీ, సూర్యునిలో వచ్చే సన్‌స్పాట్స్ సంఖ్యకీ పొంతన సరిగ్గా సరిపోయింది. కార్బన్14 ద్వారా కూడా కొన్ని వేల ఏళ్ళ వాతావరణ చరిత్రని అంచా వెయ్యటం జరిగింది.. క్రీ.శ.850లో checko canyonలో ఉండే ఒక అమెరికన్ నాగరికత ఎలా మాయమైందో కూడా అంచనా వేశారు.. క్రీస్తుశకం ఎనిమిది వందల ఏళ్ళకి నాలుగు వందల ఏళ్ళ తర్వాత వాతావరణం ఒక్కసారి వేడెక్కిపోతే checko canyonని ఆవాసంగా చేసుకుని నివసిస్తున్న జనాభా అంతా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. స్టెలాగ్మైట్సులో ఆ వాతావరణ మార్పుల సంభందిత విషయాలు నమ్మశక్యం కానంత చక్కగా నిక్షిప్తమై పదిలంగా అన్నేళ్ళగా ఉన్నాయి. కాని ఈ సాంఖ్యక శాస్త్ర గణనాలు సూర్యునిలో జరిగే మార్పులు భూవాతావరణాన్ని ఏ విధంగా ప్రభావితం చెయ్యగలిగాయో చెప్పలేవు. ![]() అయస్కాంత పరంగా తీవ్రత ఎక్కువగా ఉన్న సూర్యుని నుండి వేడి ఎక్కువౌతుందని చెప్పే ఆధారాలు ఏమున్నాయి మన దగ్గర..?? ఈ విషయాన్ని అర్దం చేసుకునేందుగ్గాను, సూర్యునిలో ఏ విధంగా ఈ అమోఘమైన, అనంతమైన వేడి అయస్కాంత తత్వమూ పుడుతున్నాయో అర్దం చేసుకునేందుకు మన శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. సౌరశక్తి చాలా అధికమైన పీడనం కలిగిన సూర్యుని కేంద్రకం వద్ద ఉత్పత్తి చెందుతుంది. ![]() ఇంకో విషయం ఏంటంటే మనం రోజూ అనుభవించే సూర్యుని వెలుగు అనే శక్తి సూర్యునిలో ఎనిమిదిన్నర నిమిషాల(కాంతి సూర్యుని నుండి భూమికి చేరే సమయం)ముందు పుట్టింది కాదు, అది సూర్యుని కేంద్రకంలో ఒక పావు మిలియన్ సంవత్సరాలకి పూర్వమే ఉత్పన్నమై సూర్యుని అంతర్భాగంలోనున్న పొరలలో మార్పులు చేర్పులు చెంది అన్నేళ్ళకి ఉపరితలానికొచ్చి రోధసీలోనికి వెదజల్లబడుతుంది.. ఈ క్షణం సూర్యుని కేంద్రకంలో జరిగే చర్యయొక్క కాంతి రూపాన్ని చూడాలంటే కొన్ని యుగాలపాటు ఆగాల్సిందే.. ![]() ఆస్ట్రియాలో పుట్టిన అమెరికా బౌతిక శాస్త్ర శాస్త్రజ్ఞుడు Pauli చెప్పినదాని ప్రకారం, సూర్యుని కేంద్రకం నుండి ఎటువంటి విద్యుదావేశం లేని కొన్ని కిరణాలు కూడా వెలువడతాయి.. వాటికి ద్రవ్యరాశి ఏమీ ఉండదు, అంతే కాక అవి ఎలాంటి పదార్ధం గుండా ఐనా ప్రవహించగలవు. వాటినే న్యూట్రినోలంటారు. ![]() న్యూట్రినోలని వివరించే నమూనాలన్నీ, వాటి సంఖ్య అన్ని సమయాలలోనే పెద్ద మార్పులు లేకుండా ఉంటుందని.. దానికి కారణంగా సూర్యునిలో చెప్పుకోదగ్గ పెను మార్పులేవి సంభవించకపోవాటాన్ని ఆధారంగా చెబుతారు. మొదటిగా అవసలున్నాయని నిరూపితం కావాలి కదా? ![]() ఈ విషయాలని నిరూపించేందుకు 1990లో కెనడాలో సడ్బరీ ప్రాంతంలో రమారమి ఒక ఏడువేల అడుగుల లోతులో ఒక పరిశోధనాలయాన్ని ఆరంభించారు.. ఈ ప్రదేశాన్ని నిర్మించే ఉద్దేశ్యం ఏంటంటే, సూర్యుని నుండి వచ్చే ఏ ఇతర కాంతి రేణువులూ చేరని చోటుని నిర్మించటమే. దీని నిర్మాణానికి ఎనిమిదేళ్ళ సమయంతో పాటుగా పది మిలియన్ల డాలర్లు కంటే ఎక్కువే ఖర్చయిందని చెప్పాలి. Dugg Hallman అనే శాస్త్రవేత్త దీనికి సూత్రధారిగా ఉన్నారు.. ఈ ప్రదేశంలోకి న్యూట్రినోలు తప్ప ఇంకే ఇతర కాంతి రేణువులూ చొచ్చుకు పోలేవు.. ![]() వాటిని చూపేందుకు కూడా కొన్ని వేల టన్నుల న్యూట్రానులు నిండిన నీటిని వాడతారు (హెవీ వాటర్), ఈ నీటిని రేడియోధార్మిక కేంద్రాల నుండి తయారు చేయిస్తారు. న్యూట్రినోలు ఈ నీటిని తాకినపుడు చిన్న చిన్న మెరుపులను సృష్టిస్తాయి. కొన్ని వేల డిటెక్టర్లను ఆ నీటి ట్యాంకు చుట్టూ ఉపయోగించి ఆ మెరుపుల కాంతి సంఖ్య మరియు తీవ్రతలను లెక్కిస్తారు. ఈ లెక్కల ప్రకారమే సూర్యునిలో న్యూట్రినోల ఉత్పత్తి స్థిరంగా ఉంటుందని తెలిసింది. ![]() సూర్యకిరణాల వలన భూమి మీద ఒక చదరపు గజం స్థలం ఒక రోజులో వెయ్యి జౌల్సు శక్తిని పొందుతుంది, ఇందులో కొంత భూమిలో విలీనం ఐతే కొంత పరావర్తనం చెందుతుంది. ఒక పదకొండేళ్ళ కాలంలో ఈ శక్తిలో వచ్చే మార్పు చాలా తక్కువగా ఉంటుంది.. అది 1/10లో ఒక శాతం ఉంటుంది. ![]() ఇలాంటి తక్కువ మార్పులు భూ వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులనెలా తీసుకొస్తాయనేదే ప్రశ్న.. అలా ఐతే వేరే ఏ పధ్ధతిలో ఈ మార్పు సంభవిస్తుందో తెలియాల్సి ఉంది.. ఇది సూర్యునిలో ఉండే వెలుతురులో వచ్చే మార్పులు కాక ఇంకేదో కారణం రీత్యా భూమ్మీద మార్పులు జరుగుతున్నాయేమో అనే ప్రశ్న తలెత్తింది.. ![]() సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రసరణలో వచ్చే మార్పులు, భూఆవారణలో మార్పులకి కారణభూతాలవ్వచ్చని సిధ్ధాంత పరమైన ఆలోచన ఉంది.. ![]() అది ఎలాగంటే పదకొండేళ్ళ సన్‌స్పాట్ సైకిల్లో అతి స్వల్ప ఉష్ణోగ్రత మార్పులే కాకుండా, మన కంటికి కనిపించని అతినీలలోహిత కిరణాల స్థాయిలో కూడా చెప్పుకోదగ్గ మార్పు చోటు చేసుకుంటుంది.. ![]() సోలార్ మాగ్జిమంగా పిలిచే అధిక సన్‌స్పాట్లుండే సమయంలో అతినీలలోహిత కిరణాల సంఖ్య మామూలు కాలంలో కంటే వంద శాతం అధికంగా ఉంటుంది. ![]() అంతే కాకుండా ప్రస్తుతకాలపు శాటిలైట్లు కూడా అధిక స్థాయిలో సన్‌స్పాట్లుండేటప్పుడు అధిక శాతం అతినీలలోహిత కిరణాలున్నట్లు గుర్తించాయి. పైనున్న చిత్రంలో నాసా showhow శాటిలైట్ తీసిన చిత్రాన్ని మీరు గమనించినట్లైతే , అందులో సోలార్ మాగ్జిమం సమయంలో ఉండే అతినీలలోహిత కిరణాలుండే సూర్యుని ఆకారాన్ని చూడవచ్చు. ![]() ఈ కిరణాలు వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌తో భౌతిక చర్య జరిపి ఆక్సిజన్‌ని ఓజోన్‌గా మారుస్తుంది, ఈ ఓజోన్ పొర ఒక దుప్పటిలాగా వాతావరణమంతా పరుచుకుని మనల్ని అతినీలలోహిత కిరణాల తాకిడి నుండి రక్షిస్తుంది. ఈ ఓజోన్ పొర భూమికి పది నుండి పన్నెండు మైళ్ళ దూరపు పరిధిలో వ్యాపించి ఉంటుంది. ![]() కొన్ని రకాల కెమికల్స్ ప్రత్యేకంగా అతినీలలోహిత కిరణాలకే స్పందిస్తాయి, ఈ చిత్రాలలో చూపిన విధంగా ఆ కెమికల్ పూసిన UV అనే కోడ్ మామూలు వెళుతురు ప్రయోగించినప్పుడు కనిపించలేదు కానీ UVలైట్ ఫోకస్ చేసినప్పుడు కనిపించింది. ![]() అంతే కాకుండా వాతావరణంలో ఉండే ఒకానొక గ్రీన్‌హౌస్ గ్యాస్‌గా ఈ ఓజోన్ పొర వర్తిస్తుంది.. గ్రీన్‌హౌస్ వాయువులకి వాతావరణాన్ని వేడెక్కించే గుణం అధికంగా ఉంది. ![]() సూర్యుని సోలార్ మాగ్జిమం సమయంలో ఓజోన్ పొర దాని మందాన్ని మూడు శాతం పెంచుకుంటుంది.. అదీ అతి నీలలోహిత కిరణాల తాకిడి వలన.. ![]() ఆ కిరణాల తాకిడి వలన చాలా ఆక్సిజన్ అణువులు ఓజోన్ అణువులుగా రూపాంతరం చెందుతాయి.. ![]() ఇలా రూపాంతరం చెందిన ఓజోన్ ఒక పొరగా మారి సూర్యకిరణాల వలన వచ్చిన వేడిని బయటకి పోకుండా అడ్డుకుంటుంది.. ![]() ఇలా స్టాటోస్పియర్లో వచ్చిన మార్పులు కారణంగా గాలి వీచే దిశలు దాని ఉష్ణోగ్రతలలో తీవ్ర మార్పులు సంతరించుకుని స్వల్ప హిమ యుగానికి దారి తీసి ఉండొచ్చని చెబుతారు.. ![]() ఇన్ని కారణాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, భూమిపై అతినీలలోహిత కిరణాలు చూపే ప్రభావాన్ని శాస్త్రజ్ఞులు చక్కగా అర్దం చేసుకోగలిగారు.. ![]() వారి అధ్యయనాల మేరకు ప్రాదేశిక ఆవరణ మార్పులకి అతి నీలలోహిత కిరణాలని కారణంగా తేలింది.. ![]() Dr.Neil Arnold అనే శాస్త్రవేత్త ఏమి చెబుతాడంటే.. సూర్యని నుంది వెలువడే అనేక రకాల కిరణాలతో పాటుగా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు చాలా విడుదలౌతాయి. ![]() ఇవి భూమి ఉపరితలం పైనున్న ధర్మోస్పియర్ని తాకి గ్లోబల్ వార్మింగుని కలుగజేస్తాయి. ![]() ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటే మన భూభ్రమణంతో ఆవరణం ఎలాంటి సంభందాన్ని కలిగి ఉందో అర్దం చేసుకోవాల్సి ఉంది.. ![]() వాతావరణంలో పొరలు భూభ్రమణం పాటు తూర్పు ముఖంగా భ్రమణంలో ఉంటాయి దీనికి కారణం కొరియోలస్ ఫోర్స్. ![]() ఈ ఫోర్సు లేకుంటే భూమద్య రేఖ వద్ద వేడి గాలులు దృవాలవైపు ప్రసరించి అక్కడి ఆవరణంలో పెను మార్పులు తీసుకొస్తాయి. ![]() ఈ కొరియోలస్ ఫోర్సుకి కారణం భూభ్రమణంగా పేర్కొంటారు.. కానీ.. ఆర్నాల్డు చెప్పినదాని ప్రకారం ![]() సౌర గాలులు ధెర్మోస్పయర్ని తాకినప్పుడు ఈ కొరియోలస్ ఫోర్సుపై ఆ ప్రభావం పడి వాతావరణం వాయువుల గమన స్థితి మార్పు చెందుతుంది. ![]() అలాంటి సమయంలో ఆ వేడెక్కిన గాలి భూమద్యరేఖా ప్రాంతం నుండి దృవాలవైపుకి ప్రసరిస్తుంది.. ![]() ఈ విధంగా మొత్తం వాతావరణంలో వాయువులన్నీ వాటి గమన దిశలని మార్చుకుంటాయి.. ![]() ఇలా జరిగే వాతావరణ చిలుకుడులో వేడిమి వాతావరణాన్ని దాటి బయటకి వెళ్ళకపోవటంతో భూగోళ ఉష్ణోగ్రతలో పెను మార్పులు సంభవిస్తాయి. ![]() కానీ ఈ సిధ్ధాంతం వివాదాస్పదమైంది.. దానికి కారణమేంటంటే సౌర తుఫాన్లు రోజూ భూమిని తాకుతూ ఉంటాయి.. ![]() ఈ లెక్కన రోజూ వాతావరణంలో మార్పులెందు రావనేదే ప్రశ్న.. ![]() సౌరతుఫాన్లు, అతినీలలోహిత కిరణాలు చారిత్రాత్మక వాతావరణ మార్పులకి కారణాలుగా కనుగొనటం జరిగింది, ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా..?? ![]() ముందుగా చర్చలో మాట్లాడుకున్నాం కదా, సూర్యుని యాక్టివిటీ అధికంగా ఉన్న సమయంలో కాస్మిక్ కిరణాలు భూమిని అధికంగా చేరలేవు.. అదే సూర్యుని యాక్టివిటీ తక్కువగా ఉంటే అవి మనల్ని చేరగలవు అని... అవి కానీ మన సౌరశక్తికీ, చారిత్రాత్మక భూవాతావరణపు మార్పులకీ ఒక మిస్సింగ్ లింకు కాగలవా..?? ![]() మేఘాలు భూమి ఉష్ణోగ్రతపై చెప్పుకోదగిన ప్రభావాన్ని చూపెడతాయి, తక్కువ ఎత్తుగల మేఘాలు ఎక్కువగా ఏర్పడినప్పుడు సూర్యకిరణాలు ఎక్కువ పరావర్తనం చెంది, వేడిని ఉపరితలం చేరకుండా అడ్డుకుంటాయి.. శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం ఈ రకం మేఘాలు 2% పెరిగితే భూమ్మీది ఉష్ణోగ్రతలు.. పారిశ్రామిక విప్లవం ముందు కాలానికి చేరుకుంటాయి. వేడిగాలులు ఆకాశంలోకి చేరి చల్లబడిన తర్వాత మేఘాలు ఆవిర్భావం జరుగుతుంది. వాటిలో నీటి యావిరి అణువులు సంయోగం చెంది నీటి బిందువులుగా మారుతుంది.. ![]() డేనిష్ ఫిజిసిస్ట్ Henrik Svensmark మేఘాల ఆవిర్భావానికి కారణాన్ని ఒక చిన్న ప్రయోగం ద్వారా తెలిపారు, కొంచెం నీటితో ఉన్న బాటిల్లో నీటియావిరి మొత్తం ఆ బాటిల్ అంతా ఆవిర్భవించబడి ఉంటుంది.. అదే బాటిల్లోనికి ఒక అగ్గిపుల్లని వెలిగించి దాని పొగని అందులో వేసినట్లైతే మేఘావిర్భావం చక్కగా జరుగుతుంది.. ![]() దీనిని బట్టి అర్దమయ్యేదేంటంటే వాతావరణంలోనికి ఏదైనా మేఘాన్ని ఏర్పరిచే పదార్ధం కానీ, శక్తి కానీ వచ్చినట్లైతే అది మేఘాల ఆవిర్భావానికి ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. ఐతే ఇదే క్లౌడ్ సీడింగ్ వాతావరణం బయట నుండి కూడా జరుగుతుందా? ![]() కాస్మిక్ కిరణాలు భూమ్మీద మేఘ మధనంలో విశిష్టమైన పాత్ర పోషిస్తాయని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కానీ ఇది నిజం కావాలంటే వాళ్ళకి కాస్మిక కిరణాల స్థాయిలకీ, భూమి మీద మేఘాల స్థాయికి ఉన్నా కాలనుగుణమైన ఆధారాలు కావాలి. 1979-1992 మద్య కాలంలో శాటిలైట్ రికార్డు చేసిన వాతావరణ విషయాలను వారు పరిశీలించారు, ఈ సమయం సూర్యుని పదకొండు సంవత్సరాల సన్‌స్పాట్ సైకిల్ కంటే ఎక్కువే.. స్వెన్స్మార్కు చెప్పినదాని ప్రకారం సోలార్ మినిమం ఉండే సమయంలో మేఘాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నాయి. కానీ కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ విషయాన్ని ఒప్పుకోరు.. ![]() కాస్మిక్ కిరణాలు కంటికి కనిపించవు.. కానీ లేబరేటరీలో సూపర్ సాట్యురేటెడ్ ఆల్కహాల్ ఉన్న ప్రదేశం గుండా విద్యుదావేశం ఉన్న కాంతి పుంజాలు (కాస్మిక్ కిరణాలు) ప్రసరించినట్లైతే అప్పుడు ఆ ప్రదేశం చిన్న చిన్న బిందువుల సమూహంలా కనిపిస్తుంది.. మిగిలిన సిధ్ధాంతాల లాగానే స్వెన్స్మార్కు కూడా కాస్మిక్ కిరణాలు మేఘ మధనాన్ని చేస్తాయనే ఆధారాన్ని ఇవ్వాలి.. ![]() దీనిని నిరూపితం చేసేందుకు ఆయన 2005లో ఒక ప్రయోగాన్ని నిర్వహించాడు.. ఇందులో రెండు చాంబర్లు ఒకటి పెద్దది సముద్ర మట్టపు ఎత్తులో ఉంచబడిందీ, ఇంకొకటి చిన్నది అండర్ గ్రౌండులో ఉంచబడింది.. దీనిలోకి గాలినీ మరియు సల్ఫర్ డైయాక్సైడ్ వంటి ట్రేస్ వాయువులను నింపారు, ![]() ఇలా నింపటం వలన ఆ వాయు ప్రదేశం సముద్రాలపైనున్న వాయువుల లక్షణాలని తలపిస్తుంది, సూర్యుని బదులు UVకాంతిని వాడారు.. కాస్మిక్ కిరణాలు ఆ వాయువుల నుండి ఎలక్ట్రాన్లను తొలగించి వాటిని, విద్యుదావేశపూరిత రేణువులవలె మారుస్తుంది. ![]() విద్యుదావేశం మూలాన వివిధ వాయు అణువులు దగ్గరగా జరిగి సంయోగం చెందుతాయి, దీనిని క్లౌడ్ కండెన్సేషన్ ప్రక్రియగా పేర్కొంటారు. ఇలా కండెన్సయిన వాయు కేంద్రాలను లెక్కించేందుకు ఒక ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేశారు.. ![]() ఐతే అలా కండెన్సైన వాయు అణువులు, అవి నీటి బిందువులుగా మారిపోకుండా వాటి పరిమాణం పెరగాలంటే, దాన్ని నిరూపించేందుకు ఇంకా రీసెర్చి జరగాల్సి ఉంది.. ఆ పరిశోధన 2010లో CERN పరిశోధనాలయంలో జరుగుతుంది.. సెర్న్ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టికల్ యాక్సిలరేటర్.. అది భూగర్భంలో కొన్ని కిలోమీటర్ల వ్యాసం కలిగిన పరిధిలో నిర్మించబడి ఉంది.. ![]() బాగా వేగవంతం చెయ్యబడిన పార్టికల్సుని కాస్మిక్ కిరణాలుగా రూపాంతరం చెందించి సాట్చ్యురేటెడ్‌గా ఉన్న గాలిలోనికి పంపిస్తా రు, అప్పుడే కాస్మిక కిరణాలు మేఘ మధనంలో తమ పాత్ర పోషిస్తాయా లేదా అన్నది ప్రపంచానికి నిరూపితమయ్యే విషయం తేలుతుంది.. ![]() ఒక ముప్పయ్యేళ్ళ క్రితం సూర్యునిలో ఏర్పడే మార్పులు భూమిపై వాతావరణాన్ని ప్రభావితం చెయ్యగల్గుతాయంటే నమ్మేవారు కాదు, కానీ కొంత మంది శాస్త్రజ్ఞులు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు.. ఒకవేళ ఈ సౌర కాల చక్రాలు నిజంగా మనకి సహాయకారులైతే సూర్యునిలో జరిగే చర్యల్ని గమనించుకోవటమనేది మన తర్వాతి శతాబ్దపు జనాలకి చాలా అవసరం.. prologue: మానవ తప్పిదంగా భావించబడే గ్రీన్‌హౌస్ వాయువులు భూమిని వేడెక్కించేస్తున్నాయ్, భవిష్యత్తులో సూర్యునిలో జరిగే పెను అయస్కాంత మార్పులు కూడా మన తర్వాతి తరాలకి కీలకాంశం కాబోతుందేమో..? ఈ రెంటికీ క్లాష్ వస్తే గ్లోబల్ వార్మింగ్ అనుకున్నదానికంటే వేగవంతమైనా కావచ్చు లేదా ఆలస్యమైనా కావచ్చు.. మన గ్రహం స్థితి గతులను మార్చే పవర్ మనకి ఉంది, ఆ పవర్ని భాద్యతాయుతంగా వాడాల్సి ఉంది.. ఏదేమైనా ఒక విషయం మాత్రం నిజం.. కారణం సూర్యుని అయస్కాంత తత్వం మాత్రమే ఐనా, అతి నీలలోహిత కిరణాలే ఐనా, కాస్మిక్ కిరణాలైనా.. మనం మన వాతావరణ స్థితి గతుల విషయం సూర్యుని పై కూడా అధారపడి ఉంది.. మనం ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే అర్దం చేసుకుంటున్నాం.. సూర్యుని ప్రభావాన్ని పూర్తిగా అర్దం చేసుకోకముందే, మన వాతావరణాన్ని మన చేతుల్తోనే వినాశనానికి గురిచెయ్యటం భావ్యం కాదనే విషయాన్ని ఆందరూ గుర్తించాలి..
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, June 13, 2010
సోలార్ ఫోర్స్:(translated from NGC documentary)
Labels:
science
Subscribe to:
Post Comments (Atom)
Great effort!!!!
ReplyDelete@Anonymous: Thank you very much...
ReplyDeleteanna superb anna,
ReplyDeletekavitalu cheptav, joks cheptav, science kuda cheptava anna..
grt anna
anna superb anna,
ReplyDeletekavitalu cheptav, joks cheptav, science kuda cheptava anna..
grt anna
need to appreciate ur hard work
ReplyDeleteపోస్ట్ చాలా బాగుంది మౌళీ, చాలా విజ్ణానదాయకంగా ఉంది. 2013లో సంభవించబోయే సౌరతుఫాను గురించి చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ టపా ప్రాముఖ్యత కలిగినది. చాయాచిత్రాలు ఎక్కువ ఉండటం వలన చదవటానికి కొంచెం కష్టం అనిపించింది. కానీ నువ్వు ఎంచుకున్న అంశంలోని ప్రత్యేకత టపా మొత్తం చదివేలా చేసింది. ఏదేమైనప్పటికీ ఇది చాలా మంచి ప్రయత్నం, సమయం చూసుకుని ఇలాంటివి మరిన్ని పోస్ట్‌లు ఇస్తావని ఆశిస్తున్నాను.
ReplyDelete@ravi g & @Anonymous:2: Thank you very much
ReplyDelete@sarath: చాలా చాలా దన్యవాదాలు శరత్.. పురాతన కాలం నుండీ సూర్యుని మీద, నక్షత్ర రాశుల మీద, జనాలలో క్రియేట్ చెయ్యబడ్డ అపోహలు చాలా ఉన్నాయి.. ఈ డాక్యుమెంటరీ ద్వారా.. కొంత మేరకు నిజా నిజాలను అర్దం చేసుకోగలిగాను.. ఆసక్తిజనకంగా ఉండటంతో, సాటి నెట్జన సందోహంతో పంచుకోవాలనిపించి.. ఇలా పోస్ట్ చేశాను.. నీ సూచన మేరకు అలాగే పుర జనుల స్పందన మేరకునూ ఇక ముందు కూడా సమయం చూస్కుని.. ఇలాంటి మంచి విజ్ఞానధాయకమైన విషయాలను పోస్టు చేసేందుకు సమాయుత్తమౌతున్నానని చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాను.. మరొకసారి దన్యవాదాలు..
ReplyDeletegood keep it up Kranthi kiran Akula
ReplyDeleteశహబాష్...శాస్త్రీయ విషయాలు చదవడంలో సహజమైన నిరాసక్తత వున్నా...మీ సోదాహరణమైన విశ్లేషణ నాచే అమూలాగ్రం చదివించిందండి. నిజానికి నేనెన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. చంద్రమౌళి గారి పొస్ట్ చదవడం మానసిక ఉల్లాసంతోపాటు విజ్ఞానధాయకమైన సమాచారన్ని అందిస్తున్నదనే విషయం అర్థమైనది. విషయాన్ని ప్రభావవంతమైన మాటలలో చెప్పడం అభినందించదగ్గది. మీ పొస్ట్ చదువుతుంటే మీతో మట్లాడుచున్నట్లు ఉండటం విషేశించి ప్రస్తావించదగినది.
ReplyDeleteబ్లాగుపైన నడుస్తున్న మీ వాక్యాలు ఒత్తిడినుంచి ఉపసమనం కలిగించయండంలొ ఏమాత్రం సందేహం లేదు. కృతజ్ఞతలు.
బ్లాగుపైన నడుస్తున్న మీ వాక్యాలు ఒత్తిడినుంచి ఉపసమనం కలిగించాయనడంలొ ఏమాత్రం సందేహం లేదు. కృతజ్ఞతలు.
ReplyDeleteబ్లాగుపైన నడుస్తున్న మీ వాక్యాలు ఒత్తిడినుంచి ఉపశమనం కలిగించాయనడంలొ ఏమాత్రం సందేహం లేదు. కృతజ్ఞతలు.
ReplyDelete@Apparao: అప్పారావు గారూ.. చాలా దన్యవాదాలండీ..
ReplyDeleteపోస్ట్ చాలా బాగుంది మౌళీ, జనాలకి చాలా అవసరం.........శహబాష్...
ReplyDelete