ప్రకృతిలో సహజ అందాలు కన్నులకింపుగా అద్భుతంగా ఉంటాయి.. పాపం భాష.. నాలాంటి పామరుడి దగ్గర నుండి పండితుడి వరకూ ఎవరు ఆ అందాలని వర్ణించాలనుకున్నా.. ఆ అందానికి సంపూర్ణత్వాన్ని చేకూర్చగలిగే సత్తా తనలో లేక చేతులెత్తేస్తుంది.. అందుకే అంటూంటారు.. శ్రవణం బహు సామాన్యం.. దృశ్యం అద్భుతం.. అనుభవం సర్వస్వం మరియు సారస్వతం అని.. నిజమే కదా.. |
బొమ్మ చాలా బాగుంది, కవిత కూడా బాగుంది. మీరేం అనుకోకపోతే ఓ చిన్న మాట! 'తలుకుల బెలుకుల' అనే పదాన్ని 'తళుకుల బెళుకుల' అని మారిస్తే ఇంకా అందంగా ఉంటుందని నాకనిపించింది :-)
ReplyDeleteమధురవాణి గారూ.. నా భాషా వైకల్యానికి తీవ్రంగా చింతిస్తున్నానండీ.. మీ సూచన అమలు పరచాలనే భావన నాకున్నప్పటికీ.. నేను చాలా రోజుల క్రితం తయారు చేసుకున్న .xcf format ఇమేజ్ ఫైల్‌ని పోగొట్టుకోవటం వలన, convert చేసిన ఈ ఫ్లాష్ ఫైల్ మాత్రమే ఉండటం వలన ఎడిటింగులేవే చెయ్యలేకపోయానండీ.. మీ సూచనకి నా ధన్యవాదములండీ.. ఇంకా నా భాషా వైకల్యానికి క్షంతవ్యుణ్ణి అండీ..
ReplyDeleteబొమ్మ, కవిత రెండూ అదుర్స్
ReplyDeleteచాలా థాంక్సండీ సౌమ్య గారూ..
ReplyDelete