ఇది మరీ ధారుణం కదండీ, ఏదో మాట వరసకి ఏదన్నా అంటే అలా ఎటకారస్తున్ననేస్తున్నారు వీళ్ళంతా. విషయమేంటంటే నా ఫ్రెండొకడున్నాడు వాడి దగ్గర నేనొక పుస్తకం తీసుకున్నాను (తీసుకున్నాను కానీ చదివేడిస్తే కదా), దాన్ని తిరిగిచ్చేద్దామంటే ఆ రోజు తీరిక లేక నా ఇంకొక ఫ్రెండుని రిక్వెస్టు చేసి ఆ పుస్తకాన్ని దాని "ఓనరు"డుకిచ్చేయమని చెప్పాను(ఓనరుడు అన్నానని వీడు నన్ను ఎటకారస్తున్ననేశాడు). ఇక్కడొచ్చిన చిక్కేంటంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ముఖపరిచయం లేదు, అందువలన బుక్కు ఇవ్వాల్సిన నా ఫ్రెండడిగాడు ఆ ఓనరుడి పోలికలు ఎలా ఉంటాయో చెప్పమని అడిగాడు. వర్ణనలు చెయ్యటానికి నేనేమీ కాళిదాసుని కాదు కదా ఐనా చెప్పాను, చిరంజీవికి గాలి తీసేస్తే వెలిగిపోతున్న మోహన్‌బాబు మొహంలాగా ఫేసూ, చొక్కాలో ఇల్లు కట్టుకుని బ్రతికేస్తున్నట్టు బాడీ (మనోడు బాగా సన్నంగా, పీలగా ఉంటాడులే), చీకేసిన తాటి టెంకెలాగా జుట్టూ (అంటే ఎలా ఉంటే అలా చెప్పకుంటే వీడు పోల్చుకోలేడు కదా మరి).. ఈ మహానుభావుడు వాడి దగ్గరకెళ్ళి పుస్తకమిచ్చేసి ఉత్సాహం ఆపుకోలేక వాడితో ఫ్రెండ్సిప్ చేసుకుని మరీ నేను చెప్పిన పోలికల్ని వాడికి లీక్ చేసేశాడు.. మన బుక్కు ఓనరుడిగాడికి బాగా మండినట్టుంది, వాడు ఫోన్ చేసి మరీ నన్ను ఎటకారస్తున్నని తిట్టేశాడు.. పాపం నేను. నిజాలు చెప్పినందుకు ఇలా తిట్లు కాయాల్సొచ్చింది.. వీడు, అదే ఓనరుడు నన్ను ఇంకోసారి కూడా తిట్టేశాడు, ఆ స్టోరీ ఏంటంటే.. వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు, నేను బిజీగా ఉండి చూసి కూడా తియ్యలేదు, కానీ ఆ విషయం చెబితే వాడు నమ్మడు ఇంకా ఫీలౌతాడు కూడానూ, బిజీ తగ్గిపోయిన తర్వాత నేనే వాడికి కాల్ చేస్తే ఫోన్ లిఫ్టు చెయ్యలేదెందుకని అడిగేశాడు.. ఫోను సైలెంటులో ఉందీ వినబడక తియ్యలేదని చెప్పా.. అంటే వైబ్రేషన్ లేదా అన్నాడు.. వైబ్రేషన్ ఉంది కానీ ఫోనేమో మెత్తటి ప్రదేశం మీద రెండు క్లోత్స్ మద్యలోఉండిపోయింది కాబట్టి తెలియలేదు అన్నా, నా నోటి దురదని వాడు క్యాచ్ చేసేశాడనుకుంటా డౌటొచ్చి డీటెయిల్డుగా చెప్పమన్నాడు.. ఏం చేస్తాం చెప్పాను.. "అది కాదురా ఫోను పోకెట్లో ఉందీ అది మరి రెండు క్లోత్సు మద్యలో ఉన్నట్టే కదా.. ఆ పోకెట్టేమో నా తొడపైన ఉంది, తొడంటే మరి మెత్తని ప్రదేశమే కదా, నువ్వంటే బొత్తిగా బోన్ గాడివి వైబ్రేషన్ వస్తే బాడీ అంతా ఊగిపోతుంది" అనే సరికి టపీ మని ఫోను పెట్టేశాడు, సాయంత్రం వరకూ వాళ్ళ వీధిలో గుమ్మం దగ్గర కర్ర పట్టుకుని మరీ నిల్చున్నాడంట, నేనా దారిలో వెల్తానేమో ఒక చూపు చూడొచ్చని.. మనమటువైపు వెళ్తే కదా, కోపం తగ్గాక ఫోన్ చేసి కనీసం ప్ఫది సార్లనుంటాడు నన్ను ఎటకారస్తున్నని.. ఏం నాకు కోపం రాదా నేను కూడా కర్ర పట్టుకుని నిల్చున్నా గుమ్మం దగర, వాడు కూడా మా ఇంటి వైపు రాలేదు. నేను కొంచెం లావుగా ఉంటానేమో(ఒక మోస్తరు కంటే చాలా తక్కువే) ఐనా మా మామయ్య నన్ను ఇద్దరు మనుషులంటాడు (కనీసం ఒకటింపావు కూడ ఉండనంటే వినడే). ఒక సారి తనూ నేనూ తన కారులో కూర్చున్నప్పుడు దానికి బ్యాటరీ బాగులేక(ఇది మెకానిక్ చెప్పాడు) స్టార్టు కాకపోతే, కారు ఇద్దరు కంటే ఎక్కువమంది ఉంటే వెళ్దంట అన్నాడు, మరి నువ్వు దిగిపోతే కారెవరు నడుపుతారూ అన్నాను.. దానికే ఆయన నన్ను ఎటకారస్తున్ననేశాడు.. మీరే చెప్పండీ నేను ఎటకారస్తున్నా మా మామయ్యనా.. ఏంటో నోట్లోవేలెడితే లాలీపాపలో షుగరెయ్యటం మర్చిపోయారేంటీ అని అడిగే అమాయకున్ని నేను, ఇలాంటోడ్ని అందరూ ఎటకారస్తున్ననేయడమేనంటా!!.. ఇదేమన్నా న్యాయంగా ఉందా..?? :) |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, June 3, 2010
నేను ఎటకారస్తున్నా..!! :)
Subscribe to:
Post Comments (Atom)
:)
ReplyDeleteబావుంది మీ పోస్ట్
మీరు నిజంగానే ఏటకారుస్తున్నరేమో.....?
ReplyDeleteబావున్నాయి మీవెటకారాలు.
ReplyDeleteMeeru mummaatiki vetakaaristhunnaaru anthe
ReplyDeletedatz true mouli.... neeku vetakaram konchem ekkuve.....
ReplyDeleteఅద్దిరిపోయింది పోస్టు
ReplyDeleteనేను మాత్రం ఎటకారించట్లేదండి . నిజమే చెప్తున్నా :)
అస్సలు అస్సలు న్యాయంగా లేదు...
ReplyDeleteivi mumatike punchule,,
ReplyDeleteem punches anna..