కొళాయి నీరు ఒక చుక్క బయటకి పోతుంటేనే చటుక్కున ఆపేస్తావు కదా, మరి నీ కన్నీరు అలా దారగా పోతున్నా నీ మనసుకేమీ అనిపించటం లేదా?, ఔనులే పగిలిన మనసు ముక్కలను అడ్డం తొలగించుకుని ఉబికి వచ్చే ఆ నీటిని నువ్వు మాత్రం ఎలా ఆపగలవ్. ఎంతో బరువుని మదిలో ప్రతి కణపు పొరల లోతుల్లోనూ దాచుకుని ఒక నిమిషమైనా ఆ భారాన్ని పంచుకునే నీ అనే మనిషి దరిలో లేని నిన్ను చూస్తుంటే అనంత కాలం పాటు ఆకాశాన్ని మోస్తూ కొంచెం సాయం కోసం చూసే గ్రీకు పాత్ర అట్లాస్ గుర్తొస్తున్నాడు. పాపం!!..... ఎందుకు పుట్టాను సుమా? అని అంతరాత్మని ప్రశ్నించుకునే జాబితాలో ఒకడివే ఐనా అందరూ తమతమకిచ్చుకునే సమాధానం నీకు సరిపడని అసంతృప్తుడివైపోయావ్. పోవాలన్నా నొప్పేనంటావ్ పోనీ ఉందామన్నా నొప్పే అంటావ్... మదిలో భారాన్ని ఎద లోతుల్లోకి దొర్లించి సేద తీరొచ్చు కదా అంటే, అది ఎప్పుడో ప్రేమాగ్ని శిఖలలో ఆహుతై, ఆవిరై, రక్తాన్ని పంచే ఒక సగ-జీవ కండరమైపోయిందంటావ్. మానసిక రోగివా లేక మేధావివా, ప్రేమానురాగాలు గడ్డ కట్టి పోయిన మానవ ధృవానివా, నువ్వో శవానివా??????? చెప్పవే ఓ మనసా గొంతు విప్పవే నా మనసా!!! :( |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, January 29, 2011
చెప్పవే ఓ మనసా, గొంతు విప్పవే నా మనసా!!
Thursday, January 27, 2011
Tuesday, January 25, 2011
రాలే పత్రాలు - falling leaves
ప్రతి శిశిరాన్నీ ఆనుకుని ఒక వసంతం ఉంటుంది, వస్తూనే నవ హరిత శోభని వృక్షాలకందిస్తుంది వసంతానికీ వృక్షాలకీ ఉన్న అనుభందం అలాంటిది, కానీ రాలిన ఆకులకి నివాళి అర్పించటం తప్ప ఇంకేం చేయగలుగుతుంది? ![]() |
Monday, January 24, 2011
Wednesday, January 12, 2011
Subscribe to:
Posts (Atom)