నిజం, ఆ సిట్యుయేషన్ చాలా నిజం ... వాడు ఆడుతున్నంత వరకూ, ఫెదరరైనా, నాధల్ ఐనా... చేతాకాని వాళ్ళు అనిపించేలా ఉంటుంది. .. నీ కోర్టులో బాల్ పడితే... ఔను అప్పుడు తెలుస్తుంది ..... ఎలా ఆలోచించాలో, ఏంటో... పరిస్థితుల్ని ఎదుర్కోవటం ప్రతి ఒక్కరికీ అలవాటైన విషయం కాదు... గాలి వీచని దుర్గంద భూయిష్ట సంద్రం రోజూ కలలోకొచ్చేవాడికి... సుగంధ శోభిత గగన సదృశం నుండి నొప్పి తెలియని మెత్తని నేల మీద పడేస్తే... అది కూడా తట్టుకోలేడేమో... కాలం వేసే ఆ గాళానికి చిక్కని ఆ మనసేదో ... అలాంటిదసలుంటుందా?... నీ సైజు పెరుగుతున్నావని సంబర పడకురా ఎదిగిన నీ వయసు పెట్టే పాట్లు నీకేం తెలుసు అన్నాడంట ఒక పెద్దాయన ... కలలు నేలమీద ఉండవు, నేల మీదుండేది కల కాదు, మరి జీవితం నచ్చని వాడు ఏం చేయాలి, ఎప్పుడు చూసినా ఆ నిజం చిరాకు పెట్టే జీవితం ఎందుకు ఎదొర్కుంటున్నాడో, దానికి అర్దమే లేని వాడు ఏం చెయ్యాలి?? భావగర్భితమైన తన ఆక్రోశాన్నంతా వెదజల్లాలా? ఏమో?? ఏం చెయ్యాలో... |