అలా మాట్లాడుతూనే ఆమెని అడిగేశాను... ప్రేమించటమంటే ఎందుకని మీ అమ్మాయిలంతా, మీ మనసుకి నచ్చిన సోదిని వినే ఒక కౌన్ కిస్కా గొట్టాం గాడు దొరకటం మాత్రమే అనేటట్లు చూస్తారు? వాడు ఎలా ఉండాలో, ఎలా కనపడాలో, ఎలా ప్రవర్తించాలో ఇలా అన్నీ మీరు నిర్ణయించి మీకు నచ్చినట్లు చెయ్యాలని చూస్తారు? మీకుండే ఇన్ సెక్యూర్ ఫీలింగుని వాడి ఇనెబిలిటీకో లేక డిజెబిలిటీకో ముడిపెడతారు?... మౌనం వహించిందామె అది తుఫాను ప్రశాంతతా అనేటట్లుగా... శబ్ధారంభం సౌమ్యంగా అనిపించినా, సమాధానం ఘాటుగానే ఉంది. మీ అబ్బాయిలంతా ఎందుకలా అమ్మాయిల్ని ఏలియన్సుని చూసినట్లు చూస్తారు, మిమ్మల్ని ప్రేమించే అమ్మాయిల్ని మీ వెనక తిరిగే కుక్కలా హీనంగా భావిస్తారు, ఆమె శరీరానికే ఎందుకు విలువిస్తారు, ఆమె మనసన్నా, మాటన్నా అంత చులకనగా ఎందుకుంటుంది??? శబ్ధ తీవ్రత తుఫాను కాక అదేదో సునామీని తలపించింది... జాన్ గ్రే men are from mars and women from venus,అలాగే జాన్ మిల్టన్ తను కోల్పోయి పొందిన స్వర్గాలలోని అంతరాలు అర్ధమయ్యాయి, ఎందుకో మిల్టన్ జాన్ గ్రే కంటే చాలా అమాయకుడనిపించింది, నిజానికి నేను ఆ నవలలు చదవలేదు కానీ, అమ్మాయిల మనస్త్వత్వం ఎలా ఉంటుందో తెలిసే ఉత్తమ జాతి నేర్పరికి (ఇతరులని చూసి నేర్చుకునేవాడు), ఆ టైటిల్సులో పరమార్థం ఉడుకుతున్న బియ్యం మెత్తబడిందో లేదో దాన్ని తడమకుండానే చెప్పగలిగినంత సౌలభ్యం అనిపించింది... పాపం పైన ఆమె అడిగిన ప్రశ్నలు అందరి విషయంలో నిజం కాకపోయినా అందులో అతిశయోక్తి అతిగా లేదనిపించింది... ఆ మద్యన చూసిన ఆరెంజి సినిమాలో, తను ప్రేమించే ప్రేమకి నిర్వచనం కానీ పరమార్థం కానీ చెప్పుకోలేని కథానాయకుని పాత్రని సృష్టించిన రచయిత మనస్తత్వం చూశాను, అదే సినిమాలో ఇంకో పాత్ర ప్రేమంటే ఇదీ అని జీవిత కాలం భార్య పెట్టే పోరుని/సోదిని భరించగలిగే ఎబిలిటీని చాటి చెప్తాడు... స్వార్థం ఇష్టపడే కథానాయకుడంటే ప్రేక్షకుడికి ఇష్టం ఉండదు అలాగే అది నిజ జీవితం ఐతే అలాంటబ్బాయి అంటే ఏ అమ్మాయికీ ఇష్టం ఉండదు... మరి గొంతులో దుఃఖాన్ని దాచుకుని నవ్వుతూ రోజుకో పూలకుండీ కొనుక్కునే పాత్ర అంటే జనాలకి ఎందుకంత ఇష్టం... (వాళ్ళు జనాలు వాళ్ళనడిగి వేస్ట్ అని అంతరాత్మ వెకిలిగా సమాధానం ఇస్తుంది) నిరంతరం అనుసంధానమై ఉండే సౌకర్యం ఉండే ప్రపంచంలో అనుక్షణం విషయ సంగ్రహణ సామర్ధ్యం కలిగి ప్రతీ నిమిషం ఆర్ధికాభివృధ్ధి సాధించాలనుకునే జనాలకి, భోజనాలని ఈ మెయిల్లో పంపగలిగితే బాగుండు, పిల్లల్ని ప్రింటౌట్ తీసుకోగలిగితే బాగుండు, తన మెయింటెనెన్సూ, జాగ్రత్తలూ తీసుకోమని అడగని పరికరాలే తమ జీవిత బాగస్వాములైతే బాగుండు అని భావించే అభినవ అభివృధ్ధి పద ప్రపంచంలో పలువురు పలికే వాక్యం "ప్రేమా పేడకడి తట్టా".... ఎందుకీ ఎనాలిసిస్ నీకూ, దేనికిది రాస్తున్నావూ, ఎవరన్నా డబ్బులిస్తారా నీకూ, లేక పని లేదా, ఈ కాలంలో ఎవడన్నా ఇంటరెస్టు మాత్రం ఉందని ఏదైనా పని చేస్తాడా... ఇది నేను రాస్తున్న పోస్టుకొచ్చిన కితాబు... మనసులో ఏమి తోచక సమాధానంగా చెప్పాను, కేర్నాట్ ఇంజిన్ లోనికి వచ్చిన ఎనర్జీ బయటకెళ్ళటానికి సింకొకటి కావాలి, అది నాకు ఇదే అని చెప్పాను... మరేం చెప్పనూ జీవితమంతా, ఇంగ్లీషు వచ్చీ రాని మనిషి inception సినిమాని మొదటిసారి చూస్తున్నట్లుంటే ఆల్మోస్టు ఎవరైనా ఆ టైపులోనే సమాధానం చెబుతారు... ఎంత వెతికినా ఏం చూసినా, పాత సినిమాల్లో కనిపించే అందమైన ప్రేమ, స్వంత ఊహల్లో జనించేంతటి స్వఛ్ఛమైన ప్రేమ, నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్... ![]() |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, December 15, 2011
నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్...
Subscribe to:
Posts (Atom)