మనం అప్పుడప్పుడూ ఫ్రెండ్సుని కలవటానికని వాళ్ళ ఇంటికి వెళుతుంటాం కదండీ అలానే, మా ఫ్రెండొకడింటికి వెళ్ళానన్నమాట, చాలా రోజులకి సొంతూరు వెళ్ళి అక్కడి ఫ్రెండ్స్ ని కలవటం చాలా తృప్తినిస్తుంది కదండీ, వాళ్ళ నాన్నగారితో కూడా పరిచయం ఉండేసరికీ, లోపలికి వెళ్ళగానే ఎదురు పడి కుశల ప్రశ్నలు వేసే ఆయనతోనే సంభాషించాల్సి వచ్చింది. "ఏంట్రా అబ్బాయ్! ఎప్పుడు రాక ఊళ్ళోకి, నువ్వు బాగా చదువుకుంటావట కదా", అని ఆయనడిగాక సమాధానమేదో చెప్పి మా ఫ్రెండు గురించి అడిగే సరికి, "నువ్వు ఆ గాడిద కొడుకు గురించి వచ్చావా??", అన్నాడు, మనకి.. సారీ నాకు నోటి దురద ఎక్కువేమో "ఆహా లేదంకుల్ మీ అబ్బాయినే కలుద్దామని వచ్చాను", అని చెప్పే సరికి టంగ్ కర్చుకొని మొహం ముడుచుకోటం ఆయన వంతయ్యింది. ఎదవ ఎక్కడున్నాడో ఏంటో, భోంచేసి బయటికెల్తే మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు, ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కలవదు. బ్యాలెన్సైపోతే ఇన్ కమింగు కూడా రాదంటాడ్రా వాడూ, అదేంటంటే వాడు బేవార్సుగా రోమింగులోనూ వాడి సిమ్ కార్డేమో ఫోన్ లోనూ ఉంటాయి కదా అందుకే రోమింగులో ఉన్నప్పుడు నిల్ బ్యాలెన్స్ ఐతే ఇన్ కమింగ్ కూడా రాదనీ , అదెవరో వాడి పాత గర్లు ఫ్రెండంట, వాడి ఫోన్ అందక నాలుగు సార్లు ఆమె ఇంటికొస్తే నాలుగో సారి పొరపాటున దొరికిపోయీ ఆమెకీ విషయం చెప్పి కన్విన్స్ చేసేశాడు, ఎదవ తెలివైనోడే అనుకో (ఆశ్చర్యం నా వంతైందిక్కడ), గర్లు ఫ్రెండు ఫోనుకి దొరకనోడు నాకెలా దొరుకుతాడురా ఆ అడ్డగాడిద". ఈయన పరిస్థితి ఏదో తేడాగా ఉందనిపించి, "ఏంటి అంకుల్ అసలేమయ్యింది వాడిని అలా తిడుతున్నారు", అని అనడిగాను. ఈ తరం కుర్రాళ్ళకి అసలు పేరెంట్సు ఫీలింగ్సేమీ వంటబట్టవారా వాడు ఒక్క మాటా వినడే, కనీసం వినిపించుకోడే. ఐనా నాకో విషయం అర్దం కాదూ అక్రమ సంభందాలూ, అనవసర సంభందాల వలన ఎయిడ్సొస్తుందని చెబుతుంటారు కదా, నాకేంట్రా సక్రమ సంభందంలోనే అంతకంటే డేంజరెస్ ఫెల్లో వీడు తగలడ్డాడూ. "అంకుల్ మీరు వాడ్ని మరీ ఇంత ధారుణంగా తిడుతున్నారేంటి అంకుల్, అసలేమైంది అంకుల్", అన్నాను. ఆయన వింటే కదా ఊహూ! ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు,"మొన్నటికి మొన్న వచ్చి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా డాడీ, అందుకే ఆ మొక్కలు పీకే పని కోసం వెళతానన్నాడు, ఆ ఉడతలు పట్టే నా---గాడు". అవేం మొక్కలని ఆయన్ని అడిగితే ఏవో మెడిసినల్ వేల్యూస్ ఉన్న మొక్కలంట అని చెప్పీ మళ్ళీ స్టార్ట్ చేశారాయన,"అసలు ఆ సినిమాకి 3ఇడియట్సు అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా, మొదటోడు బేవార్స్ వాడికి తల్లీ తండ్రీ ఇంకా భందువులు వీరెవరూ అక్కర్లేదు, వాడేది కావాలంటే అది చెయ్యొచ్చనుకుంటాడు, తెలివితేటలుంటే చాలా సొసైటీలో బతకడా వాడూ, పోనీ వాడు ఊరికే ఉన్నాడా పోయి పోయి మిగిలిన ఇద్దరినీ కెలికి మరీ ఏది నచ్చితే అదే చెయ్యమని నూరి పోశాడు . ఏటనుకుంటున్నాడ్రా వాడు నేను ఇలాగే ఉంటానూ అవసరమైతే బిల్డింగుల మీది నుండి దూకుతాను అంటే ఉద్యోగాలు ఏ కంపెనీ ఇస్తుంది రా (ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు), ఇంకొకడున్నాడు.. పోనీలే లేక లేక పుట్టాడని వాళ్ళయ్య వాడి కోసం మద్య తరగతి వాడయ్యుండీ కూడా ఇంజినీరింగ్ చదువుకోమంటే, ఊహూ నేను కుక్కలకీ,కోతులకీ ఫోటోలు తీస్తానంటాడు.. సినిమాలో చూపించనంత మాత్రాన వాడు తీసే ఫోటోలకి ఉద్యోగమెవడిచ్చేస్తాడురా, కంప్యూటర్ చదువులకున్న డిమాండు వాటికెక్కడుందీ, అందులో ఫెయిలైతే పెళ్ళిల్లకి ఫోటోలు తియ్యటానికి కూడా పనికిరాడు వాడు, ఒక వేళ పిలిచినా అక్కడ తిరిగే పిల్లినో, కుక్కనో ఫోటోలు తీస్తాడు". హమ్మ 3ఇడియట్సు మూవీ ఈయనికిలా అర్ధమయ్యిందా అనుకున్నాను, ఇంతకీ నీ ఒపీనియనేంటీ ఆ సినిమా పైన అని ఆయన అడిగే సరికీ చూద్దామనుకునే సరికి టికెట్లు దొరకలేదంకుల్, తర్వాత టైం దొరక్క చూడలేదని చెప్పాల్సొచ్చింది, ఆయన నన్నెక్కడ ఇరికిస్తాడోఅని చెప్పి."చూశావా నీకు టైం దొరకదు, వాడైతే టైముకే దొరకడు", హిహిహిహిహిహిహిహ్(ఇది బస్ తప్పిపోయినలాంటి నా వెకిలి నవ్వు) అని నవ్వి, ఆయనకి సినిమా నచ్చిందా లేదా అని అడిగాను, ఆయనకి నచ్చిందని చెప్పగానే,"అదేంటి అంకుల్ చివరికి ఆ ముగ్గిర్నీ ఏదో ఆదర్శమూర్తుల్లా చూపించరు కదా మీకెలా నచ్చింది", అన్నాను, నీకెలా తెలుసు అని అడిగిన ఆయన ప్రశ్నకి తడుముకోకుండా, నాకున్న ఒక ఉత్సాహం అప్పుకోలేని ఫ్రెండు ఒకడు స్టోరీ చెప్పాడని సర్ది చెప్పేశాను. దానికాయన,"కమర్షియల్ యాంగిల్లో డబ్బుల కోసం కథని అలా డైవర్టు చేసినా, వాళ్ళవి వెధావాలోచనలనే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ముగ్గురు వెధవలు టైటిల్ని అలానే ఉంచారు", అన్నాడు, ఓరి వీడి ఆప్టిమిజం తగలెయ్యా అనుకున్నాను నాలో నేను. మరి మేం మాకు నచ్చింది చేస్తే ఏంటి ప్రోబ్లం అంకుల్, అందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న డెవలప్మెంటు ఉండేదా అని అడిగితే, అదంతా మాలాంటి పెద్దవాళ్ళు చేస్తే వచ్చిందిరా, కుర్ర కుంకలు మీకేం తెలుసని మీదికొచ్చాడు, అంటే పుట్టుకతోనే ఇలా ముసలివాడిగా పుట్టారా అని అడిగేసరికి మళ్ళీ నాలుక్కర్చుకున్నాడాయాన... "మీలాంటి పెద్దోల్ల వలనే ప్రపంచ యుధ్ధాలూ వచ్చాయ్, ఎయిడ్సులాంటి జబ్బులూ పెరిగాయి", అనే సరికి మండినట్టుంది ఆయనకి, ఏంట్రా పెద్దోల్లకే ఎదురు చెప్తావా ఏదో మంచోడివని నిన్నేమీ అనట్లేదు అని చెప్పి లుంగీ మడిచి, ముక్కు ఎగబీలుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడాయన(కోపంతో). హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటికొచ్చి నడుస్తుంటే, మా ఫ్రెండుగాడు కనిపించాడు.. కనిపించటమే తడువుగా వాడితో,"ఒరే ఎదవా స్టీల్ప్లాంటుకెళ్ళి బ్లాస్ట్ ఫర్నేసులో దుమికినట్లు, నిండు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఎటు పోవాలో తెలియని బాతులాగా, ఇంటర్వ్యూకి ఇన్ షర్టు చేసుకుని వెళుతూ బురదగుమ్ములో పడినట్టూ... ఇంకా ఎలా ఎలాగో ఐపోయింది నీ గురించి మీ ఇంటికెళ్ళిన నా పరిస్థితి. నువ్వు సినిమాలు చూస్తే చూశావ్, ఇక నుండి మీ ఇంటికి వచ్చే ముందు నీకు ఈ మెయిల్ చేస్తా, దానికైనా రిప్లై ఇవ్వు , నువ్వు ఉన్నావో లేవో రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ లేటెస్టుగా నువ్వే సినిమా చూశావో చెప్పి పుణ్యం కట్టుకోరా.. నా టైం బాగుండి నువ్వేదో మంచి సినిమా చూశావ్, ఏ రక్త చరిత్రలాంటి సినిమానో చూసి ఉన్నట్లైతే నన్ను నలుగురు కలిసి తీసుకెళ్ళాల్సొచ్చేది, అని వాపోయి అక్కడినుండి ఉడాయించాను. అసలు విషయమేంటంటే వాళ్ళింట్లో అందరు తండ్రులూ వాళ్ళ కొడుకులు కలెకర్లవ్వాలని కల కనేవారంట, "అతి""కష్ట"పడి చదివి వాళ్ళంతా గుమాస్తా దగ్గర్నుండీ బిల్లు కలెక్టరు వరకూ రీచ్ అయ్యారు, వీడికి రీసెర్చి ఇష్టమనీ అందులోకి దూరేస్తే, ఆయన నాకీ సినిమా కథ చెప్పాడు. |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, May 29, 2011
వీడి కంటే ఎయిడ్సే నయం..
Sunday, May 22, 2011
ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్కి ఎప్పుడూ కథలు చెప్పకూడదు..
"సమయం పది గంటలు కావస్తోంది, అప్పటికి ఖచ్చితంగా అరవై నిమిషాల వ్యవది ముందే ఆ రోడ్డుకి రెండు వరుసల అవతల ఉన్న స్కూల్ బెల్ గణగణమంటూ మ్రోగింది![]() ![]() హీరో నేల మీదకి దూకగానే విలన్ గ్యాంగ్ వాడిని వల వేసి మరీ పట్టుకుంది... కానీ విషయమేంటంటే, వాళ్ళు పట్టుకుంది హీరోని కాదు, పదో అంతస్తు పిట్టగోడ మీద అంతకు ముందు రోజు హీరో తినేసి పడేసిన అరటి తొక్క మీద కాలేసి జారిన కమెడియన్ని వాళ్ళు పట్టుకున్నారు. "ఒరేయ్ నీ..." (ఈ పిలుపు కథలో బాగం కాదు, మా ఫ్రెండు పిలిచాడు), "ఏంట్రా", అన్నాను.. "మొదటి నుండీ హీరోయే వస్తున్నాడన్నావ్ కదరా, ఐనా ఎవడైనా కంపేరిజన్ కోసం పది గంటలకి ఆఫీసు ఓపెన్ చేస్తున్నారనో లేకపోతే షాప్ తెరుస్తున్నారనో చెబుతారు, నువ్వేంట్రా గంట ముందు ఎక్కడో ఉన్న స్కూల్ బెల్ మ్రోగిందని చెబుతున్నావ్" అన్నాడు వాడు. "మరి హీరో రాకపోతే, వచ్చేది కమెడియన్ ఐతే ఆ విషయం ముందే చెప్పాలి కదరా పాఠకులకీ లేదా ప్రేక్షకులకీ ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() మూర్చపోటానికి సిధ్ధంగా ఉన్నవాడు కాస్తా, ఒక్కసారి కోపంగా పైకి లేస్తూ.. ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్ కి కథ చెప్పకూడదు అని నేను మాత్రం డిసైడైపోయా.... |
Thursday, May 19, 2011
Tuesday, May 10, 2011
Saturday, May 7, 2011
Friday, May 6, 2011
ఆర్ట్ డ్రాయింగ్స్-4
Sunday, May 1, 2011
అంతర్జాలం....!!
|
Subscribe to:
Posts (Atom)