నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Sunday, October 17, 2010

పందికేం తెలుసు పన్నీరు వాసన...

ఇంటర్మీడియట్లో ఏమీ తెలియని వయసులో ప్రేమకి ఎంతో విలువ  ఇచ్చే ప్రతివారూ, PG, Ph.D., లకి రాగానే, లవ్‌ని అదేదో గార్బేజీలో పడేయాల్సిన విషయంలాగా చూస్తారెందుకనో... ఏదో సామెత చెప్పినట్టూ పిగ్గీ బ్యాంకులో చిల్లర పోగు చేసుకుంటా డాడీ అనే పిల్లాడు పెరిగి, పందికేం తెలుసు పన్నీరు వాసన అన్నాడంట...

5 comments:

  1. ఆకర్షణకి తొడిగే అందమైన వస్త్రమే ప్రేమ.బట్ట మాయగానే ఎలా పక్కనపెదతామో +౨ ప్రేమలు అంతేనండి.దీన్ని మీరు ప్లాటోనిక్ లవ్ అన్కుంటే ఎలా?వయసుతోపాటు ఎంపికలు,ఇష్టాలు మారిపోతున్డటం ఎంతో సహజం.ఒక కాన్డ్లేతో మొత్తం పుస్తకాన్ని చదవలేము కదా.ప్రేమ ఏర్పడటానికి సుదీర్ఘమైన సాహచర్యం ఎంతో ప్రధానం.మొదటిచూపులో ప్రేమ అనేది వట్టి ట్రాష్.అది ఆకర్షణ మాత్రమె.ప్రేమ పుట్టేది పెళ్లి తర్వాత మాత్రమె.

    ReplyDelete
  2. @astrojoyd:
    ముందుగా మీ కామెంట్‌కి చాలా చాలా దన్యవాదాలు:

    అందరూ ఎందుకండీ ఆకర్షణని పాపం అంతగా నిందిస్తారు, మీకో విషయం తెలుసా, ప్రేమలో ప్రోబ్లం ఆకర్షణ ఉండటం కాదు, దాన్ని కాపాడుకోలేకపోవడం.. మాసిన బట్టనీ ప్రేమనీ ఒకేలా చూస్తే ఎలా అండీ, ప్రేమంటే కట్టుకునే బట్ట, తీసుకునే ఆహారం అని భావించేవారంతా దానిలో రకాలని వెతకటానికి, విశ్లేషణ చెయ్యటానికీ వాడుతుంటారు, ప్రేమని బట్ట కట్టుకునే అవసరంలాగానో, ఆహారం తినాల్సిన ఆకలిలాగానో భావించేవాళ్ళకి కనిపించే ప్రేమ ముందు చెప్పిన రకాల వాళ్ళకి కనిపించదు..

    మన సామాజిక అవగాహనలు, అలవాట్లు మరియు సాంప్రదాయాల ప్రకారం ఫిజికల్ ప్రేమని ఆకర్షణగా మాత్రమే మనం పరిగణిస్తాం, అదే ప్రేమ భార్యా-భర్తల మద్య ఫిజికల్‌గా కూడా ఉంటుంది.. సమాజంలో ఏ మనిషీ వాళ్ళది ప్రేమ కాదని, ఆకర్షణ మాత్రమే అనీ అనడేం?

    ప్రేమని కలిగించే కారకాలైనా, అవి కలిగిన మనుషులైనా అవి ఫిజికల్‌గానే అందరికీ తెలుస్తాయి, మీరనుకునే మాట కూడా, ద్వని అనే ఫిజిక్సు ఉపయోగిస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. మరి ప్లటోనిక్ లవ్ ఐడియల్ లవ్ ఎలా ఔతుందని మీ ఉధ్ధేశ్యం?

    మనిషికి కాలంతో పాటుగా తన ఇష్టాయిష్టాలలో మార్పులు రావచ్చేమో, కానీ తను ఫీలయ్యే ఎమోషన్లో తేడా ఎలా ఉంటుందనుకుంటారు, మీరు పుట్టినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే వచ్చే నొప్పి ఇప్పుడు కొత్తగానూ తేడాగానూ ఉంటుందా చెప్పండీ, ఎంతమంది తమ టేస్టు మారుతుందని చెప్పి వాళ్ళ లవర్లని, భార్యలని మార్చేస్తారు చెప్పండి.

    ఒక క్యాండిల్‌తో పుస్తకమంతా చదవలేమంటే...? :) ;) మీ ఉధ్ధేశ్యం ఏంటో?

    సుధీర్ఘమైన సాహచర్యం ఉన్నంతమాత్రాన, ప్రేమ కలిగితే ఇప్పటికి ప్రతి ఒక్కరికీ వేలమంది లవర్లుండే అవకాశం ఉంది...

    మొదటి చూపులో ఉండేది ట్రాష్ మాత్రమే ఐతే అది మీ అభిప్రాయానికి మాత్రమే పరిమితమని నేను భావిస్తాను....

    కరెక్టుగా చెప్పారు పెళ్ళి తర్వాత మాత్రమే ప్రేమ ఉంటుందని, కానీ పెళ్ళికి ముందు ప్రేమ లేకుంటే, అదెలా ఉంటుందంటే.. పిల్లాడు బార్బీడాల్ కావాలంటే తండ్రి తన చిన్నప్పుడు RRB ఎగ్జాం ఫెయిలయ్యాడని రైలింజను బొమ్మని కొనిచ్చినట్లవుతుంది... ఏదో ఒకటి బొమ్ముంటే చాల్లే అనే, మినిమం సృజనాత్మకతా, రసజ్ఞతా కూడా లేని పిల్లలంటే సరాసరి డెబ్భై శాతం మంది తల్లిదండ్రులకి చాలా ఇష్టం...
    -------------
    ఆస్టరాయిడ్ గారూ మీ పాలిట కామెట్‌లాగా ప్రశ్నలని సంధించినందుకు మీరు అన్యదా భావించవలదు, ఏదో అవి నా పర్సనల్ ప్రశ్నలు... నాకు మాత్రమే పరిమితమైనవి...

    --
    భావ దారిద్యపు సమాజానికి సోక్రటీసు కూడా పిచ్చివాడే, పూర్ ఫెల్లోని నేనెంతా?

    ReplyDelete
  3. candle-bk xample in the sense,tastes differs acc to age nd conditions.for ex-u cant offer lot of gifts in ur 2nd year of love as u done in ur 1st year of love.
    2.Its nt asteroid as u pronounced,its astro joyd.so u r nt a comet also.
    3.pelliki munduleni prema tarvaata elaa?annaru..gd qstn-oka vyakthi saannidhyamlo,atadu ledaa aame istaa-istaalu telusukuntu unnapude prema chiguristtundi kaani,daaniki mundu-venukalatho prameyam ledu.saahacharyam ane padaaniki ardham ide.
    4.సుధీర్ఘమైన సాహచర్యం ఉన్నంతమాత్రాన, ప్రేమ కలిగితే ఇప్పటికి ప్రతి ఒక్కరికీ వేలమంది లవర్లుండే అవకాశం ఉంది...meeranukuntunnaattu.idi office leda parkullo gantalakoddi gadapadam kaadu.so velamandi loverlu is an eutopia only.
    5.మనిషికి కాలంతో పాటుగా తన ఇష్టాయిష్టాలలో మార్పులు రావచ్చేమో, కానీ తను ఫీలయ్యే ఎమోషన్లో తేడా ఎలా ఉంటుందనుకుంటారు,-surely there is a emotional difference acc to the age.ఆరేళ్ళ మీ పాప బడి నుంచి ఇంటికి రాకపోవడానికి ,ఇరవై ఏళ్ల మీ పెద్దమ్మాయి టైం కి ఇల్లు చేరకపోవడానికి మీరు పడేఎమోషన్లో లెవెల్స్ ఒకేలా ఉంటాయా?పెద్ద పిల్లెగా బస్సు దొరికి ఉండనుకుంటారు గాని,చిన పాప కోసం పదినంతగా ఆదుర్దా పడరు.
    ౬. మీరు పుట్టినప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే వచ్చే నొప్పి ఇప్పుడు కొత్తగానూ తేడాగానూ ఉంటుందా చెప్పండీ, ఎంతమంది తమ టేస్టు మారుతుందని చెప్పి వాళ్ళ లవర్లని, భార్యలని మార్చేస్తారు చెప్పండి.-ఎస్,there is no difference but ur tolerence limits varies certainly.THIS MAKES THE ACTUAL DIFFERENCE.changing of wives nd lovers is exclusively ur interpretation only yar.

    ReplyDelete
  4. మీకు భలే ధైర్యం సుమండీ..ఏకంగా సోక్రటిస్ అంతటి వ్యక్తి తోనే మిమ్మల్ని పోల్చుకున్నారంటే ..నాకా ధైర్యం లేదు బాబు..[అర్హతా లేదు]

    ReplyDelete
  5. @astrojoyd:
    మీ నేమ్‌/నిక్‌నేమ్‌ తప్పుగా లిఖించినందుకు క్షంతవ్యుణ్ణండీ...

    సహచర్యంలో చాలా రకాలుంటాయన్నమాట, అంటే చుట్టూ ఉన్న అందరూ కలిసి మీ అభిప్రాయాలు కలిసిపోతున్నాయోచ్ అనేసరికి, అవి ఆటోమేటిగ్గా కలిసిపోతాయన్నమాట.. ఒక పెయిర్ ఎక్కడైనా కూర్చుని తమ అభిప్రాయాలు పంచుకుంటే అది టైం వేస్టూ ఎట్రాక్షనే అన్నమాట, పాపం ఆఫీసుల్లో, పార్కుల్లో ప్రేమించుకునే వారిని ఎందుకండీ ఆడిపోసుకుంటారూ, మీకు ప్రేమ కాదనిపించినంత మాత్రాన వాళ్ళకీ అలానే అనిపించాలని అంటే ఎలా? మీకు మీ మ్యారీడ్ ప్రేమెంత ఇష్టమో వాళ్ళకి ఆ మ్యాడ్ ప్రేమంటే అంతిష్టం మరీ,

    ఇంటెన్సిటీలో తేడాని ప్రేమలో తేడాతో పోల్చారన్నమాట, మీ పిల్లల వయసు తేడా ఉందని వారి మీద ఉండే ప్రేమ తగ్గింది అని ఎవరన్నా మిమ్మల్ని అంటే మీ చెయ్యి చెప్పుమీదకెళ్తుంది(ఎక్స్పెక్టేషన్) కదా, మరి ప్రేమ ఎక్కడైనా ప్రేమే కదా.. ఎన్నాళ్ళగానో ఆ పిల్ల మీ ఇంట్లో మీ చేతుల మీదుగా పెరిగిందని బోర్ కొట్టి కొత్తగా ఎవరినో దత్తత తీసుకోరు కదా..

    నా interpretation తప్పైతే కాదండీ, ఎందుకంటే.. ఇప్పుడు సొసైటీలో ఉన్న డైవోర్సు కేసుల్లో అంతర్లీనంగా ఉండే మొదటి కారణం ego ఐతే, మిగిలిన ప్లేసుల్లోకి మిగిలినవన్నీ వస్తున్నాయంట..

    ఏమో మీరైతే జీవితాన్ని బాగా అనుభవించినవారిలా మీ ఛాయాచిత్రం విశదపరుస్తుంది... మాలాంటివాళ్ళమేమన్నా సరే పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అని చురకలు వేస్తారు పెద్దవాళ్ళంతా....




    @astrojoyd's another comment:

    ఏమండీ సోక్రటీస్ ఏమన్నా రెండుసార్లు పుట్టాడా లేక ఆయనకేమైనా కొమ్ములున్నాయా... ఆయనకి సమాజం మరియు జీవితం వగైరాలన్నిటిపైన్నా ఉన్న అభిప్రాయాలనీ, ప్రశ్నావళినీ తనదైన పంధాలో వివరించాడు.. ఔను మరి, సొసైటీ ఒక మూసలో వెళుతుందని అలాగే వెళ్ళాలనుకుంటే ఎలా? మనదెప్పుడూ మన త్రోవే... Every Philosopher believes that End and Eternity of the LIFE is Happiness... if someone else (even if its the society) decides what makes you happy... where the hell would the happiness would be.. Thats why one can live like as he/she likes without bothering others....

    I know your generation won't accept these kind of ideologies and likes to trash, such kind of people too..

    ReplyDelete