నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Thursday, November 4, 2010

నిన్ను లతలు పెనవేస్తున్న ఆ తరుణం...

"సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తాన...." అన్నట్లుగా అద్భుతంగా కనిపించిందీ వృక్ష-లతా కౌగిళి ఒకానొక సాయం సంధ్యవేళ... అంత దగ్గిరగా పెనవేసుకుపోయిన ఆ దృశ్యాన్ని తిలకించగలిగే ఏ జీవికైనా ఆనందం అతిశయమై హృదయం స్పందించి తీరుతుంది(హృదయం ఉన్నట్లైతే)... రియలిస్టులకి(అంటే నా దృష్టిలో హృదయం లేనివాళ్ళు అని అర్దం), ఆ తీగకి చెట్టు అనేది ఆధారం మాత్రమే, చెట్టు ఆధారం ఇవ్వలేనిదైతే తీగ దానిని అసరా చేసుకోదు అని అంటారు వాళ్ళు... అనంతమైన ఆనందాన్నిస్తాను ఆస్వాదిస్తావా అని ప్రకృతి అడిగితే, నాకదేమీ అక్కర్లేదు.. బాగా బతికేదీ, బ్రతికించేదీ ఏదైనా ఉంటే నా మొహాన పడేయ్ లేకుంటే మూసుకుని కూర్చో అని ప్రకృతికి కూడా చెప్పేవాళ్ళు ఆ రియలిస్టులు... వాళ్ళకి ప్రేమ కూడా ఒక అవసరం ఆధారంగానే పుడుతుంది... వేసుకునే బట్టలకీ, తినే ఆహారానికీ ఇచ్చినంత ఇంపోర్టెన్సు మాత్రమే దేనికైనా సరే ఇచ్చే ముముక్షువులూ, స్థితప్రజ్ఞులూ వారే... వాళ్ళకి living ఒక passion, feelings  ఒక lesion... వాళ్ళ విషయంలో వాళ్ళని తప్పు పట్టేందుకు మీకు ఒక్క అవకాశం కూడా లభించదు, ప్రపంచమంతా వాళ్ళ తత్వంతోనూ, వాళ్ళతోనూ నిండి ఉంది.. మీకు రియలిస్టులు ఒక వేళ నచ్చితే ప్రేమించానని చెప్పొద్దు, వాళ్ళకది పట్టదు, వాళ్ళది నమ్మరు... నేను పోస్టు చేసిన కవితకీ పైన చెప్పిన సోదికీ సంభందమేంటని అడగద్దు, ఎందుకంటే‌ అడిగినా నేను చెప్పను, ఒక వేళ మీరు ఏదైనా interpret చేసుకుంటే, మిమ్మల్ని రియలిస్టని అనేస్తాను... నాకు తెలిసి నా వరకూ, ప్రపంచంలో అంతకంటే పెద్ద తిట్టు ఇంకొకటి లేదు.... ;)





7 comments:

  1. ప్రాస కోసం మీరు పడిన ప్రయాసకు ఫలితం కనిపించడంలేదు మీ కవితలో,భాషా దోషాలు ఉన్నాయి.ఒకసారి తెలుగు తెలిసిన వారికి చూపండి మీ కవితను.సంధ్యారాగం చంద్రహారతిని పట్టడం ఏమిటి?మీ వర్ణన చదివిన తర్వాతా,అమరదీపం సినిమాలో,దాసరి సర్రిగా మీలాగానే భావుకతకి పోయి "నా జీవన సంధ్యా సమయంలో"అనే పదాన్ని ప్రయోగించారు.దానికి అర్ధం మీలాటి కవులకి బాగా తెలుసుననుకుంటాను..

    ReplyDelete
  2. @astrojoyd: హల్లో ఆస్ట్రోజోయ్‌డ్ గారూ బాగున్నారా, పర్వాలేదండీ మిస్టేకులుంటే లాసు రావటానికి నేనేమీ బిజినెస్ చెయ్యట్లేదు.. సంధ్యారాగం చంద్రహారతి పట్టటం అంటే, బ్యూటీఫుల్ ఈవెనింగు, చీకటి పడుతున్న సమయంలో చంద్రునికి స్వాగతం పలుకుతుందనే భావన అండీ, కవిత అంటే కప్పి చెప్పేది, వ్యాసం అంటే విప్పి చెప్పేది... పైగా ఆ లైను పదప్రయోగం నేను చేసింది కాదు.. అందుకే స్పష్టంగా దానిని కొటేషన్ తో టైప్ చెయ్యటం జరిగింది.. అది "శ్రీవారికి ప్రేమలేఖ" అనే సినిమాలోది... కావాలంటే మీరు చెక్ చేసుకోండి... మరీ కవులు అనేంత ఎదగలేదండీ నా భాషా, బావుకత రెండూ కూడానూ... నేను అంత గొప్ప సంభోదనకి అర్హున్ని కాదు.. ఐనా నా భాషా దోషాల్ని గుర్తు చేసే గురుతర భాధ్యతతో నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.. కానీ మీరు తప్పు అనుకునేవి చెప్పేటప్పుడు దాని మీనింగుని క్లియర్‌గా ఎందుకు తప్పో చెప్పాలండీ.. మీ ఫీలింగులో తప్పో, లేక పదం దాని మీనింగులో తప్పో మినిమం తెలియాలి కదా..
    సంధ్యా సమయం నెగెటివ్‌గా ఆలోచించేవాళ్ళకి మీ ఫీలింగుతో సమానంగా కనిపిస్తుంది.. పాజిటివ్‌గా ఆలోచించేవాళ్ళకి అలసట నుండి సేద తీర్చి ఆహ్లాదాన్నందించే సమయంగా అనిపిస్తుంది.. సృష్టిలో ఏ లోపమూ ఉండదు.. మన దృష్టిలోనే... మీరు పెద్దవాళ్ళలా ఉన్నారు, ఇవన్నీ మీకు తెలిసే ఉండాలి మరి.... నేను మీకు చెప్పటం బాగోదని నా ఫీలింగ్.. ఇలా అన్నానని తప్పుగా అనుకోవద్దండీ.. నా బ్లాగుపై మీ విమర్శాస్త్రాల్ని సంధించటానికి మీరెప్పుడూ ఆహ్వానితులే...
    మరొకసారి నా బ్లాగుని వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వక దన్యవాదాలు... have a nice day...

    ReplyDelete
  3. sandhya samay is the pitrukaala.so ur padaprayoga itself reflecting a negitive meaning nd nt my perspective.PL.DNT IMITATE SOME ONE WHILE WRITING POETRY,ESPLY CINEMAA POETS,THEY HAVE TO WRITE ACC TO THE GIVEN TUNES,SO THEY DONT MIND TO BEND ND KILL THE WORDS.BEFORE U WRITE A LINE,U HAVE TO READ 100.,LINES SIR.ITS NT THE QSTN OF ELDER R YOUNGER..U R LOGIC ND SENSE PLAY A LOT,WHILE POSTING A COMMENT..

    ReplyDelete
  4. @astrojoyd:
    Dear Astrojoyd, Astrology is not everything and its sense of its etymology need not to be rock hard, its a comic for me, I perceive it more funnier than comics like Garfield/Calvin&Hobbes that's seen news paper, and we aren't of stone age to perceive meaning of words as rigid as they're formed in the beginning. Sense of the sentence changes with the context and perception. A person who meets an accident in the morning and yet to pass away doesn't accept the positivity of the morning...

    Quoting is different from imitating, I hope you know the difference. How so ever movie poets write their poetry, I don't bother, they ain't the exceptions away from mistakes...

    Considering my own lines, you may find them odd/wrong/nasty/brutal/avge/good/better or anything else, its the matter of your perception and may be my limitation too... if its wrong let it be wrong, I keep it just because I don't perceive it the same way you do..

    thanks for criticism... :)

    ReplyDelete
  5. for ur kind information the word pitrukaala wil nt come under astrology yar/stone age-from that only u r evoluted friend..శ్రీశ్రీ అంతటివాడే "గతం నాస్తి అనేందుకు జంకారు..but u r saying wth ur half knowledge,its a stone-age.A man who forgets his roots will nt come up nd flourish..it applies to ur birth also my dear kavi...

    ReplyDelete
  6. seeing poetry in terms of astrology..is this is ur perception /perspective yar?

    ReplyDelete
  7. @astrojoyd: శ్రీశ్రీ జంకారో లేదో నాకు తెలియదు కానీ, నాకు తెలిసినంతవరకూ, గతం నాస్తేనండీ.. మీరు పొరబడ్డారు, నేను ఆఫ్ నాలడ్జీతో రాయలేదు, నో నాలడ్జీతో వ్రాశానండీ... ఏమోనండీ నేను పుట్టాక అందరూ మనిషనే అన్నారు మరి,అహా పుట్టుక గురించి మాట్లాడారు కదా అందుకని చెబుతున్నా..

    @astrojoyd's other comment..:
    its both my perception and perspective too.. is there any problem...

    Thanks for your comments sir, have a nice day....

    ReplyDelete