నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Tuesday, September 28, 2010

నా (అ)ధర్మ సందేహా(శా)లు...

  1. కోరికలు లేని మనిషే చివరికి, దైవత్వాన్ని సంతరించుకోగలడని పురాణపురుషులందరూ చెబుతారు కదా, మరి దేవతలు అమరత్వం కోసం, క్షీరసాగర మధనం, తరువాయి బాగంలో అమృత సేవనం ఎందుకు చేసినట్టూ... దేవతలకి కోరికలుండొచ్చా??, 
  2. అమృతం తాగిన దైవ స్వరూపుడే అమరత్వాన్ని సంతరించుకోగలిగితే, మరి, వానరుడై, అమృతపానం చేయని ఆంజనేయుడూ, నరులైనట్టి పరశు రాముడూ, అస్వథ్ధామా ఎలా మృత్యుంజయులయ్యారూ??,
  3. మత గ్రంధాల్లో ఉండే ప్రతి వాక్యానికీ రెండేసి, మూడేసి రకాలుగా వ్యాఖ్యానాలూ, వివరణలూ ఉంటూ... ప్రశ్నించే ప్రతి విషయానికీ మసి పూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నిస్తారు.. ఏం ఆ గ్రంధాలని వ్రాసేవాళ్ళకి తిన్నగా రాయటం రాదా? లేక పైత్యమా?
  4. మన ఇండియన్సు చాలా మందికి వేరే ఏ దేశం ఏదైనా సాధిస్తే.. మా తాతలు ఎప్పుడో‌ నేతులు తాగారని.. వెన్ను చరుచుకునే అలవాటుంది.. డియర్ రీడర్ మీరు అందులో భాగమా, వేరేనా??
  5. మనిషి తనకి తెలివి ఉన్నంత మాత్రాన తనని తాను అన్ని జీవులకంటే సుపీరియర్ అని ఎందుకనుకుంటాడు... తను కూడా చచ్చిపోతాడు, చావంటే భయపడతాడు, చావకుండా ఉండేందుకు అన్ని జీవుల వాటి వాటి విధానాల్లో అవి ప్రయత్నించినట్లే తాను తన దారిలోనే ప్రయత్నిస్తాడు... జీవించటం కూడా, పెంచుతాడు, పెరుగుతాడు, సంపాదిస్తాడు, కంటాడు, ఆటవిక న్యాయంలాగానే దోచుకుంటాడు, పొట్ట ఆకలే కాకుండా చాలా ఆకల్లతో కొట్టుమిట్టాడుకుంటూంటాడు.. మరి ఎందుకు తను సుపీరియర్.. నాలాగా టైప్ చెయ్యటం రాదని, నీలా చదవటం తనకి రాదని ఒక చింపాంజీ ఏమీ ఫీలవ్వదు కదా... మరి ఎందుకు నువ్వూ, నేనూ దానికంటే గొప్ప... ??
  6. ..................

3 comments:

  1. 1. వాళ్ళ వాళ్ళ లోకాల్లో కోర్కెలు జయిస్తే ప్రమోషనొచ్చి పైకెళతారు, ఎక్కువైతే కిందకి జారుతారు - సైక్లిక్ గా వుంటుంది అది ఆప్షన్, కంపల్షన్ లేదు.
    2. కృషివుంటే మనుషులు ... పాట విన్నారా?
    3. ప్రతి పైత్యానికి ఒకేమందంటూ లేదు, రోగలక్ష్ణం బట్టి వుంటుంది
    4. అవును, అందులో భాగమే, నిరాశ కన్నా దురాశ బెటర్
    5. "తెలుగులో అంకెలు రాకుంటే మేధావి కానట్టే " - 21శతాబ్ది థింకర్(రుడు?)(రెహ)మాను ఉవాచ ;)

    ఏమో! చింపాజీ ఫీలింగ్స్ బాగా స్టడీ చేసినట్టున్నారే, ఐనా, అల్లో.. మడిసన్నాక కసింత ఫీలింగు లేకపోతే మడిసికీ చింపాంజికి తేడా ఏముంటుంది సెప్పండి? :P

    ReplyDelete
  2. @snkr:
    మీ అభిప్రాయాలను తెలిపినందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు,
    అన్నట్టూ దేవతలు కోరికలుంటే పైకెళతారు, లేకుంటే క్రిందకొస్తారు అని ఎక్కడ వ్రాసి ఉందండీ...

    వాళ్ళు ఏం‌ కృషి చేశారండీ... భాగవతంలో కనీసం అమృతం అనే లాజికల్ కాన్సెప్టన్నా ఉంది, అమరత్వాన్ని వివరించటానికి, మరి వీళ్ళ కృషి ఏంటీ.. అంటే మీ మనసుకి నచ్చిందని చెప్పారా.. సరే లెండి.. నేను మీ మనసుని హర్ట్ చెయ్యను..

    అంటే మీరు పైత్యమని ఒప్పుకున్నారన్నమాట... పర్లేదండీ మందు లేకున్నా, మనిషి పోయేందుకు కారణం తెలియాలి కదా..

    ఐనా నిరాశనో, దురాశనో ప్రక్కన పెట్టి, సాధించినవాళ్ళని appreciate చేసి మూసుక్కూర్చుంటే సరిపోతుంది కదండీ మనకి..

    ఔనా..!! ఆ ఉవాచ నేను వినలేదు లెండి..
    మనిషిని బాగా మడిచేశారండీ :)
    నేనేదీ అదే.. ఆ తేడాని వ్యక్తపరచటం వలన మనిషికి వచ్చే satisfaction ఎందుకో? అనే..

    ReplyDelete
  3. @snkr గారూ నా ప్రస్తావన ఇక్కడ ఎందుకండీ జరిగింది తెలిస్తే మీరే అపహాస్యం పాలవుతారు. మన గొడవలేవో నా బ్లాగులో చూద్దాం , వేరే బ్లాగుల్లో ఈ ప్రస్తావన ఎందుకు. ౩౨౦ కి ౩౭౦ కి తేడా తెలీదు మీకు, కనీసం సందర్భానుచితంగా అయినా రాయండి సార్ మీరు

    @Chandramouli మా గొడవ ఎందుకని ఇక్కడ ఈయన ప్రస్తావించారు అన్నది నాకు తెలీదు గానీ
    ఎవరి ఆలోచనను బట్టీ వాళ్ళు ఆ విధంగా రాస్కుంటూ కొన్ని వేల ఏళ్ల నుండీ వికసించింది మన ఈ ఆధ్యాత్మిక భాండాగారం ఇందులో మనకు సరిపోయే చెప్పుల జత వెతుక్కోవడం మన పనే
    లేదా దొరక్క పొతే మనమే ఆ భాండాగారంలో మరో పుస్తకమో ఆలోచనో పడేస్తాం అదే ఈ అభిప్రాయానికి మూలం

    ReplyDelete