చిన్నప్పుడొకసారి చెప్పులు కొందాం అని షాపుకి వెళ్ళి మంచి చెప్పులున్నాయా అని అడిగాను, ఆ ఉన్నాయీ అన్నాడు షాపువాడు, ఐతే రెండు చెప్పులివ్వండి అని అడిగాను, వాడు పగలబడి నవ్వుతూ, మేం జతలు అమ్ముతాం అన్నాడు, నాకు అర్దం కాక క్లియర్గా చెబుదామని, కుడి కాలికి ఒకటి ఎడమ కాలికి ఒకటి ఇమ్మని అడిగాను.. వాడు మళ్ళీ పగలబడి నవ్వి నవ్వు ఆపకుండానే చెప్పులిచ్చి డబ్బులు తీసుకున్నాడు.. నేను ఇంటికొచ్చి విషయం చెప్పి , వాడు నవ్వినందుకు మా అమ్మ ఒడిలో పడుకుని ఏడ్చేశాను, ఓదార్చాల్సిన మా అమ్మ కూడా ఏంటో, పకపకా నవ్వేసింది.. పోనీ అమ్మ ఒక్కతే నవ్వితే ప్రోబ్లం లేదు.. ఆ విషయం చెప్పిన అందరూ నవ్వుతూ నన్ను వెక్కిరించటం స్టార్ట్ చేశారు.. నేనైతే రెండు రోజులు ఎవరితో మాట్లాడలేదు.. హా!! నేనేం తప్పు మాట్లాడాననీ... చెప్పులు రెండు కాళ్ళకీ ఇవ్వమని వాడిని క్లియర్గా అడిగితే తప్పా..?? |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, September 4, 2010
రెండు చెప్పులూ రేటెంతా..?
Labels:
funny
Subscribe to:
Post Comments (Atom)
baagumdi
ReplyDelete@gbrrm:
ReplyDelete:):):) Thank you :):):)
hi hi hi,,you r correct
ReplyDelete:):)
ReplyDelete@Manju:
ReplyDeleteThanks అండీ మంజు గారూ మీరన్నా నన్నర్ధం చేసుకున్నారు.
@'Padmarpita':
పదుగురున్ పొలమారి నవ్విపోదురుగాక,
బాగా నవ్వుతున్నారండీ, నేనప్పుడు చిన్న పిల్లాడ్నననే కదా...
This comment has been removed by the author.
ReplyDeleteచాలా బాగుంది.ఇంతకీ అందరు ఎందుకు నవ్వారో తెలిసిందా.
ReplyDelete@రఘు:
ReplyDeleteఎక్సుపీరియన్సు వచ్చాక తెలియకుండా ఉంటుందా.. చెప్పండి మరి..
chala bhagundi anna
ReplyDelete