అలా మాట్లాడుతూనే ఆమెని అడిగేశాను... ప్రేమించటమంటే ఎందుకని మీ అమ్మాయిలంతా, మీ మనసుకి నచ్చిన సోదిని వినే ఒక కౌన్ కిస్కా గొట్టాం గాడు దొరకటం మాత్రమే అనేటట్లు చూస్తారు? వాడు ఎలా ఉండాలో, ఎలా కనపడాలో, ఎలా ప్రవర్తించాలో ఇలా అన్నీ మీరు నిర్ణయించి మీకు నచ్చినట్లు చెయ్యాలని చూస్తారు? మీకుండే ఇన్ సెక్యూర్ ఫీలింగుని వాడి ఇనెబిలిటీకో లేక డిజెబిలిటీకో ముడిపెడతారు?... మౌనం వహించిందామె అది తుఫాను ప్రశాంతతా అనేటట్లుగా... శబ్ధారంభం సౌమ్యంగా అనిపించినా, సమాధానం ఘాటుగానే ఉంది. మీ అబ్బాయిలంతా ఎందుకలా అమ్మాయిల్ని ఏలియన్సుని చూసినట్లు చూస్తారు, మిమ్మల్ని ప్రేమించే అమ్మాయిల్ని మీ వెనక తిరిగే కుక్కలా హీనంగా భావిస్తారు, ఆమె శరీరానికే ఎందుకు విలువిస్తారు, ఆమె మనసన్నా, మాటన్నా అంత చులకనగా ఎందుకుంటుంది??? శబ్ధ తీవ్రత తుఫాను కాక అదేదో సునామీని తలపించింది... జాన్ గ్రే men are from mars and women from venus,అలాగే జాన్ మిల్టన్ తను కోల్పోయి పొందిన స్వర్గాలలోని అంతరాలు అర్ధమయ్యాయి, ఎందుకో మిల్టన్ జాన్ గ్రే కంటే చాలా అమాయకుడనిపించింది, నిజానికి నేను ఆ నవలలు చదవలేదు కానీ, అమ్మాయిల మనస్త్వత్వం ఎలా ఉంటుందో తెలిసే ఉత్తమ జాతి నేర్పరికి (ఇతరులని చూసి నేర్చుకునేవాడు), ఆ టైటిల్సులో పరమార్థం ఉడుకుతున్న బియ్యం మెత్తబడిందో లేదో దాన్ని తడమకుండానే చెప్పగలిగినంత సౌలభ్యం అనిపించింది... పాపం పైన ఆమె అడిగిన ప్రశ్నలు అందరి విషయంలో నిజం కాకపోయినా అందులో అతిశయోక్తి అతిగా లేదనిపించింది... ఆ మద్యన చూసిన ఆరెంజి సినిమాలో, తను ప్రేమించే ప్రేమకి నిర్వచనం కానీ పరమార్థం కానీ చెప్పుకోలేని కథానాయకుని పాత్రని సృష్టించిన రచయిత మనస్తత్వం చూశాను, అదే సినిమాలో ఇంకో పాత్ర ప్రేమంటే ఇదీ అని జీవిత కాలం భార్య పెట్టే పోరుని/సోదిని భరించగలిగే ఎబిలిటీని చాటి చెప్తాడు... స్వార్థం ఇష్టపడే కథానాయకుడంటే ప్రేక్షకుడికి ఇష్టం ఉండదు అలాగే అది నిజ జీవితం ఐతే అలాంటబ్బాయి అంటే ఏ అమ్మాయికీ ఇష్టం ఉండదు... మరి గొంతులో దుఃఖాన్ని దాచుకుని నవ్వుతూ రోజుకో పూలకుండీ కొనుక్కునే పాత్ర అంటే జనాలకి ఎందుకంత ఇష్టం... (వాళ్ళు జనాలు వాళ్ళనడిగి వేస్ట్ అని అంతరాత్మ వెకిలిగా సమాధానం ఇస్తుంది) నిరంతరం అనుసంధానమై ఉండే సౌకర్యం ఉండే ప్రపంచంలో అనుక్షణం విషయ సంగ్రహణ సామర్ధ్యం కలిగి ప్రతీ నిమిషం ఆర్ధికాభివృధ్ధి సాధించాలనుకునే జనాలకి, భోజనాలని ఈ మెయిల్లో పంపగలిగితే బాగుండు, పిల్లల్ని ప్రింటౌట్ తీసుకోగలిగితే బాగుండు, తన మెయింటెనెన్సూ, జాగ్రత్తలూ తీసుకోమని అడగని పరికరాలే తమ జీవిత బాగస్వాములైతే బాగుండు అని భావించే అభినవ అభివృధ్ధి పద ప్రపంచంలో పలువురు పలికే వాక్యం "ప్రేమా పేడకడి తట్టా".... ఎందుకీ ఎనాలిసిస్ నీకూ, దేనికిది రాస్తున్నావూ, ఎవరన్నా డబ్బులిస్తారా నీకూ, లేక పని లేదా, ఈ కాలంలో ఎవడన్నా ఇంటరెస్టు మాత్రం ఉందని ఏదైనా పని చేస్తాడా... ఇది నేను రాస్తున్న పోస్టుకొచ్చిన కితాబు... మనసులో ఏమి తోచక సమాధానంగా చెప్పాను, కేర్నాట్ ఇంజిన్ లోనికి వచ్చిన ఎనర్జీ బయటకెళ్ళటానికి సింకొకటి కావాలి, అది నాకు ఇదే అని చెప్పాను... మరేం చెప్పనూ జీవితమంతా, ఇంగ్లీషు వచ్చీ రాని మనిషి inception సినిమాని మొదటిసారి చూస్తున్నట్లుంటే ఆల్మోస్టు ఎవరైనా ఆ టైపులోనే సమాధానం చెబుతారు... ఎంత వెతికినా ఏం చూసినా, పాత సినిమాల్లో కనిపించే అందమైన ప్రేమ, స్వంత ఊహల్లో జనించేంతటి స్వఛ్ఛమైన ప్రేమ, నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్... ![]() |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, December 15, 2011
నాకు ఏలియన్ వరల్డయిన ఈ భూగోళంలో దొరకవ్...
Sunday, November 20, 2011
Friday, September 30, 2011
Wednesday, September 21, 2011
Monday, September 5, 2011
అక్షరం
అక్షరం గురించి వ్రాయమంటే ఏదో అలా అలా వచ్చిన కొన్ని పదాలని ఇలా మీ ముందు ఉంచాలనిపించింది... క్షరం అంటే నాశనం అక్షరం=నః క్షరం - అంటే నాశనం కానిది, నాశనమనేదే లేనిది; ఇది అక్షరానికి భాషాపరమైన అర్ధం. మనోభివృధ్ధి సాధించిన మేధా సంపత్తి కలిగిన ప్రాణి మనిషి. తనదైన శైలిలో జీవించటానికి, తనదైన ఉన్నతమైన సంక్లిష్ట భావజాలాన్ని వ్యక్తీకరించటానికి అలాగే వ్యక్తీకరించబడినదాన్ని స్వీకరించటానికి తనకి అవసరమైన మాధ్యమం భాష, ఆ భాష అక్షరాల అమరిక. ప్రపంచమంతా నిభిడీకృతమై ఉన్న సర్వోత్కృష్టమైన జ్ఞాన సంపదని అర్ధం చేసుకునేందుకు , ఆ సంపదని మానవాళి శ్రేయస్సుకి ఉపకరించేట్టు చేసేందుకు అవసరమైన అక్షర జ్ఞానం ఆవశ్యకత వర్ణింప శక్యం కానిది. ఆ అక్షర జ్ఞానం కలిగి ఉండటం అక్షరాస్యత, అది లోపించటం అనేది నిరక్షరాస్యత. ఒక నిరక్షరాస్యుడు తన అవసరాన్ని సరిగా వ్యక్త పరచలేని ఒక సామాన్య అవసరం నుండి ఉధ్ధండమైన ప్రయోగాలతో జనావళికి తన పరిశోధనా సేవలందించే శాస్త్రవేత్త ఉపయోగించే భాష్యం వరకూ అవసరమయ్యేదంతా ఆ అక్షరాస్యత నుండి పుణికి పుచ్చుకుచ్చుకోవాల్సిన జ్ఞాన సంపదే. అక్షరాలు పదాలనీ, పదాలు వాక్యాలనీ, వాక్యాలు విషయ సంపదనీ నేర్చుకునేందుకు దోహదం చేసి తద్వారా విచక్షణ అనేది అలవడేలా చేస్తుంది. విచక్షణ లేకుండా ప్రవర్తించే మనిషి మృగ సమానుడు. మనిషి స్వభావం ఎలాంటిదైనప్పటికీ దానిని మార్చి తనలో సమాజ హితునిగా పరివర్తన తీసుకురాగల మంత్రం అక్షర మంత్రం. అక్షరమనే మాతృక జ్ఞానమనే సంపద సాధించటానికి ఉపయోగపడితే, జ్ఞానం విద్వత్తు జనించేందుకు ఉపకరిస్తుంది. విధ్య కలిగిన వాడు లోకమెల్లా పూజింపబడతాడు అనే పెద్దల సూక్తి నిత్య సత్యం. అక్షరాన్ని గురించి ఇలా ఎన్ని అక్షర సత్యాలు చెబుతున్నా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కూరగాయలు తరిమే కత్తి ని ప్రావీణ్యత లేని వాడు దానిని ఉపయోగించినా లేదా హత్యలు చేయాలనే వాడు ఉపయోగించినా అది రక్తం కళ్ళ చూస్తుంది. అక్షరం అనే సాధనం చాలా ఉన్నతమైనదీ మరియు ఎంతో శక్తివంతమైనదీనూ. చిన్ననాటి నుండీ సమాజ శ్రేయస్సుకి సంభందితమైనపోకడలని అలవర్చుకున్న మనిషి చేతిలో అక్షరం ఏనాటికైనా ఒక మహాద్భుతాన్ని చూపుతుంది. కాలి నడక నుండి గాలి నడక వరకూ అభివృధ్ధి సాధించిన మనిషి గొప్పతనం, కొండంత నుండి గోరంతవరకూ చేరుకున్న ఉపకరణాల పరిమాణం వాటి ఉపయుక్తం ఇలా చెప్పగా కోకొల్లలవి. కరడు గట్టినట్లు రహస్యాలను దాచుకున్న ప్రకృతి మానవుని ముందు చేతులొగ్గి వాటిని బయట పెట్టటానికి కారణం, మనిషి తాను సంపాదించిన జ్ఞానాన్ని పంచుకోగలిగే మరియు దాచుకోగలిగే సాధానంగా, మాధ్యమంగా ఉపయోగించబడుతున్న అక్షరం మన మనిషుల ఉనికికే తలమానికం, ప్రతిభకే ఆలవాలం. దురుపయోగంలో ఉన్న అక్షర జ్ఞానం దాని పర్యవసానాన్ని సమాజ చీడ పురుగుగా మార్చటం ఖాయం. ఏది ఏమైనా మనిషిని మనిషిగా నిరూపించగలిగే అక్షరం ఒక అమోగమైన సాధనం, కానీ అది సాధనం మాత్రమే, నిన్ను మనిషిగా చూపించలేక మృగంగా నువ్వు మారితే అది నీలోని అక్షర దోషం తప్ప అక్షరంలో స్వయంగా దాగి ఉన్న దోషం కాదది. అనిర్వచనీయమైన వాడి అందుకు సరిపడ వేడిని కలిగున్న అక్షరంతో పాటుగా దానిని ఉపయోగించే దారి అనే జ్ఞానాన్ని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విధ్యావంతుడైన మనిషిగా నిలదొక్కుకోగలిగే సామర్ధ్యాన్ని అందరూ పెంపొందించుకోవాలని ఆశిధ్ధాం. |
Friday, August 5, 2011
జాలేస్తుంది కూడానూ...!?!?!?!
"హా!! ఏంట్రా అలా చూసి, ఎందుకో కొద్దిగా నచ్చగానే ప్రేమ పుట్టేస్తుందా, ఇప్పటికి నువ్వు పుట్టి పట్టుమని పాతిక నిండుంటాయ్![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() హా రీడరూ నీ ఎమోషన్ నాకు అర్దమైంది, పట్టెడన్నాన్ని తడిమి చూస్తే పుట్టెడు బియ్యం ఉడికినట్టా, దానిని కలుపని తెడ్డుకున్న అడ్డేదో తెలిసా నీకు అంటారు కదా... ఏం చేస్తామండీ, జీవమనే ఉచ్చు చిచ్చు నీ పుచ్చుని పట్టి లాగు విధంబులనంతముల్ అన్నట్లుగా, కళ్ళకి గంతలు కట్టుకుని జీవితమనే ఏనుగుని వెతుకుతూ ఉండే సమాజమంతా జీవితాన్ని పలువిధాలుగా వివరిస్తుంటే, గంతలు తీసి దూరం నుండి చూస్తున్న నాకు వాళ్ళలాంటోళ్ళందరినీ చూసి నవ్వొస్తుంది ![]() |
Thursday, August 4, 2011
తొక్కలో లైఫ్...
గాలి బాగా వీచిందని, నేల విడిచి సాము చెయ్యటానికి నువ్వేమైనా కాగితమ్ముక్కనుకున్నావా...![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ఇది వీడి వరస.. కానీ మూసపోతల సమాజ పోకడలు వీడిని వదుల్తాయా.... ఏమో??? , గాలి వీస్తే కాగితం ముక్క ఎగిరిపోతుంది, కానీ పేపర్ వెయిట్‌తో సహా ఎగరటం దానికి సాధ్యం కాదు.... సమాజపు కట్టుబాట్లనే ఆ పేపర్ వెయిట్లున్నా ఆ కాగితం ఎగరాలంటే ఏ టోర్నెడోలు రావాలో, ఎలాంటి టోర్పెడోల సాయం కావాలో... జీవితమంటేనే విసిగి వేసారిన ఆ మనసుకి ఇవన్నీ ఒక పట్టాన పడతాయో లేవో... ఆనందం, సంతోషం లాంటివాటి కోసం ఎన్నెన్నో చెయ్యాల్సొస్తుందని వాటిని కూడా విస్మరించేస్తున్నాడు... వాడికీ వాడి దగ్గరున్న బెంచీకీ తేడా ఏమీ లేదని వాడిని చూసి వెటకారంగా నవ్వుకునే వాళ్ళకేసి చూసి, బెంచీతోనే మాట్లాడుతూ ఆ జీవిత రోగంతో బాధ పడుతున్న మనుషులకీ, దూరంగా ఎక్కడో కొండల్లో దావానలంలో చిక్కుకుపోయిన ముళ్ళ తుప్పలకీ ఏమీ తేడా లేదని నవ్వుకుంటున్నాడు.... ఇది చదివిన మీరు ఎవరిని సమర్ధిస్తారో నాకు తెలీదు, నా అభిప్రాయాన్ని మాత్రం అడగద్దు... |
Monday, July 11, 2011
Sunday, June 26, 2011
సోది... మళ్ళీ...
నిజం, ఆ సిట్యుయేషన్ చాలా నిజం ![]() ![]() ![]() ![]() ![]() |
Thursday, June 2, 2011
Sunday, May 29, 2011
వీడి కంటే ఎయిడ్సే నయం..
మనం అప్పుడప్పుడూ ఫ్రెండ్సుని కలవటానికని వాళ్ళ ఇంటికి వెళుతుంటాం కదండీ అలానే, మా ఫ్రెండొకడింటికి వెళ్ళానన్నమాట, చాలా రోజులకి సొంతూరు వెళ్ళి అక్కడి ఫ్రెండ్స్ ని కలవటం చాలా తృప్తినిస్తుంది కదండీ, వాళ్ళ నాన్నగారితో కూడా పరిచయం ఉండేసరికీ, లోపలికి వెళ్ళగానే ఎదురు పడి కుశల ప్రశ్నలు వేసే ఆయనతోనే సంభాషించాల్సి వచ్చింది. "ఏంట్రా అబ్బాయ్! ఎప్పుడు రాక ఊళ్ళోకి, నువ్వు బాగా చదువుకుంటావట కదా", అని ఆయనడిగాక సమాధానమేదో చెప్పి మా ఫ్రెండు గురించి అడిగే సరికి, "నువ్వు ఆ గాడిద కొడుకు గురించి వచ్చావా??", అన్నాడు, మనకి.. సారీ నాకు నోటి దురద ఎక్కువేమో "ఆహా లేదంకుల్ మీ అబ్బాయినే కలుద్దామని వచ్చాను", అని చెప్పే సరికి టంగ్ కర్చుకొని మొహం ముడుచుకోటం ఆయన వంతయ్యింది. ఎదవ ఎక్కడున్నాడో ఏంటో, భోంచేసి బయటికెల్తే మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలియదు, ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా కలవదు. బ్యాలెన్సైపోతే ఇన్ కమింగు కూడా రాదంటాడ్రా వాడూ, అదేంటంటే వాడు బేవార్సుగా రోమింగులోనూ వాడి సిమ్ కార్డేమో ఫోన్ లోనూ ఉంటాయి కదా అందుకే రోమింగులో ఉన్నప్పుడు నిల్ బ్యాలెన్స్ ఐతే ఇన్ కమింగ్ కూడా రాదనీ , అదెవరో వాడి పాత గర్లు ఫ్రెండంట, వాడి ఫోన్ అందక నాలుగు సార్లు ఆమె ఇంటికొస్తే నాలుగో సారి పొరపాటున దొరికిపోయీ ఆమెకీ విషయం చెప్పి కన్విన్స్ చేసేశాడు, ఎదవ తెలివైనోడే అనుకో (ఆశ్చర్యం నా వంతైందిక్కడ), గర్లు ఫ్రెండు ఫోనుకి దొరకనోడు నాకెలా దొరుకుతాడురా ఆ అడ్డగాడిద". ఈయన పరిస్థితి ఏదో తేడాగా ఉందనిపించి, "ఏంటి అంకుల్ అసలేమయ్యింది వాడిని అలా తిడుతున్నారు", అని అనడిగాను. ఈ తరం కుర్రాళ్ళకి అసలు పేరెంట్సు ఫీలింగ్సేమీ వంటబట్టవారా వాడు ఒక్క మాటా వినడే, కనీసం వినిపించుకోడే. ఐనా నాకో విషయం అర్దం కాదూ అక్రమ సంభందాలూ, అనవసర సంభందాల వలన ఎయిడ్సొస్తుందని చెబుతుంటారు కదా, నాకేంట్రా సక్రమ సంభందంలోనే అంతకంటే డేంజరెస్ ఫెల్లో వీడు తగలడ్డాడూ. "అంకుల్ మీరు వాడ్ని మరీ ఇంత ధారుణంగా తిడుతున్నారేంటి అంకుల్, అసలేమైంది అంకుల్", అన్నాను. ఆయన వింటే కదా ఊహూ! ఆయన ధోరణిలో ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు,"మొన్నటికి మొన్న వచ్చి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా డాడీ, అందుకే ఆ మొక్కలు పీకే పని కోసం వెళతానన్నాడు, ఆ ఉడతలు పట్టే నా---గాడు". అవేం మొక్కలని ఆయన్ని అడిగితే ఏవో మెడిసినల్ వేల్యూస్ ఉన్న మొక్కలంట అని చెప్పీ మళ్ళీ స్టార్ట్ చేశారాయన,"అసలు ఆ సినిమాకి 3ఇడియట్సు అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా, మొదటోడు బేవార్స్ వాడికి తల్లీ తండ్రీ ఇంకా భందువులు వీరెవరూ అక్కర్లేదు, వాడేది కావాలంటే అది చెయ్యొచ్చనుకుంటాడు, తెలివితేటలుంటే చాలా సొసైటీలో బతకడా వాడూ, పోనీ వాడు ఊరికే ఉన్నాడా పోయి పోయి మిగిలిన ఇద్దరినీ కెలికి మరీ ఏది నచ్చితే అదే చెయ్యమని నూరి పోశాడు . ఏటనుకుంటున్నాడ్రా వాడు నేను ఇలాగే ఉంటానూ అవసరమైతే బిల్డింగుల మీది నుండి దూకుతాను అంటే ఉద్యోగాలు ఏ కంపెనీ ఇస్తుంది రా (ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు), ఇంకొకడున్నాడు.. పోనీలే లేక లేక పుట్టాడని వాళ్ళయ్య వాడి కోసం మద్య తరగతి వాడయ్యుండీ కూడా ఇంజినీరింగ్ చదువుకోమంటే, ఊహూ నేను కుక్కలకీ,కోతులకీ ఫోటోలు తీస్తానంటాడు.. సినిమాలో చూపించనంత మాత్రాన వాడు తీసే ఫోటోలకి ఉద్యోగమెవడిచ్చేస్తాడురా, కంప్యూటర్ చదువులకున్న డిమాండు వాటికెక్కడుందీ, అందులో ఫెయిలైతే పెళ్ళిల్లకి ఫోటోలు తియ్యటానికి కూడా పనికిరాడు వాడు, ఒక వేళ పిలిచినా అక్కడ తిరిగే పిల్లినో, కుక్కనో ఫోటోలు తీస్తాడు". హమ్మ 3ఇడియట్సు మూవీ ఈయనికిలా అర్ధమయ్యిందా అనుకున్నాను, ఇంతకీ నీ ఒపీనియనేంటీ ఆ సినిమా పైన అని ఆయన అడిగే సరికీ చూద్దామనుకునే సరికి టికెట్లు దొరకలేదంకుల్, తర్వాత టైం దొరక్క చూడలేదని చెప్పాల్సొచ్చింది, ఆయన నన్నెక్కడ ఇరికిస్తాడోఅని చెప్పి."చూశావా నీకు టైం దొరకదు, వాడైతే టైముకే దొరకడు", హిహిహిహిహిహిహిహ్(ఇది బస్ తప్పిపోయినలాంటి నా వెకిలి నవ్వు) అని నవ్వి, ఆయనకి సినిమా నచ్చిందా లేదా అని అడిగాను, ఆయనకి నచ్చిందని చెప్పగానే,"అదేంటి అంకుల్ చివరికి ఆ ముగ్గిర్నీ ఏదో ఆదర్శమూర్తుల్లా చూపించరు కదా మీకెలా నచ్చింది", అన్నాను, నీకెలా తెలుసు అని అడిగిన ఆయన ప్రశ్నకి తడుముకోకుండా, నాకున్న ఒక ఉత్సాహం అప్పుకోలేని ఫ్రెండు ఒకడు స్టోరీ చెప్పాడని సర్ది చెప్పేశాను. దానికాయన,"కమర్షియల్ యాంగిల్లో డబ్బుల కోసం కథని అలా డైవర్టు చేసినా, వాళ్ళవి వెధావాలోచనలనే విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ముగ్గురు వెధవలు టైటిల్‌ని అలానే ఉంచారు", అన్నాడు, ఓరి వీడి ఆప్టిమిజం తగలెయ్యా అనుకున్నాను నాలో నేను. మరి మేం మాకు నచ్చింది చేస్తే ఏంటి ప్రోబ్లం అంకుల్, అందరూ వెళ్ళే దారిలోనే వెళ్ళాలనుకుంటే ఇప్పుడున్న డెవలప్మెంటు ఉండేదా అని అడిగితే, అదంతా మాలాంటి పెద్దవాళ్ళు చేస్తే వచ్చిందిరా, కుర్ర కుంకలు మీకేం తెలుసని మీదికొచ్చాడు, అంటే పుట్టుకతోనే ఇలా ముసలివాడిగా పుట్టారా అని అడిగేసరికి మళ్ళీ నాలుక్కర్చుకున్నాడాయాన... "మీలాంటి పెద్దోల్ల వలనే ప్రపంచ యుధ్ధాలూ వచ్చాయ్, ఎయిడ్సులాంటి జబ్బులూ పెరిగాయి", అనే సరికి మండినట్టుంది ఆయనకి, ఏంట్రా పెద్దోల్లకే ఎదురు చెప్తావా ఏదో మంచోడివని నిన్నేమీ అనట్లేదు అని చెప్పి లుంగీ మడిచి, ముక్కు ఎగబీలుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయాడాయన(కోపంతో). హమ్మయ్య! బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటికొచ్చి నడుస్తుంటే, మా ఫ్రెండుగాడు కనిపించాడు.. కనిపించటమే తడువుగా వాడితో,"ఒరే ఎదవా స్టీల్ప్లాంటుకెళ్ళి బ్లాస్ట్ ఫర్నేసులో దుమికినట్లు, నిండు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఎటు పోవాలో తెలియని బాతులాగా, ఇంటర్వ్యూకి ఇన్ షర్టు చేసుకుని వెళుతూ బురదగుమ్ములో పడినట్టూ... ఇంకా ఎలా ఎలాగో ఐపోయింది నీ గురించి మీ ఇంటికెళ్ళిన నా పరిస్థితి. నువ్వు సినిమాలు చూస్తే చూశావ్, ఇక నుండి మీ ఇంటికి వచ్చే ముందు నీకు ఈ మెయిల్ చేస్తా, దానికైనా రిప్లై ఇవ్వు , నువ్వు ఉన్నావో లేవో రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ లేటెస్టుగా నువ్వే సినిమా చూశావో చెప్పి పుణ్యం కట్టుకోరా.. నా టైం బాగుండి నువ్వేదో మంచి సినిమా చూశావ్, ఏ రక్త చరిత్రలాంటి సినిమానో చూసి ఉన్నట్లైతే నన్ను నలుగురు కలిసి తీసుకెళ్ళాల్సొచ్చేది, అని వాపోయి అక్కడినుండి ఉడాయించాను. అసలు విషయమేంటంటే వాళ్ళింట్లో అందరు తండ్రులూ వాళ్ళ కొడుకులు కలెకర్లవ్వాలని కల కనేవారంట, "అతి""కష్ట"పడి చదివి వాళ్ళంతా గుమాస్తా దగ్గర్నుండీ బిల్లు కలెక్టరు వరకూ రీచ్ అయ్యారు, వీడికి రీసెర్చి ఇష్టమనీ అందులోకి దూరేస్తే, ఆయన నాకీ సినిమా కథ చెప్పాడు. |
Sunday, May 22, 2011
ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్కి ఎప్పుడూ కథలు చెప్పకూడదు..
"సమయం పది గంటలు కావస్తోంది, అప్పటికి ఖచ్చితంగా అరవై నిమిషాల వ్యవది ముందే ఆ రోడ్డుకి రెండు వరుసల అవతల ఉన్న స్కూల్ బెల్ గణగణమంటూ మ్రోగింది![]() ![]() హీరో నేల మీదకి దూకగానే విలన్ గ్యాంగ్ వాడిని వల వేసి మరీ పట్టుకుంది... కానీ విషయమేంటంటే, వాళ్ళు పట్టుకుంది హీరోని కాదు, పదో అంతస్తు పిట్టగోడ మీద అంతకు ముందు రోజు హీరో తినేసి పడేసిన అరటి తొక్క మీద కాలేసి జారిన కమెడియన్ని వాళ్ళు పట్టుకున్నారు. "ఒరేయ్ నీ..." (ఈ పిలుపు కథలో బాగం కాదు, మా ఫ్రెండు పిలిచాడు), "ఏంట్రా", అన్నాను.. "మొదటి నుండీ హీరోయే వస్తున్నాడన్నావ్ కదరా, ఐనా ఎవడైనా కంపేరిజన్ కోసం పది గంటలకి ఆఫీసు ఓపెన్ చేస్తున్నారనో లేకపోతే షాప్ తెరుస్తున్నారనో చెబుతారు, నువ్వేంట్రా గంట ముందు ఎక్కడో ఉన్న స్కూల్ బెల్ మ్రోగిందని చెబుతున్నావ్" అన్నాడు వాడు. "మరి హీరో రాకపోతే, వచ్చేది కమెడియన్ ఐతే ఆ విషయం ముందే చెప్పాలి కదరా పాఠకులకీ లేదా ప్రేక్షకులకీ ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() మూర్చపోటానికి సిధ్ధంగా ఉన్నవాడు కాస్తా, ఒక్కసారి కోపంగా పైకి లేస్తూ.. ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ఛః!! టేస్ట్ లెస్ ఫెల్లోస్ కి కథ చెప్పకూడదు అని నేను మాత్రం డిసైడైపోయా.... |
Subscribe to:
Posts (Atom)