ఈ మద్యన వర్షాలు తెగ పడుతున్నాయి కదా, వాటి దెబ్బకి క్యాంపస్‌లో చిన్న చిన్న గోతులు కూడా చెఱువుల్లా తయారవుతున్నాయ్, కానీ చాలా అందంగా కనిపిస్తాయ్, నిన్న ఆదివారం కదాని సాయంత్రం అలా అలా చక్కర్లు కొట్టొద్దామని సౌత్ క్యాంపస్ దారిలో ఉన్న చిన్న చెక్ డ్యాం దగ్గరకి వెళ్ళే సరికి అబ్బో ఆ ప్రదేశమంతా ఎంత బాగుందో!!, మీరే చూడండి..
 |
చెక్‌డ్యాం కి వెళ్ళే దారిలో చిన్న వాటర్‌బాడీ, దీనికే లేకని పేరు పెట్టారో గుర్తు లేదు |
 |
ప్రకృతి ఇంతందంగా ఉంటుంది కదా మరి కవులెందుకో అమ్మాయిల్ని ఇంత అందంతో పోలుస్తారు.. ప్చ.. |
 |
జీరోఫైట్.. |
 |
no caption just see and enjoy |
 |
ఎందుకనో కొన్నిటిని వివరిస్తే వాటి అందం తెలియదు, అందుకేనేమో నోటికీ, చెవులకీ కంటే కళ్ళకే ప్రాముఖ్యత ఎక్కువ.. :) |
 |
చిన్నవే ఐనా వీటి ప్రపంచం వీటిదే.. వీటి అందం వీటిదే... ఆస్వాదించే హృదయం మనకుంటే చాలు |
 |
The way downhill towards the other side |
 |
రాళ్ళల్లో, నీళ్ళల్లో రాసాము ఇద్దరి పేర్లు.. ఈ పాట గుర్తొస్తుంది... |
 |
If you observe correctly, it looks like Pisces symbol (I don't believe in astrology) |
 |
ఈ మొక్కల్ని చూస్తే జెలసీగా ఉంది, అవి హ్యాపీగా స్నానం చేస్తున్నాయి.. నేనందులో చెయ్యలేను |
 |
Blog author, The Me, rocking on rock throne |
 |
లేత గడ్డిని చాటు చేసుకుంటూ, రాతిపై నాచు మొక్కలని పుట్టించే ఆ అర సెంటీ మీటర్ నీటి పొరలో కూడా నాకు అందం కనిపించింది, మీకు కనిపించకపోతే... సారీ నేనేం చెయ్యలేను... |
 |
ఏవేవో అలంకరించిన చింపిరి జుట్టు బుర్రలాగా ఉందా... బట్ నాకు చాలా బాగుంది... |
 |
నీలో నేనొదిగిపోనా నా ప్రియతమా అంటూ... అల్లుకుపోయిన తీగె మొక్క... ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలెవరైనా ఉన్నారంటారా.. నాకైతే తెలీదు |
 |
Sign of edges of concrete jungle... showing sunset as the symbol of killing down of nature, to make it experience its own sunset..... ఏంటో ఏదేదో మాట్లాడేస్తున్నాను.. ఐనా నిజమే చెప్పాను కదా..?! :) |
 |
check dam entrance |
 |
మలేషియాలో ఉండేవి పెట్రోనాస్ టవర్సైతే ఇవి పిట్టరోనాస్ టవర్సులాగా ఉన్నాయ్.. |
 |
Algal bloom, part of the the pond ecosystem |
 |
రాళ్ళల్లో నీళ్ళు మరియు నీళ్ళల్లో రాళ్ళు.. బాగు బాగు.. |
 |
Give sunshine, give some more rays అని అడిగితే ఇంకొన్ని ఇచ్చాడు.. సూరీడు.. |
 |
నిజమే నీరెప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది.. |
 |
నేల జారుతూంటే అడుగులో అడుగు వేసుకుంటూ, అలా అలా వెళ్ళిపోయా.. :) |
 |
మృత్తికా క్షయానికి ఉదాహరణ... అఫ్కోర్సు ఒకరకమైన అందానికి ఆలవాలం.. |
 |
నా మొబైలెక్కడ తడిపేసి పాడు చేసుకుంటానో అని మా ఫ్రెండు భయపడుతూ భయపెట్టాడు కూడా.. |
 |
చాలా మంది వీక్షకులొచ్చారు లెండి... |
 |
ఈ ఫోటో కాళ్ళకి తియ్యలేదు.. నీళ్ళకి తీశాను.. |
 |
జల తరంగంలా, జల జలా ప్రవహిస్తున్న నీరు.. |
 |
తేడాగా అడుగేశావో.. వాకింగ్ కాస్తా స్కేటింగైపోతుంది.. |
 |
హమ్మయ్య ఈ చివరికి వచ్చేశాను.. |
 |
wow nice water walls.. oh sorry.. water falls |
 |
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా అందరికీ అందేదీ ఈ పూచే కొమ్మ అని ప్రకృతిని చూసి అనాలనిపించే సందర్భాల్లో ఇదొకటంటాను.. |
 |
జనాల జలక్ఆలాటలు.. |
 |
blog author at water falling wall |
 |
This is what I call the beauty.. natural glossy look... |
 |
జారుతూ, షికారుకెళ్ళే పాల పొంగుల ఓ గంగమ్మా అన్నట్లుగా ఉంది.. |
 |
Another beauty.. |
 |
Water entering into field... |
 |
ఈ స్పీడెంతుంటుందంటే.... వయసు వేడిలో ఉండే కుర్రదాని మనసు దుడుకుదనంతో దీన్ని పోల్చాలంటాను.. |
 |
ఎక్కడెక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది, అందుకే వాటర్ యూనివర్సల్ సాల్వెంటయ్యింది.. |
 |
కొండా కోనల్లో లోయల్లో.. రాయీ రప్పలో వాగుల్లో... (స్వాతికిరణం ట్యూన్) |
 |
నీరు పల్లానికే ప్రవహిస్తుంది, ఫిలాసఫీ అదే చెబుతుంది, థెర్మోడైనమిక్ సెకెండ్ లా కూడా అదే చెబుతుంది.. |
 |
యూనివర్సిటీ ఎంప్లీయీస్ బోనాల పండగ సెలబ్రేషన్.. |
 |
ఓమ్సు లాలోని రెసిస్టెన్సు మార్కింగ్సు.. ఈ వైర్లలో చూడాలంటే.. వాటి ప్రతిబింబాన్ని నీటిలో చూడాలని ఈ ఫోటో తీస్తే కానీ అర్దం కాలేదు.. |
 |
ఇందులో బింబం, ప్రతిబింబం రెండూ ఉన్నాయ్, బాగుంది కదా.. బింబం బింబం అంటే గమ్మీ బేర్సులోని "బింబాలా బింబోలో బీం బాం" అనే మంత్రం గుర్తొచ్చేస్తోంది... |
 |
The Dusky sunset of nature has resemblance with beauty getting into the sleep |
 |
పచ్చదనమే పచ్చదనమే.. భూమాతా నీ ఒళ్ళంతా పచ్చదనమే అని పాడాలని ఉన్నా.. అది నిజం కాదు కదా :( |
 |
అక్కడ బతుకమ్మ గుడి ఉందనుకుంటా.. పైన ఆ మేఘం చూడండీ.. భళే భళే.. ట్రెయిన్ దూసుకెళుతున్నట్టూ, దాని నుండే ఆ పొగ వస్తున్నట్టూ ఉంది కదా... బ్యూటీఫుల్ |
 |
ఇది నేచురల్లా,కాదా? బోర్నా, మేడ్ఆ అని అడక్కండి నాక్కూడా అంత క్నోలెడ్జీ లేదు... |
 |
గాల్లో వ్రేళ్ళాడుతున్నట్లున్నాయ్ కదా.. |
 |
I'm sure, one won't find such a natural beauty in concrete jungle |
 |
ఆ షేపేదో కార్టూన్ బొమ్మలాగా అనిపించీ అలా ఫోటో తీశ్శాను.. |
 |
The bluish beautiful evening.. |
 |
No George... Only Bush.... |
 |
See the natural ones how they've grown as if they've been mowed or something like that.. |
 |
Another hanging flowers' beauty.. |
 |
WoW!! |
 |
ME |
 |
Tensionless under Hi-Tension power tower.. |
 |
Deep in the Evening.. ఊడల్లేని చింత చెట్టు.. సారీ అవి మర్రి చెట్టుకుంటాయి కదా... దెయ్యాలేమన్నా దొరుకుతాయేమో అని ఫోటో తీశా.. భయపడినట్టున్నాయ్... కనబడ్లా.. |
 |
నేనే.. పోస్ట్ ఇక్కడితో ఐపోయిందని చెప్పటానికి, కొసమెరుపుగా ఒక దిష్టి చుక్క... అంతే.. |
|