నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Friday, August 27, 2010

ఎ క్రిటికల్ ఆన్ "ఇంటెలిజెంట్ డిజైన్" థియరీ ఆఫ్ ఇవల్యూషన్


డార్విన్ సిధ్ధాంతాలు.. ఈ సిధ్ధాంతాలు శతాబ్దం పైగా శాస్త్రజ్ఞులకి ఇవల్యూషన్ని వివరించటానికి లేదా అర్దం చేసుకోటానికీ అధారాలయ్యాయి..
ఈ సిధ్ధాంతాలకి మొదటిసారిగా సవాలు విసిరిన విషయం పేరు irreducible complexity దానినే తెలుగులో "అనివార్య సంక్లిష్టత" అని పేరు. ఈ ప్రశ్న ఆవిర్భావానికి కారణం ఫ్లాజెల్లం యొక్క అమరికలో ఉన్న సంక్లిష్టత ఎలా పొందుపరచబడిందో నేచురల్ సెలెక్షన్ వివరించలేకపోవటం. అటు తర్వాత "కెమికల్ ఇవల్యూషన్ని" ఆధారంగా చేసుకుని ప్రోటీన్ల ద్వారా జీవ ఆధారితి సృష్టి జరిగి ఉండవచ్చనీ, ప్రోటీన్లు స్వతహాగా మాలిక్యులార్ ఇంజిన్లు కావటం వలన వాటి మద్యనున్న అమరిక జీవరసాయనికంగా ఎమైనోఆసిడ్ల మద్యనున్న ఆకర్షణవలన రూపొంది ఉండొచ్చనీ భావన.. కానీ డీ.ఎన్.ఏ లేకుండా ప్రోటీన్ అనేది ఆవిర్భవించటం సహజంగా ఎక్కడా జరగదు, అలా ఐతే మరి డీ.ఎన్.ఏ ఎలా ఆవిర్భవించిందని ప్రశ్న.. దానిలో ఉండే నాలుగు రకాలు బేసెస్‌నీ ర్యాండమ్‌గా అమరిస్తే అది ఏర్పడుతుందిలే అనుకుందాం.. కానీ నిర్ధిశా గమనం(random)లో  ఎన్నో సార్లు అక్షరాలని పడేస్తే కావాల్సిన పదమే రానిది, అంత పెద్దదైన పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్న డీ.ఎన్.ఏ ఎలా అలా ఏర్పడుతుంది అని మరలా ప్రశ్న... అది ఏర్పడేందుకు ఆధారాలు లేకుండా ఏర్పరిచిన సిధ్ధాంతం పేరే intelliget design. దీనికి అధారం ఏంటీ అని ప్రశ్నిస్తే వచ్చే సమధానం వినటానికి హేతుబద్దంగా ఉంటుంది.ఎన్నో వేల సంవత్సరాల కాలం నాడు బయల్పడిన రాళ్ళలో సహజ సిధ్ధంగా ఉన్న రాళ్ళకీ, చెక్కబడిన రాళ్ళకీ మద్యనున్న ఇన్ఫర్మేషన్ మద్యనున్న విషయాన్ని ఒక ఆధారంగా వాళ్ళు చెబుతున్నారు.. అప్పుడది చెక్కబడింది కాబట్టి ఆ ఇంటెలిజెన్సు ఆధారితమైన శిలలు సహజసిద్దమైన వాటికంటే ఎంతో భిన్నంగా ఉన్నాయ్. కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ సహజమైన రాళ్ళని అలా వదిలేసినా... ఆ చెక్కిన రూపు రేకల్ని సంతరించుకోవు.. అలాగే డీ.ఎన్.ఏ కూడా ఏదో ఇంటెలిజెన్సు వలనే వచ్చిందని వాళ్ళ వాదన. ఇక్కడి దౌర్భాగ్యం ఏంటంటే ఈ లాజిక్కుని పట్టుకుని ఆ ఇంటెలిజెన్సు ఏమయ్యుంటుందా అని వాళ్ళంతా వెతకటానికి సిధ్ధమైపోయారు కానీ అందులో నిజానిజాల విశ్లేషణ ఏదీ చేసినట్టు లేదు.. వాళ్ళకి(evolution biologists) ఉండే సందేహాల్లో మొదటి డౌటు, ఆ ఇంటెలిజెన్సు అంతరిక్షం నుండి వచ్చి ఉండొచ్చని.. ఒక వేళ అది అంతరిక్షంలోంచి తీసుకురాబడింది అని వాళ్ళు ఒప్పించాలనుకుంటే.. మరి జీవ నిర్దేశిత పదార్ధం మొదటిసారిగా ఎక్కడ పుట్టుంది(అంతరిక్షంలో) మరి అప్పుడు అది సహజ సిధ్ధమైన పరిస్థితులలో ఏర్పడకపోతే ఎలా ఏర్పడింది అక్కడైనా సరే.. ఏం దేవుడొచ్చి సృష్టించాడా? అధారాల్లేకుండా సైన్సు దేవుణ్ణి ఒప్పుకోదే.. ఒక వేళ ఆధారాలు దొరికితే అది దేవుడు కాకుండా పోతుందే? అంటే వీళ్ళకి భూమి మీద జీవ సృష్టి ఎలా ఏర్పడిందో తెలిస్తే సరిపోతుందా.. అది ఎవడో గ్రహాంతరవాసి పట్టుకొచ్చాడని ఆధారం దొరికి తే సరిపోతుంది.. అలా కాకుండా ఏమీ లేని పరిస్థితి(period of primordial soup)లో డిజైన్ చేసే ఇంటెలిజెన్సు ఎలా వచ్చి ఉండాలి?  వీళ్ళకి ఏ రకమైన పరిశోధనలు సమాధానాలిస్తాయి? ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ గొప్పని ప్రదర్శించేందుకు ఎటువంటి శాస్త్ర సాధ్యమైన అభూత కల్పనలు చేస్తారో అని సందేహంగా ఉంది??

డియర్ రీడర్ మీరేమంటారు...

6 comments:

  1. bagundi..baga explain chesaru... meere chepparu kada manishi tanakunna anantha oohaasakhitho niratharam anveshisthu untadani.. ee parishodnalo maaru annattu ga abhuthakalpanalu lekunda sathyanni sadhinchalani aasisthanu.. inthaki mee phd. topic idena..?:)

    ReplyDelete
  2. @praba:
    ముందుగా మీరు కామెంటు చేసినందుకు ధన్యవాదాలండీ ప్రభగారూ..
    అభూత కల్పనలు కనిపెట్టబడ్డప్పుడు అభూత కల్పనలు కావండీ, అవి మరలా ఇంకో అర్ద శతాభ్ధమో లేక శతాభ్దమో పూర్తైన తర్వాత, ఇంకొకరి ద్వారా వేరే విధంగా రూఢి ఐతే అప్పుడౌతాయవి అభూత కల్పనలు.. కానీ సైన్సు అలాగనే ఎదుగుతుంది.. తెలిసిన పరిమిత ఆధారాలనే నిజమని ఒక జీవితకాలం నమ్మాల్సుంటుంది... సంపూర్ణత్వం అనేది మన సూర్యుని జీవితకాలంలో సైన్సు సంపాదించలేదు... అలా సంపాదించేంత పరిమితమైనది కాదు మన విశ్వసంక్లిష్టత..

    నా పిహెచ్.డీ టాపిక్ ఇవల్యూషన్ కాదండీ ప్రోటియోమిక్స్ పైన... కానీ వాటి గురించి రాస్తే.. వేరే ఫీల్డులో ఉన్నవారికి బోర్ కొడుతుందని, కొందరికి అర్దం కాకపోవచ్చనీ దాని మీద ఏమీ రాయట్లేదు...

    ReplyDelete
  3. భౌతికశాస్త్ర సిద్ధాంతాలు భౌతిక సృష్టి మొదటి క్షణాలలో ఎలా అయితే వర్తించవో, జీవ పరిణామ సిద్ధాంతం జీవం పుట్టుకకి అలానే పనిచెయ్యదేమో అని నా ఊహ.
    ఇంతకీ intelligent design సిద్ధాంతుల వాదన గురించి (chemical evolution జీవసృష్టికి కారణం కాలేదన్న వాదన) evolutionary biologists ప్రతివాదన ఏమిటి?
    chemical evolution సాధ్యం అయితే, అది Entroy principleకి విరుద్ధం కాదా?

    "ఒక వేళ ఆధారాలు దొరికితే అది దేవుడు కాకుండా పోతుందే?" - ఎందుకు కాకుండా పోతుంది? :-)

    ReplyDelete
  4. @భైరవభట్ల కామేశ్వర రావు:
    చక్కగా అడిగారండీ కామేశ్వరరావు గారూ...
    వివిధ స్థితులలో ఉన్న పదార్ధం(there are 5 states of matter known so far) భౌతికంగా ఉన్న సంఘటనా స్థితులకీ, అది ఏర్పడినప్పటి నుండీ పూర్తి స్థాయి మార్పు చెంది, స్థిరమైన స్థితి నెలకొనే వరకూ జరిగిన మార్పులకీ గల కారణాలలో మూల అంశాలన్నిటినీ భౌతిక శాస్త్రం ఎంపిరికల్ లక్షణాలగానూ, ఎంపిరికల్ సూత్రాలగానూ పేర్కొంది.. జీవ పరిణామ సిధ్ధాంతాలకి ఆ గత్యంతరమైతే లేదు.. ఎందుకంటే భౌతిక మరియు రసాయన సూత్రాల ఆధారంగానే జీవరసాయన సూతాలన్నీ పని చేస్తున్నాయి కాబట్టి.

    మీ కామెంటులో జీవపరిణామ సిధ్ధాంతం అన్నారు కదా.. కాదండీ జీవపరిణామ సిధ్ధాంతాలు అంటే కరెక్టుగా సూటవుతుంది.. ఎందుకంటే లామార్కిజం నుండీ.. నేటి ఇంటెలిజెంట్ డిజైన్ వరకూ దాదాపు నాలుగైదు ఉన్నాయి
    ఇంక తర్వాతి విషయానికొస్తే...

    నేచురల్ సెలక్షన్ అనేది మొదటిగా అందరూ యాక్సెప్ట్ చేసిన జీవపరిణామ సిధ్ధాంతమండీ.. అదేంటంటే జీవి అనేది ఏర్పడటం అనేది నేచర్ పైన ఆదారపడి ఉంది అనే విషయాలని.. డార్విన్ చాలా ఉదాహరణలతో మరియు శాస్త్రీయమైన ఆధారాలతోనూ తత్సంభందితమైన సూత్రాలతోనూ నిరూపించాడండీ, కాకుంటే మైఖేల్ బీహీ అనే సైంటిస్టుకి బ్యాక్టీరియాలో ఫ్లాజెల్లంలో నలభై వివిధ విడి భాగాలు అమరిక అనేది జరగటానికి ఆ స్థితి ఆవిర్భావానికి అలాంటి మరెన్నో సంక్లిష్ట విషయాలని వివరించటంలో నేచురల్ సెలక్షన్ సూత్రాలు చేతులెత్తేశాయి.. కెన్యన్ అనే ఆయన కెమికల్ ఇవల్యూషన్ అన్నాడు కానీ, అదీ బెడిసి కొట్టింది.. ఇప్పుడు ఇదిగో ఇంటెలిజెంట్ డిజైన్ అని పట్టుకున్నారు, హైపోథీసీస్‌కి ఉన్న వివరణ పైన పోస్టులో టైప్ చేశాను కావాలంటే మరలా చూడండి..

    entropy అంటే మూస భాషలో orderliness to disorderliness. కానీ ఒక్కసారి ఆలోచించండి.. ఎంట్రోపీ ఒక రకంగా తగ్గుతున్నట్లు కనిపిస్తుందంటే, దాని సరౌండింగ్సులో అది పెరుతుందని అర్దం.. కాని ఆ ప్రోసెస్ ఆరంభానికి ఆధారాలివ్వలేక జాన్ కెన్యన్ చేతులెత్తేశాడు..

    ఆధారాలు దొరికితే దేవుడు కాకుండా పోతుంది అని ఎందుకన్నానంటే..
    ఉదాహరణకి మనం తినే ఆహారం కొంతసేపటికి పూర్తి రూపంతరం చెంది వివిధ రూపాల్లో పూర్తిగా బయటికి పోతుంది.. అది అలా పోయేందుకు కారణాలు తెలియని రోజున దానిని దేవుడు చేస్తున్నాడు అని ఎవరైనా అంటే.. ఆ ప్రేసెస్‌ని అంతటినీ, ఆధారాలతో సహా సైన్సు వివరించ గలిగిన తర్వాత, పూర్వపు నమ్మకం ఎలా ఉంటుందండీ.. మీరే చెప్పండి..

    I thank you very much for your comment :)

    ReplyDelete
  5. కొత్త సిద్దాంతం పరిచయం చేసారు చంద్రమౌలిగారు...

    పోతే డార్విన్ సిద్దాంతం ఎప్పుడు కూడా జీవం ఎలా పుట్టింది అనేదాన్ని వివరించడానికి ప్రయత్నించలేదు. డార్విన్‌ చేసిందల్లా జీవులు తమ పరిసరాలననుసరించి రూపాంతరం చెందుతాయనీ, మార్పులను తట్టుకునే జాతులే మనగలుగుతాయని తన పరిశీలనల ద్వారా ప్రతిపాదించడం.

    రిచర్డ్‌ డాకిన్స్‌ అని ఒక ప్రొఫెసర్‌ ఈ ఎవల్యూషన్‌ గురించి ఇలా అన్నాడు "It's not that life of this complexity evolved as such...there have been random combination all through and the ones that could endure the changes then continued to evolve. Our own universe that we live in could be one of many possible universes. Had it been another combination that endured we could have been different."

    డిజైన్‌ ఎలా జరిగింది అనేదాంట్లో కొంత ఖచ్చితత్వం ఉన్నప్పటికి అసలు ’జీవం’ అంటే ఏమిటి అనేది ఇంకా తెలియని మిస్టరినే!!

    ReplyDelete
  6. @nagarjuna:
    నాగార్జున గారూ evolution starts from something and continues till the present, you have to go through the books like origin of sps &tc., where its clearly explained that the origin took place due to random changes in the non-living environment, those have been naturally sustained to evolve a great journey for millions of years..

    మీరు చెప్పిన random combinationనే ప్రూవ్ చేసేందుకు కెమికల్ ఇవల్యూషన్ని exploit చేసిన జాన్ కెన్యన్ ట్రై చేసి చేసీ, చివరకి ర్యాండమ్‌ జెనరేషన్ జరగదని ఆ దారే వదిలేశాక, శాస్త్రజ్ఞులందరూ ఈ ఇంటెలిజెంట్ డిజైన్నే పట్టుకున్నారు... మరి ఎక్కడ తేలుతారో చూద్దాం.. విశ్వం గురించి ప్రతిపాదించిన విషయాలన్నీ థియరిటికల్ ఫిజిక్సులోకి వస్తాయి.. అందులో ప్రతిపాదనలన్నీ ప్రస్తుతం హైపోథిసీస్ స్థాయిలోనే ఉన్నాయ్.. పేరలల్ యూనివర్సెస్ గురించి స్టీఫెన్ హాకింగ్ ఇంకా టైమ్‌ ట్రావెల్ గురించి పరిశోధనలు చేస్తున్న కొన్ని బ్రిటన్ మరియు అమెరికన్ యూనివర్సిటీలు చెబుతూ ఉంటాయి.. అవన్నీ let us suppose x is a variable and x = so and so number లాంటివి.. మీరు కూలంకుషంగా పరిశీలిస్తే మీకే తెలుస్తుంది.. లేవని నేననను కానీ ఉన్నాయని చూపించేవరకూ ఒప్పుకోను అంతే...

    జీవం వరకూ ఎందుకండీ, బ్రెయిన్లో మెమరీ ఏ విధంగా స్టోర్ ఔతుందో ఏ న్యూరో సైంటిస్టుకి తెలుసో చెప్పమనండి.. మీకు ఎక్కడా ఆన్సర్ రాదు..
    I thank you very much for your comment అండీ..

    ReplyDelete