చాలా రోజులుగా ఆగిపోయిన బ్లాగు ఉగాది రోజైనా ఆరంభిద్దామని, కూర్చుని గంటయ్యింది, ఆ పనీ ఈ పనీ అంటూ వేరే పనులన్నీ సాగుతున్నాయి కానీ బ్లాగు రాయటం అవ్వట్లేదే.. కొద్దిగా ఖాళీ దొరికి టైపు చేద్దామనుకుంటే, జెమిని న్యూసో, మా టీవీ న్యూసో గుర్తు లేదు కానీ ఆ ఎదవర్టైజ్మెంట్లో ముగ్గురు మనుషుల్లో ఒకడి నోటికి ప్లాస్టరేసి ఆ బ్యానరు క్రింది భాగంలో "Don't have a point of view???" అని రాసినట్టు తయారయ్యింది నా ఫేసూ మైండు.
ఈ మద్యన, అంటే ఒక నాలుగు నెలల క్రితం, కొంతమంది అడిగారు, "ఏంటీ నువ్వీ మద్యన బాగు పడినట్టున్నావ్, పనెక్కువైందా??" అని, కారణమేంటంటే నేను బ్లాగులో డైరెట్టు టైపింగు పోస్టింగులు మానేశానని అంట, ఏదో ప్రపంచం యుధ్ధం ముగిసి మరలా ఇంకో శతాబ్దం వరకూ రాదు అనే ధీమా కనిపించింది వాళ్ళ మొహాలలో. ఏంటో అనగనగా ఒకరోజు సినిమాలో బ్రహ్మానందం డైలాగు గుర్తొచ్చింది, ".........ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా" అంటాడు కదా అది. ఏం చేస్తాం లే వాళ్ళకవసరం లేని విషయాలు, వాళ్ళ అడ్రినలిన్ లెవెల్సు పెంచని విషయాలు రాసే ప్రతీ బ్లాగరూ, సదరు జనాలందరికీ ఒక బేవార్సులాగానే కనిపిస్తూ ఉంటాడు.
ఉగాది కదా ఏదైనా రాద్దామనుకుంటే, ప్రపంచమంతా లోపలికి చొచ్చుకుపోయి, కూరుకుపోయిన రాధ్ధాంతాలే తప్ప నా ఆఫ్ యాక్టివ్ మైండుకి ఇంకా ఏమీ స్ఫురించట్లేదు. పోనీ ఓ కవిత రాద్దామనుకుంటే, తెల్లని పావురం కోయిల గానం చెయ్యదు, అలాగే పచ్చని మామిడి తియ్యదనంతో నిండదూ ఉండదు. ఏదైతే ఏముంది, ల్యాబులో మునిగి తేలే నాకు కనీసం ఈ రోజు స్నానం చేస్తున్నప్పుడు పండగ కాబట్టి తల స్నానం చెయ్యాలని గుర్తుండబట్టి, మర్చిపోయినందుకు ఫోనులో మా అమ్మతో పడాల్సిన చీవాట్లు తప్పిపోయి పొగడ్తలు దక్కాయి. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటే నాకు రెండు రూపాయలొస్తే పదకొండు రూపాయలు ఖర్చవుతాయని చెప్పింది అమ్మ. నేను జాతకాలు నమ్మను కానీ ఇలాంటివి చూసి ఇంట్లో వాళ్ళు వెక్కిరిస్తుంటే మాత్రం కొద్దిగా తేడాగానే ఉంటుంది మరి.. ఐనా ఎక్కువ ఖర్చైతే నాకు మాత్రం ఎవరిస్తారులే డబ్బులు.
నువ్వు బ్లాగు రాస్తున్నావా, పబ్లిక్ డైరీ రాస్తున్నావా అన్నాడు మా ఫ్రెండు ఈ పోస్టు టైపింగు చూసి, మ్మ్మ్ "నా జీవితం ఒక తెరచిన తెల్లకాగితపు పుస్తకం" అని ఎవరో కవి చెప్పిన మాట చెప్పేసరికి తనకి చిర్రెత్తుకొచ్చినట్లుంది, నువ్వలా ఓపెన్ చేసి పెడితే, కాయితాలు చించి టాయ్లెట్లో తుడుచుకోటానికి వాడుకుంటారని కోపంగా చెప్పి నా సమాధానం వినకుండా అక్కణ్ణుంచి ఉడాయించాడు... మావాడు కొద్దిగా జాగ్రత్తపరుడు లెండి.
ఏదేమైనా నా బ్లాగు రైటింగు ప్రవాహానికి, నిండుదనం కోసం ఆనకట్టలు కడితే నిండిన నీరంతా కూడా ఎండిపోయినట్లనిపిస్తుంది. అందుకే ఈ రోజు పునః ఆరంభం గావించిన నా బ్లాగు రైటింగు ఆగకుండా సాగించాలనుకుంటున్నాను, ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా, ఎవరు చదివినా ఎవరు చదవకపోయినా...
అందరికీ నా మనఃపూర్వక ఖరనామ సంవత్సర శుభాకాంక్షలు....
 |
ఉగాది శుభాకాంక్షలు :) |
|
మీకు శ్రీ ఖర నామ ఉగాది శుభాకాంక్షలు
ReplyDelete- శి. రా. రావు
ఉగాది ఊసులు
http://sirakadambam.blogspot.com/2011/04/blog-post_04.html
@SRRao:
ReplyDeleteదన్యవాదాలండీ రావుగారూ, మీ బ్లాగ్ పోస్టు చాలా బాగుందండీ, మీకునూ నా ఉగాది శుభాకాంక్షలు.
Chandramouli Ji,
ReplyDeleteNameste!. Mee posting nu chave-vaadi lo nenokkadi ni sir. Evaremanukkuna wrayadam maakandi sir. Konni 'sodi' luntayee konni 'parisodhana' lu vuntayi...kaani wraastane vundali sir.
Happy U
Happy Ugaadi!
ReplyDelete