నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Thursday, April 21, 2011

దేవుడా, దెయ్యమా, మనిషా, మానా.. నాకెందుకూ...

దేవుడిపై నాకున్న నమ్మకాన్ని గురించి, నాకు సొసైటీ పైన ఉన్న అవగాహన గురించీ వాటి  రూపాంతరాలు ఎప్పటి నుండో ఎలా జరిగాయనే విషయాల గురించీ మా ఫ్రెండొకరు నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన సుధీర్ఘమైన సోది ఇది, ఓపికుంటే చదివి చూడండి...

"...........................

............ఇంకా విపులంగా చెప్పాలంటే:
కొన్ని ప్రశ్నలుంటాయ్..
1.నేనెవరు? Scientifically a biological product of my parents(process), mythologically a person took birth after his previous birth(consequence)
(no explanation for consequence nor even some evidence just other than blind belief), so I do not rely on the consequence...

2.అది సరే చచ్చినట్టు పుట్టాల్సొచ్చింది మరి ఈ ప్రశ్నలకి కారణాలేంటి: చిన్నప్పుడు మనకి interesting అనిపించే విషయాలు కొన్ని ఉంటాయ్.. దేవుడు రాక్షసులని చంపటమనే "మంచి", రాక్షసుడనే ఒక "చెడు", దేవుడి మహిమలనే ఒక "అద్భుతం".... ఈ అద్భుతం అనేది మెదడుని చెదపురుగు కెలికినట్టు కెలుకుతుంది... ఒక వేళ దేవుడు కనిపించి వాటిని మనకి చూపిస్తే వాటిని అనుకరించటానికైనా ప్రయత్నించొచ్చు... కానీ ఆ అద్భుతాలకి కారణాలూ తెలియవు, దేవుడంటే ఇదీ అని చెప్పలేని ఒక "అసంధిద్గ" పరిస్థితి నెలకొని ఉంటుంది...

పైన apostropheలో ఉన్న పదాలన్నీ, నేను ఆలోచించటానికీ, వెతుకులాడటానికీ గల కారణాలు...
తపస్సు చేస్తే దేవుడొస్తాడని తెలిసి ఒకసారి మంచి సినిమా మధ్యలో కరెంటు పోతే అరగంట దాని కోసం తపస్సు చేస్తున్నట్టు పధ్మాసనమేసి కూర్చున్న నన్ను చూసి ఇంట్లో వాళ్ళూ, డీడీ8లో సినిమా చూడ్డానికొచ్చిన ఇరుగుపొరుగోళ్ళు నన్ను చూసి నవ్వు కున్నారు.. ఆ రోజంతా కరెంటు రాలేదు... ఎందుకో తపస్సంటే నాకు తెలియని విషయమనిపించి వేరే దారే లేదా అనుకున్నాను... "అద్భుతాలు", "సందిద్గ సందేహాలు"... ఇవి ఇంక నడిపించాయ్...

ఓంకారం ఒక ప్రణవనాధం దాని నుండి సకల చరాచర సృష్టి ఆరంభం... అని వేదాలు, భగవద్గీతలో ఉన్నాయని మా తాతగారి ఊరిలో మందిరంలో చెప్పేవారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అక్కడున్న పిల్లలు చదివే రామాయాణ, మహాభారత పుస్తకాలు చదవటం, ఉషశ్రీ ప్రవచిత మహా భారతాన్ని వినటం మొదలు పెట్టాను.. ఇతిహాసం కొంత అబ్బినా, ప్రశ్నలు పెరిగాయి కానీ తగ్గలేదు.. నాలుగో తరగతిలో అనుకుంటా ఎవరో చిల్డ్రన్స్ నాలెడ్జి బ్యాంకు అనే పుస్తక్ మహల్ పబ్లికేషన్ వాళ్ళ పుస్తకాల సెట్టుని  మా తాతయ్య దగ్గర ఉంచమని ఇచ్చారు... అవి మొత్తం చదివేశాను, ఎప్పుడూ (క్లాసు పుస్తకాలు చదవట్లేదని మా అమ్మమ్మ తిట్టేది కూడానూ..)అందులో ఉన్న బిగ్-బ్యాంగ్ థియరీ నుండి విశ్వావిర్భావం జరిగిందనీ, అలాగే విశ్వం గురించీ, గెలాక్సీల గురించీ కొంత విషయం ఉంది. ఓంకారానికీ, బిగ్-బ్యాంగుకీ లింకు ఎలా పెట్టాలో తెలిసేంత వయసైతే కాదాయే.. కానీ మా మామయ్యాలు ఇంకా మా తాతయ్య సైన్సు గురించి మాట్లాడుకునే విషయాలని విని ఎనాలసిస్ వాళ్ళు ఎలా చేస్తున్నారో బాగా అబ్జర్వ్ చేసేవాడిని...
ఏం చేస్తాం చెప్పూ, అటు తెలివితేటలూ లేవు ఇటు లోక జ్ఞానమూ లేదు, కానీ ఇలా తింగరి తింగరిగా వెతుకులాటలు మాత్రం స్టార్టయ్యాయి... ఔను మరీ సినిమాలో మహర్షి నీల్లు చల్లి మంత్రం చదివితే ఏమన్నా జరుగుతుంది కానీ నేను బిందెడు నీళ్ళు వేస్టు చేసినా ఏం జరగట్లేదు కదా.. పాపం ఇంట్లోవాళ్ళకేం తెలుసు, నీళ్ళ వేస్టు చేస్తున్నానని కోప్పడ్డారు అలా చేసినప్పుడు.. అప్పటికీ ఒకటే నమ్మకం "దేవుడు ఎక్కడో ఉన్నాడు, అతన్ని impress చేస్తే వరాలిస్తాడు, తర్వాత పండగ చేసుకోవచ్చు" ఇలా అన్నమాట.. 8th classలో అణువు, పరమాణువు(నేను తెలుగు మీడియంలే) అనీ కేంద్రకం అనీ వాటి లక్షణాలనీ చదివి, అప్పటి వరకూ దేవుడి మీద ఉన్న నమ్మకం ఇంకో రకంగా రూపు దాల్చుకుంది.. "దేవుడు ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు వీటిని నడుపుతాడు" ఇలా ఇలా ఆలోచించేవాడిని...

10thClassవరకూ నా ప్రశ్నలు, ఇంకా వాటికి ఆపాదించుకున్న సరీ సరిపోని సమాధానాలు తప్ప ఇంకా ఏమీ లేవు ఈ బ్రెయిన్ లెస్ మైండులో...

తర్వాత్తర్వాత సరాసరి డిగ్రీస్థాయికి వచ్చే సమయంలో  టీవీలో(ఇంటర్,డిగ్రీల వరకూ కేబుల్ టీవీ లేదు)ఉదయాన్నే వచ్చే సాధువుల ప్రసంగాలు, అలాగే ఎక్కడెక్కడో దొరికిన సనాతన సారథి పుస్తకాలు, మా మామయ్యొకాయన మా ఇంట్లో వదలి వెళ్ళిన Education in Human Values అనే పుస్తకం చదివిన తర్వాత.. కొన్ని కొత్త పదాలతో కూడిన కొత్త సందేహాలు వచ్చాయ్..

ఆత్మంటే ఏంటి, అది ఉందనటానికి ప్రూఫ్ ఏంటి, పరమాత్మ ఎవరు, పరమాత్మ నుండి ఆత్మలు ఎందుకు శరీరాలలో చేరాలి, ఈ భూమ్మీద పాపం, పుణ్యం ఎందుకు అనుభవించాలి, మనిషి చేసే పుణ్యం సంపూర్ణ స్థాయిలో ఉంటే ఎందుకు అతనికి మోక్షం వస్తుంది, అసలు మోక్షం అంటే ఏంటి, పాపం చేసిన వాడు జన్మలు ఎందుకు ఎత్తుతూనే ఉండాలి, అసలు మొట్ట మొదటి జన్మాత్మ ఎందుకు రావాల్సి ఉంటుంది... ఇక్కడ కొన్ని తిట్లు కూడా, పరమాత్మకి వేరే పనీ పాటా లేదా(దెబ్బ తగిలి ఏడుస్తున్నప్పుడు), వాడు ఎందుకు ఇలా జనాల్ని పుట్టించాలి,
ఆశ, నిరాశ, దురాశ - ఇవన్నీ ఎందుకు వివిధరకాలుగా ఉండాలి,
మంచి, చెడు ఇలాంటివి ఎవరు నిర్ధారించారు - దేవుడా లేక మనుషులా...

ఒక మనిషిని చంపటం నేరమైతే, ఒక చీమని అకారణంగా తొక్కటం ఎందుకు నేరం కాదు, మనిషిని మాత్రమే చంపటం పాపం ఐతే ఒక నేరస్తున్ని చంపటం ఎందుకు పాపం కాదు...

ఇలా చాలా సమాధానం ఇవ్వగలిగే మరియు ఇవ్వలేని ప్రశ్నల్ని నేనే సంధించుకున్నాను...

ముందుగా సమాధానం దొరికే విషయాల్ని పరిశీలించాను...
ఆ భాగంలో ఆలోచనతోనే అర్దమయ్యింది, పుణ్యం, పాపం అనేవి, సమాజ భాద్యతని కాపాడటానికి జనాలకి ఆశ పెట్టే/భయపెట్టే అంశాలుగా అర్ధమైంది.. మంచి, చెడూ అనేవి సగటు మనిషి లేదా సగటు సమాజం, సంపూర్ణంగా వాళ్ళ మస్కిష్కపు పరిధిలో ఉన్న పరిమితుల్ని ఆధారాంగా చేసుకుని, వాళ్ళ మనసుకి నచ్చిన వాటిని మంచి అనీ, నచ్చని వాటిని చెడు అనీ, ఇంకొంత మంది ఎక్కువ మంది ఒప్పుకునేదాన్ని మంచి అనీ, ఒప్పుకోని దాన్ని చెడు అనీ అనుకుంటారని నా అనఫీషియల్ పరిశోధనలో తేలింది... ఇలా మన భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఐనా సరే... ప్రతీ సామాజిక విషయాల్నీ దేవుడితో ముడి పెట్టి ఉంచారని అర్దమయ్యింది..

మనిషికి ఉండేది ఆశ, దాని సాధనకి ఉన్న మార్గం ప్రయత్నం, ఆ ప్రయత్నానికి కొరుకుడు పడని విషయం కాంపిటీషన్, కానీ ఆశ కించిత్ కూడా తగ్గదు... దానికి తోడు నమ్మకం, దానికి కారణం అక్కర్లేదు.. కారణం అక్కర్లేక పోవటానికి కారణం, మళ్ళీ ఆశ, పేరాశ.. ఇలా సమాజానికి దేవుడు strengthలా కాకుండా ఒక weaknessలాగా మారాడు... ఆశ తీరని వాడు ఆ క్షణానికి దేవుణ్ణి భూతులు తిట్టటం చూశాను, కొంచెం ఆశ తీరినవాడు ఎక్కువ పూజలు చెయ్యటం చూశాను... ఇలా ఇలా ఎంతో గొప్పవాడని వేదాలు చాటి చెప్పే భగవంతున్ని, కొబ్బరికాయ, చిల్లర దాసుడిగా మార్చేశారు మన జనాలు.....

అవి చూశాక నాకు నచ్చక దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఇంకేమి దార్లు ఉన్నాయో అని అనుకునేవాడిని... డిగ్రీ స్టేజిలో నా పాత ప్రశ్నలు తుడిచిపెట్టుకు పోయాయి.. కారణం, ప్రతి అద్భుతాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే, కారణం తెలుసిపోతుంది కొంతైనా సరే... కానీ అసందిద్గం డివైడ్ అయ్యి పైన చెప్పిన ప్రశ్నల కంటే ఇంకా చాలా ఎక్కువ రకాలుగానే విడిపోయింది...

ఎంత వెతికినా ఆత్మ, పరమాత్మ,లాంటివాటి ఉనికి గుడ్డి నమ్మకానికి అతీతంగా ఏదీ దొరకలేదు.. ఉంటే ఉండనీ లేప్పోతే పోనీ అనుకున్నా,
ఒక విషయం చెప్పటం మరచా, 9thClassలో ఒకసారి నేను చచ్చిపోయేంత ఫీవర్ వచ్చింది 107డిగ్రీలు.. అప్పుడు ఆ రేంజి జ్వర కారణాలలో ఆ ఊళ్ళో ఎవరో చనిపోతే కాలుతున్న శవాన్ని చూసి జడుసుకోవటం ఒకటీ, కారణం ఏంటీ అంటే దయ్యం వచ్చి ఏదో చేసేస్తుందని భయం.... అది పోవాలంటే ఎలా అని ఆలోచించా... అప్పట్లో NS(natural science) బుక్కులో అమీబా గురించి చెప్పారు, మాంచి విషయం దొరికింది దయ్యాల్ని disprove  చెయ్యటానికి, మనిషి చచ్చిపోయి దయ్యమైతే అమీబా ఎందుక్కాదూ అనుకున్నా.. ఎక్కడా దయ్యాల కథలు ఎవరు చెప్పినా మనుషుల మాటలూ, మనుషులూ మరియు జంతువుల ఆకారాలూ గురించే చెప్పేవారు... మరి అమీబా దెయ్యం ఎందుకు ఎవరికీ కనిపించలేదు??‌ ఇదీ నా ప్రశ్న... అప్పట్నుంచీ ఒకటే థాట్, దయ్యముందా, ధైర్యముంటే నా ముందుకు వచ్చి ఏ వేషమన్నా వెయ్యమను తర్వాత సంగతి తర్వాత చూసుకుందామనుకున్నా... నేనింత వరకూ ఎప్పుడూ దయ్యాల్ని చూడలేదు రోజూ అద్దంలో తప్ప...

మా తాతగారూర్లో వాళ్ళింటి దగ్గర ఆవు దూడ ఉండేవి నా చిన్నప్పట్నుంచీనూ, once in 10thClass I saw the grown up male calf mating with the cow that has given bith to it, అప్పుడు మా మామయ్యని అడిగా అదేంటీ అది వాళ్ళమ్మ కదా అని.. దానికాయన అవి పశువులు, వాటికా తేడాలుండవు అని చెప్పాడు...
మనిషి ఆలోచించే స్థాయికి చేరిన తర్వాత సమాజపు ఆవిష్కరణ ఎలా జరిగిందో, సమాజంలో ఉన్న పరిమితులు అవీ గట్రా ఎలా ఏర్పరచబడ్డాయో అప్పటి మెదడుకి అర్దం కాకపోయినా ఇన్నాళ్ళ నా జీవన ప్రవాహంలో అర్దమయ్యాయి...
ఇలా సామాజిక శాస్త్రాన్ని నాకు నచ్చిన విధంగా నేను చదువుకుంటూ ఉన్నాను.. ఇప్పటికీనూ.....

ఇవన్నీ ఓకే మరి దేవుడి మాటేమిటి...???
మ్మ్మ్మ్ం
every particle in this Universe has mobility, activity, due to its property (degrees of freedom of rotation, translation, stretching and bending etc).. అవి with different permutations and combinations in infinite number of particles and also possibilities, lead to the matter and energy of the Universe... as per scientific observation.. if god is something else what is it/he/she is made of, if he is a definitive, when did he originated, what was his work before సృష్టి, if he had taken birth, out of what is it from?, when matter is of infinite possible activity, why does this silly fellow human thinks as if he was soul. that is సొల్లు. So with several dilemmas I came to a temporary conclusion that, everything itself (matter and energy from sub unknown levels of nucleon(mesons, fermions, bosons, nutrino's, quarks, sub-quarks, etc.. etc..) to super massive blackHoles with intense energy and gravity, and the whole universe it itself as whole and every part of it, (not only humans) altogether is the property called as God by our early humans just by being ignorant of the understandable facts. Now I don't agree if something you call as మహిమ, because even if there is మహిమ, it needs natural ingredients as an output..  if it arises as natural ingredient, it can't happen without a process, only thing is that you would be ignorant of the fact... before the advent of gastro-intestinal physiology into books does anyone know how one eats food and makes it into fecal matter by morning.. no one can say.. but when science deciphered it out... I say from amylase to HCL, pepsin to trypsin, glycocholate to taurocholate.. what not??? it was all a well pre-built mechanism selected by our planetary natural conditions.

So I love science as a tool to investigate the God property and I started thinking if it may achieve some capacity to unveil the God like thing to world completely or it may fail too... yet I don't believe in religion based belief whichever the religion it is regarding God, but I like rituals as I can't forget the reason for beginning of my quest.. but the present perspective of research has changed a lot.. now a days its meant for mostly only earning money and fancy things... still its good... let it go as it is...Now here I want to repeat my first question in the beginning..
1.Who I'm:

Ans: A biological product of my parents... socially enriched in understanding(as a living entity he the so called me never bothers to see what society is, who cares, what are regulations, what is sense, what is nonsense but just thinks what is what.) and simply follows the nuance nuisance everybody is pride about or feels normal to great, emotionally aggressive to submissive etc.,

I'm a chemical... produced, thermodynamically favourable to carryout life, and gets attracted to something and retracted to some other things... by its chemical nature, and regulated by social principles and shows +ve reaction to regulations of the society...

I'm a chemical body needs food, oxygen, water and shows activities which world calls both strengths and weaknesses as per learning perspective..  and being abide by social (thermodynamically an isolated system) principles, it hides and almost hibernates most of its natural weakness related activities... and for no reason.. and so on.... and on and on...

4 comments:

 1. Thammi...anduke peddollu annaru..."Ignorance is bliss" ani.

  ReplyDelete
 2. @Jai Telangana: అయ్యో మీరు ఆ పాత statementనే చెబుతున్నారు, నేను ఎప్పుడో దాన్ని నాకు అనుగుణంగా మార్చేసుకున్నాను.. "Ignorance is bliss, only after you get satisfied with that statement in your experience..."

  అన్వేషణ చేయనివారెవరూ ఆ కొటేషన్ని ధైర్యంతో చెప్పలేరు, విన్నవారు ఒప్పుకోరూనూ...

  "అంధకారమగు గది నందు దాగినదేదొ
  సంధికాలమైననేమి గాంచెదమే...
  గాంచిననుర్వినందు మనమె ఉల్లసిల్లమా
  ప్రధమ వీక్షకులుగా" అని చీకటి పడుతున్నప్పుడు కరెంటు లేని వేళ నలుగు గోడలు ఉన్న గదిలో నల్లపిల్లికై వెతికే రేచీకటి వ్యాధిగ్రస్తుడులాంటి వాడిని నేను... శబ్దం పిల్లివలన వచ్చిందని చెప్పేస్తే నీకేమైనా కనపడిందా అని అడగనా... ప్రతి జిజ్ఞాసువు పరిస్థితి కూడా ఇంతేనండీ... ఐనా విషయం తెలిసిన తర్వాతి ముముక్షత్వం చాలా బాగుంటుందండీ, అనుభవంతో చెబుతున్నాను...

  ReplyDelete
 3. u have penned it ,i do come up with similar questions & conclusive answers as u anna,,,, yes anna ignorance is bliss ,,,,only after tryin hard to resolve it

  ReplyDelete