"ఏమని చెప్పాలీ , ప్రేమని చెప్పాలా, నేను తీవ్రంగా పని చేసుకుంటుంటే అది గాఢంగా నిద్ర పోతుంది... ఐనా నేను బిజీ, లవ్ అంటే టైం స్పెండ్ చెయ్యాలి, నాకు అస్సలు ఖాళీ లేదు....", ఇప్పటి కాలపు జనాల్లో ఎవరన్నా ఒకరు ప్రొపోజ్ చేస్తే వాళ్ళకి చెప్పులు చూపించకుండా చెప్పే మామూలు సమాధానం. నిజమే పాశ్చాత్య ధోరణి అనాలో, లేక పోటీ తత్వం అనాలో లేక, సంపాదన ధ్యాస అనాలో లేక, ఆధిపత్యం పై మితి మీరిన ఆశ అనాలో, లేక అతి వ్యక్తిత్వ లక్షణాలనాలో తెలీదు, కానీ ఎలాంటివైనా సరే ఈ పరిస్థితులన్నీ ప్రతి వ్యక్తినీ వెక్కిరిస్తున్నాయ్ , తనకంటూ ఉండాల్సిన ఒక భాగస్వామి సహచర్యాన్ని గుర్తు చెయ్యగానే గుండెల్లో గగుర్పాటు, వెన్నులో చలి వచ్చేలా చేస్తున్నాయ్... ప్రతి వ్యక్తికీ తన వ్యక్తి పైన ఉండాల్సిన ప్రేమని నిద్రాణమయ్యేలా చేస్తున్నాయ్... ఈ విషయంలో ఎక్కువ చెబితే ప్రతి వ్యక్తికీ బోర్ కొడుతుంది, అలాగని విషయం తెలిసి తమ దారి మార్చేవారి సంఖ్య ఎప్పుడూ సున్నాకి పెరగదు... కానీ అభిప్రాయాన్ని వ్యక్తపరచటం, సహజ మానవ నైజం కనుక నేను వ్యక్తపరుస్తున్నాను...
|
baagundi andi
ReplyDeleteచాలా థాంక్సండీ ప్రిన్స్ గారూ :)
Deleteమన సినిమాల్లో ఇంకా గుండెల్లో గంటలు మోగినట్టే చూపెడుతున్నరేంటి చెప్మా? (సరదాకి అన్నాను)
ReplyDeleteమనసున్న భాగస్వామి తోడుగా దొరకడం ఒక లాటరీ గెలిచినట్టే అంటారు!
మీ చిత్రం చాలా బాగుంది.
@జలతారు వెన్నెల:
Deleteప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందండీ, ఈ మధ్యనే జనాలకి జీవితమంటే ఎక్కువ కలుగుతుండటం చూశాను...గుండెల్లో గంటలు still acceptable అండీ :)
లాటరీ అంటేనే అదృష్టం, అది కావాలనుకోవటం కూడా ఒక అత్యాశ ఔతుందండీ... దాని కంటే లాటరీనే వదిలెయ్యటం మంచిదనిపిస్తుంది...
నా చిత్రం మీది మీ కాంప్లిమెంటుకి ధన్యవాదాలండీ :)
chala bagundi
ReplyDeletehi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
nice information
ReplyDeletehttps://goo.gl/Ag4XhH
plz watch our channel