ఈ మద్యనే.. భూమికి దినం పెట్టకుండా ఉండేందుకు ఆపవలసిన మరియు చెయ్యవలసిన కార్యక్రమాలను ఉటంకిస్తూ.. సంవత్సరంలో ఒక్కసారికి మాత్రమే, అదీ మాటల్లో మాత్రమే మనమంతా గుర్తు చేసుకునే "ఎర్త్ డే" సంధర్బంగా నేను తయారు చేసిన ఆర్ట్ ఇది.. అసందర్భమే ఐనా మీ అందరితో ఇప్పుడు పంచుకోవాలనిపించింది.. ఈ చిత్రంలో నేను చెప్పాలనుకుందేమంటే..
రంగు రంగుల మన భూతలమంతా మన అంతూ పంతూ లేని కాలుష్యపు చర్యల ద్వారా వినాశనానికి సిద్ధమౌతూ ఉంది.. భూతలన్నంతా చుట్టూతా ఆక్రమించుకున్న పచ్చ మరియు, నల్ల రంగులు green house వాయువులుగా పరిగణించవచ్చు.. భూమికి పై భాగంలో కనిపిస్తున్న పంజా.. ఆ వాయువులు మానవాళిపై కలుగజేసే ఉత్పాతాన్ని ప్రతిక్షేపిస్తున్నాయ్.. వీటిన్నంటికీ దూరంలో ఉండే ఎర్ర రంగు.. gree house వాయువులు, పరావర్తనం కాకుండా ఆపి ఉంచిన infra-red rays వేడిమిగా రూపాంతరం చెంది global warmingకి సిద్ధపడి ఉన్నట్లు చూపించాను.. అందులో చిందరవందరగా వెదజల్లబడినట్లుండే ఆకారాలు నా పేరుని టైప్ చేసి అలా మార్చటం జరిగింది.. ఇది అస్తవ్యస్తమయ్యే మానవాళి.. జీవిన విధానాలకి.. ప్రతిబింబాలుగా చిత్రీకరించటం జరిగింది.. చివరగా చెప్పొచ్చేదేంటంటే.. "Happenings in thoughts may be nearer than they appear..." మనం కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నా, తీసుకోకపోయినా... ఇప్పటి వరకూ జరిగినదాని వలన వచ్చే పర్యవసానాలు ఇది వరకే చూస్తూ ఉన్నాం...
నా భావి తరాలకి క్షమాపణలతో నా జాలిని తెలియజేస్తున్నాను.. ఎందుకంటే ఈ మెసేజ్ ద్వారా నా బ్లాగు చూసే వందమందిలో కనీసం ఒక్కరిని కూడా.. ఎక్కువ సమయం మార్చలేనని నాకు తెలుసు కాబట్టి... ఒక వేళ ఇది చదువుతున్న మీరు కాలుష్య నివారణకి చర్యలు చేపడుతున్నట్లైతే... మీకివే జోహార్లు.. అందుకోండి మిత్రమా..
Could You please change your template?
ReplyDeletetry chestanu tappakumDaa
ReplyDeleteIts great to hear that from you dear Hanu... hail awareness on earth's climate..
ReplyDelete