....ప్రేమ నన్నొదిలి దూరంగా వెళిపోతుంటే, తను నాకు బహూకరించిన శూన్యం కనిపిస్తూ ఉంది, కారణమేమిటో తెలీదు కానీ శూన్యం కూడా చాలా అందంగా ఉంది.. ఎంతైనా నా ప్రేమ నాకు ఇచ్చిన బహుమానం కదా.. పాపం నన్ను ప్రేమించే ఒక హృదయంతో తాను పెనవేసుకుపోయి ప్రేమాన్నౌత్యం ఎలా ఉంటుందో చూపాలనుకుందేమో.. ఆ హృదయమేదీ ఎప్పటికీ దొరకక.. బరువెక్కిన నా హృదయానికి వీడ్కోలు చెబుతూ వెడలిపోయిం .. ప్రేమించే హృదయం లేదని ప్రేమే నన్నొదిలెళ్ళీపోతే.. ప్రేమే లేని చోటుకి ఒక ప్రేమించే హృదయం ఎలా చేరుతుందో... ఎందుకు చేరాలని అడిగితే.. మౌనమే నా భాషగా చనిపోయిన చిరు నవ్వుని సమాధానంగా ఇవ్వాలేమో..... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Sunday, May 30, 2010
చనిపోయిన చిరునవ్వే సమాధానమేమో...
Labels:
అంతర్మధనం
Subscribe to:
Post Comments (Atom)
gud one anDi.
ReplyDelete