"ఏమని చెప్పాలీ
![]() ![]() ![]() |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Thursday, April 19, 2012
ఏంటీ "ప్రేమా", నువ్వు అంత బేవార్సుగా పని లేకుండా ఉన్నావా???
Tuesday, April 17, 2012
ఢమాల్...
డాక్టర్కి ట్రీట్మెంటిచ్చి![]() ![]() ![]() మన సంభాషనంతా ముళ్ళపూడి వారి జాఠర్ ఢమాల్ ![]() అందుకే ఫ్ఫది లెక్కెట్టేలోపెల్లకపోతే పెయి"వేటు" ![]() ![]() ![]() |
Saturday, April 14, 2012
ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు...
ఎదుగుతున్న వృక్షాన్ని చూశావా మిత్రమా ఆదిలో అది కాండం నేడది విడివడిన కొమ్మలని నిశ్శబ్ధంగా చూసే ఆహార మాద్యమం మాత్రమే వృధ్ధిలో ఉన్న ప్రపంచాన్ని గాంచావా మిత్రమా, కొమ్మలుగా విడివడిన సంస్కృతులు, చిరుగాలికి రాలిపోయే పత్రపుఛ్ఛాల్లాంటి మనో ప్రవృత్తుల సముదాయమే అది అభివృద్ది చెట్టు యజమానికిష్టం, పండ్లు దొరుకుతాయి కాబట్టి కానీ వేర్పడిన కొమ్మలన్నిటికీ నీరందించే మొదలు గురించి కానీ, వేరు అనుభవించే బాధ గురించి కానీ తలపుకైనా రాని మనిషి వాడు, ప్రపంచాన్ని వాడుకునేవాడు... వేడుకునేలానే కనిపించేవాడు... వేరు పురుగులా చేరి పండ్లనే కాక మొదలుని కూడా తొలచేవాడు... అందుకే ఎప్పటికీ అడిగే ఒకే ఒక ప్రశ్న.... అనంతమైన నిశ్శబ్ధ నిశీది వంటి కాల గమనవై సాగే ఓ ప్రపంచమా... నీ పయనమెటు నువ్వు సాగే ప్రతి మలుపు నువ్వు మలచుకున్న దారే ఐతే, నువ్వు కావాలనుకునే గమ్యం గమనమా, లేక గమ్యమా నీ తరం నచ్చే దోవ నీది కాని దానికి నచ్చకుంటే నూతన తరం దానిని అసహ్యించుకుంటే... నీ గమనానికి అర్ధం లేదనుకునే వార్ధక్యం నీకో వరమా లేక శాపమా... మంత్రమై సాగిందట పౌరాణిక జీవితం, వేల ఏళ్ళు సాగేదట తపస్సనే యజ్ఞం... తంత్రమైపోయిందట రాజరికపు రణ జీవితం, బానిస శృంఖలాల జీవన వ్యవస్థలో యంత్రమై సాగుతుంది నా తరం, యంత్రానికి యంత్రమై, దాని మంత్రానికీ, తంత్రానికీ బానిసై... దాని ప్రతి ఆజ్ఞకి సై అంటూ... ఇంక నువ్వేమి చూస్తావో ఓ భవిష్యద్విధాతా... ఎలాంటి బలమో లేక ఎటువంటి భారమో... ఏదేమైనా మోయలేని ప్రతి తరాన్ని తిడుతుంది దాని ప్రక్క తరం... అందుకే చెబుతావా ఓ ప్రపంచమా, సాగే నీ పయణమెటో>>> |
Friday, April 13, 2012
Thursday, April 12, 2012
Tuesday, April 10, 2012
ఎవరివో నువ్వెవరివో...!!
అడుగుతున్నా అందరినీ ఎవరివో నువ్వెవరివో అని మబ్బులు అడ్డం వచ్చిన నిండు పున్నమి వెన్నలవా అందమైన రేకులు విచ్చిన గుళాబీ బాలవా లేక దారానికి గుచ్చిన సుగంధ పరిమళ మల్లెల మాలవా ఎవరివే నువ్వు ఓ చెలీ నా మనసుని దోచిన జాబిలీ |
Monday, April 9, 2012
ఎందుకో ఈ అతి నాగరికపుటలవాట్లు...
ఏం చేస్తున్నావురా అంటే... పెళ్ళి చూపుల కోసం బయోడేటా ![]() ఇంకేం, పనిలో పనిగా "స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్" ![]() ![]() ![]() ![]() |
Friday, April 6, 2012
ఆయ్!! సన్నటోళ్ళారా...
కలవో, కల్పనవో లేక వైష్ణవ మాయవో, ఏ తీరున నిన్ను చేరాలీ అని ఒక obese person, slimnessని ప్రాధేయపడటం చూశాను, నాకు నవ్వాగలేదు... నేను నవ్వుతుంటే, మా ఫ్రెండన్నాడు అదేంటీ ఆ prayer అతనూ నువ్వూ కలిసి చెయ్యాలి కదా అని... ![]() ![]() ![]() అస్సలు సన్నంగా ఉండేవాళ్ళకి లావుపాటోళ్ళు చేసే సాయాన్ని వాళ్ళు నిజంగా గుర్తించట్లేదంటాన్నేను, హా!! ఔను ఇది నిజం... అంతే కదా, ఈ లావుగా ఉండేవాడిని చూడలేకే కదా ఆ సన్నంగా ఉండేవాడి గర్లుఫ్రెండు ఆ సన్నటోడు ఏవరేజిగా ఉన్నా వాడికి ఫ్లాట్ ![]() ![]() ![]() ![]() |
Monday, March 26, 2012
Tuesday, March 20, 2012
ఇంట్రోస్పెక్షన్ మరీ ఇలా ఉంటే కష్టం...
విరహ గీతాలు పాడాల్సిన వయసురా నీది, మరి ఆ విషాద రాగాలేంటీ, ఒళ్ళంతా కళ్ళే ఐన మనిషికి కూడా నీకొచ్చినన్ని కన్నీళ్ళు వచ్చి ఉండవేమో... నీకు అర్ధం కాని విధంగా, నిన్ను అర్ధం చేసుకోని విధంగా జనం మారిపోయారని, కాలం మారిపోయిందని భావించాల్సిన అవసరం ఏంటిరా... మెతుకుల కోసం కళ అనుకునే వాడు ఫీలవ్వాలిరా భావుకత ఎదుటివాడికి నచ్చితేనే అందులో అర్ధం ఉందనీ... నీలాంటివాడు కాదు... ఎదుటి వాడు చచ్చిపోతున్నాడని నువ్వు గాలి పీల్చట్లేదు, ఎదుటి వాడికి ఆకలేస్తుందని నువ్వు భోజనం చేయట్లేదు... నీనుండి ఎదుటి వాడికైనా ఎదుటివాడి నుండి నీకైనా కావాల్సింది కోరుకోవాల్సిందీ, పలకరించే ఒక మనిషితనం, కష్టాల్లో ఆదుకునే తాహతు ఉంటే సాయం చేసే మానవత్వం... అమీబాలో లేనిదీ, పొరిఫెరా నుండి మొదలైందీ ఇదేరా... నీకో విషయం తెలుసా ప్రతి మనిషీ నీలాగనే అనుకుంటాడు భాద్యతల్నుండి దూరంగా ఉంటూ ఎప్పటికీ తెలియని నిద్ర పట్టేస్తే బాగుంటుందని... నొప్పి తెలియనిదే అనంత కాలపు ఆ నిద్ర నీకే కాదు ఎవరికీ రాదు... ఒక వేళ వచ్చినా నీ వాళ్ళు నీవు లేని నొప్పిని తట్టుకోవటం అంత సులభమని అనుకుంటున్నావా... బంధాలు విడిపోతున్న, విడిపోవటమే సమంజసమనుకుంటున్న సంస్కృతిని అలవర్చుకున్నవాళ్ళు అందులో ఎంతో కాలం మన గల్గుతారని అనుకుంటున్నావా?? అది కల్ల... ఎయిమ్ ఆఫ్ ది లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ అంటూంటావ్ కదా, కానీ అన్ని రకాలుగా ఆ హ్యాపీనెస్ సంపాదించటానికి నువ్వు చేయాల్సిన త్యాగాలెన్నో ఎప్పుడైనా ఆలోచించావా.... న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలు ఒకడికి తెలియవని వాడు మోసే బరువు వాడికి తెలియకపోతుందనుకోవటం అమాయకత్వమౌతుందిరా... జీవిత పాఠశాలలో మేష్టార్లంతా మనుషులు కాదురా, వాళ్ళు చాలా రకాలు, వద్దంటున్నా నేర్పించేస్తుంటారు... నువ్వెవరైనా ఎలాంటి విధ్యార్ధివైనా సరే... పాపం నిన్ను శిక్షించారని రిపోర్టు చెయ్యటానికి కూడా ఆస్కారం లేకుండా దాక్కుని మరీ శిక్షిస్తారు వాళ్ళు... ఓ అనంత దూరపు బాటసారీ, నీ మిసిమి ఛాయని చూసి మురిసిపోకోయి అంటూ ప్రతి రోజూ మృత్యువు తను కనిపించకనే ప్రతి ఒక్కరినీ పలుకరిస్తుంది... దానిని గురించి భయపడేవాడిని వెక్కిరిస్తుంది, దానిని కోరుకునేవాడిపై జాలి పడుతుంది... ఓటమి గురుతెరగని గెలుపుందని నువ్వు నమ్మావంటే ఓ చంద్రం, జీవిత పాఠంలో ఓనమాలు కూడా నీకు రావనిరా అర్ధం, చేసుకోకురా నీ జీవితాన్ని వ్యర్ధం...(ఇలా నాలో నిద్రానమై ఉన్న ఒకానొక మనిషి ఒక్కసారిగా లేచి ఉత్కంఠభరితంగా ఇలా ఉపన్యసించాడు) |
Monday, January 23, 2012
Subscribe to:
Posts (Atom)