ఉదయాన్నే సూర్యకిరణాలు.. పోటీ పడుతూ NRSలోకి దూసుకు వస్తుంటే, పచ్చగా ఉండే హాస్టల్ ఇంటీరియర్.... అబ్బబ్బబ్బా.. సూపర్.. అప్పుడే వాటర్ పడదామని వచ్చిన నేను ఆ దృశ్యానికి అబ్బురపడి, అచ్చెరువొంది.. మొబైల్లో భందించాను నాకైతే ఆ ఫోటో నచ్చింది..
శుభోదయాల అరుణ కిరణాలతో పాటు, వేసవి తొలకరిలో చిరుజల్లుల సాయంత్రపు వేళలు అద్భుతాలు... అప్పటి వాతావరణం నా ఆనందపు ఆర్ణవమై.. ఎప్పుడూ లేనిది ఆ రోజు ఆర్నెల్ల తర్వాత పీకాక్ లేక్కి వెళ్ళి లేక్తో పాటు మేఘాల్ని కూడా కలిపి ఫోటో తీశాను..
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో.. అన్నట్లుండే ఆ సాయంత్రం, మన యాంత్రికతని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది.
pichaaaa photography.....matalu ravatleadu gani maouli chepithee mahabhratahamea avuddi....super....
ReplyDeleteThank you very much Suresh..
ReplyDelete