|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Friday, December 31, 2010
Thursday, December 30, 2010
Sunday, December 26, 2010
Tuesday, December 21, 2010
A ఛాllenజ్2Theists..
I want to define the Super natural and metaphysical incidents are merely the rate of increased astonishment of individuals at it due to inconceivable methodology involved in and acting as the driving force which in turn because of the absence of proper rationale to conceive it... Do you all have any arguments dear Theists.. |
Sunday, December 19, 2010
Saturday, December 18, 2010
చిత్తరవులు..eye&mind
Friday, December 17, 2010
Sunday, December 12, 2010
కొన్ని ఆర్టు డిజైన్లు....
|
Friday, December 10, 2010
Saturday, December 4, 2010
నిద్ర....!? :)
నిద్ర...!! ఆహా ఎంత బాగుందో ఆ పదం వింటుంటే.... ఈ వాఖ్యం కూడా నేను నిద్రతో వాలుతున్న కళ్ళతోనే టైప్ చేశాను.... చిన్నప్పుడు ఒక తొమ్మిది నెలలపాటు, పూర్తిగా నిద్రలోనే.... రోజులు గుర్తుండవ్ కానీ... ప్రపంచం చూశాక అర్దమౌతుంది నాకు... అంత చిన్నప్పుడు కనీసం భోజనం చెయ్యాల్సిన అవసరం కూడా లేదు... అమ్మ ఏది తింటే అందులోనే కొద్దిగా అందుతుంది... తినటానికి కూడా బద్దకమే ఐనంత నిద్రలో, వెచ్చటి ప్రదేశంలో, ఏ ఒడిదుడుకులూ లేకుండా, ఏ ఆలోచనలూ లేకుండా, కనీసం ఊపిరి కూడా పీల్చే పని లేకుండా, శరీరంలో మృదువైన కండరాలు అసంకల్పితంగా మాత్రమే కదులుతూ, స్వర్గమంటే ఏమిటో తెలియచెప్పేంతగా నిద్రపోయే వయసు అది.... ఈ జీవిత పాఠశాలలో అత్యంత సుదీర్ఘమైన శలవుల్ని అంతకంటే సఖ్యంగా వాడుకోగలిగే వయసూ, పరిస్థితులూ వేరే ఉండవు అనుకుంటా... బయటకొచ్చాక ఎవర్నీ ఎవరూ సరిగ్గా నిద్ర పోనివ్వరు... బాగా గాలి పీల్చుకోటం నేర్చుకోకముందే అన్నం పెట్టేస్తారు... నిద్ర పోతాన్రోయ్ అంటే.. ఆడుకోమంటారు, పోనీలే ఆడుకుందామని చూస్తే ఆ సరదా కూడా తీరకముందే చదువుకోమంటారు.... ఈ పోటీ ప్రపంచంలో బడికెళ్ళి చదువుకోటం స్టార్ట్ చేశాక ఇంక నిద్ర అంటే ఏంటో, అదో ప్రశ్నార్ధకమే... చదువుకుంటున్నాం కదా కొద్దిగా ఎక్కువసేపు నిద్రపోదాం అనుకుంటే... అమ్మా, నాన్నలకీ ఇంకా మామయ్యలకీ ఇష్టమైన రైటర్లు, సైకాలజిస్టులు కొన్ని పుస్తకాలు రాస్తారు.. వాళ్ళు పెద్దవాళ్ళకోసం రాసుకోవచ్చు కదా... ఆహా! చిన్న పిల్లల మీదనే వ్రాస్తారు, పిల్లలు ఎక్కువసేపు నిద్ర పోతే.. సోమరిపోతులైపోతారు (వాళ్ళలాగా) అని ఇండైరెక్టుగా హింట్లు ఇస్తారు.... ఒకాయనేమో రోజుకి నాలుగ్గంటలు పడుకుంటే సరిగ్గా సరిపోతుందంటాడు, ఇంకొకాయనకి మొహమాటం ఎక్కువ, రోజుకి ఆరు గంటలు నిద్రపోవటం సబబే ఐనా, మూడు గంటల నిద్రతో కూడా పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని ఫలానా దేశంలో జరిగిన ఎక్సుపెరిమెంట్లలో తేలింది అంటాడు.... ఈయనేమన్నా చూసొచ్చాడా, ఆ అబ్బాయ్‌కి నాలాగా/హ్యాపీ సినిమాలో బ్రహ్మానందంలాగా కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటుందేమో..... ఇదంతా దేనికీ అంటే... స్కూల్లో ఫస్టొస్తేనే తర్వాత... ఆ తర్వాత... ఇంకా ఆ తర్వాత.... కూడా ఫస్టొస్తేనే.... గ్రాఫు బాగా పెరుగుతుందంట... ఐనా అందరూ ఫస్టుర్యాంకుకే చూస్తే మిగిలిన అంకీలన్నీ ఫీలవ్వవా?, మరీ అలా ప్రాకులాడటానికి ఫస్టు ర్యాంకేమైనా వేడి వేడి ఇడ్లీనా లేప్పోతే గొప్ప ఫిగరా... ఐనా ఫస్టు ర్యాంకు వద్దని ఎవరన్నారు, కాకుంటే దాని కోసం నిద్ర మానెయ్యమంటే ఎలా?, ఇప్పుడే ఇంకొక విషయం గుర్తొచ్చింది.. అప్పుడెప్పుడో పురాతనకాలం చిన్నప్పుడు ఒకసారి టీవీ చూస్తుంటే, అందులో ఒక స్వామిజీ మరీ మరీ చెప్పేస్తున్నాడు, నిద్ర అంటే తమస్సు, అంటే అజ్ఞానం, అందుకే తమసోమా జ్యోతిర్గమయా అంటారు అని... నేననుకున్నాను "వాడి బొంద, అదేదో వాడు.. నిద్ర పోకుండా ఎన్నాళ్ళో తపస్సు చేస్తే స్వామీజీ ఐపోయినట్లూ", ఈ డవిలాగు నాలో నేనే అనుకున్నాను... గట్టిగా అంటే, అమ్మ కొడుతుంది మరీ... మా సోది మొహాలు కొందరు స్టేటస్ మెసేజీలూ, ఎస్సెమ్మెస్లూనూ.... అదేటీ అనే కదా మీ ప్రశ్నా, తొందరెందుకు చెప్తున్నాను కదా.. "డ్రీం ఈజ్ నాట్ వాట్ యు గెట్ ఇన్ యువర్ స్లీప్, బట్ ఇట్ ఈజ్ ద ఒన్ విచ్ డజంట్ లెట్ యు స్లీప్", వీళ్ళందరికీ నిద్ర అంటే బాగా అలుసైపోయింది.. పోకిరి సినిమాలో ప్రకాశ్‌రాజ్ లాగా ఒక నాలుగు రోజులు నిద్రపోనివ్వకుండా ఉంచేయాలి వాళ్ళని. మా కోర్సు వర్కులో టీచ్ చెయ్యటానికి వచ్చిన ఒకాయన చెప్పాడు ఆయన ఓన్లీ లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకుని మేనేజ్ చేసేస్తాడంట, రోజుకి మూడు నుండి నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోతాడంట... తనని "ఇన్‌సోమ్నియక్ విత్ ఇండైజెషన్ ప్రోబ్లం" అని పరిచయం చేసుకోటానికి ఇంత పాజిటివ్ యాట్టీట్యూడ్ అవసరమయ్యింది ఆయనకి... మళ్ళీ నిద్రని ఇంతగా తిట్టుకునే చండ శాశనులందరూ, వాళ్ళ జీవితపు భాగహారంలో ఏమి సాధించేస్తారు అంటే... శేషం సున్నానే... అప్పుడు పోయే నిద్రకి మరలా మెలుకువ కూడా ఉండదు.... ఏంటో, ఉదయం లేచిన తర్వాత మళ్ళీ పడుకునే వరకూ సరాసరి ప్రతి మనిషీ.. ఆ రోజునే కాకుండా అటు ఒక వారాన్నీ, ఇటు ఒక వారాన్నీ వర్చువల్‌గా జీవిస్తాడు... పిటీ కండిషన్ ఏంటంటే, తొంభై శాతం మంది ఆ వర్చువల్ లైఫ్లో భాదల్నే అనుభవిస్తారు... వాళ్ళ ప్రెడిక్షన్లకో దండం బాబోయ్!!. నాకసలు అనిపిస్తుంది.. అలా డీప్ స్లీప్లోనికి వెళితే ఈ ప్రపంచం కానీ, ఇందులో ఉండే మనుషులు కానీ, తన పర భేదాలు కానీ, కోరికలు కానీ, ఆశలు కానీ, ఆర్తనాదాలు కానీ, భవిష్యత్తు మీది సంశయాలు కానీ, జవాబు దొరకని ప్రశ్నలు కానీ ఇలా ఏమీ అనిపించవ్... కనీసం ఒక రెండు వారాలు నేను పని కట్టుకుని చేసిన అబ్జర్వేషన్‌తో వందేళ్ళు తపస్సు చేసి ఒక మహర్షి తెలుసుకునే నిజంలో కనీసం రెండొందల పర్సెంటు అర్దమయ్యింది (నోట్:ఇది నా మైండుకి మాత్రమే కరెక్టు కావచ్చు)... నాకు క్రిందటి జన్మ ఉందో లేదో నాకు తెలియదు.. మళ్ళీ జన్మ ఉంటుందని నేను నమ్మను.. అందరూ ఆర్గ్యూ చెయ్యటం విన్నాను కానీ.. అలా ఆత్మ ఐపోవటాన్నీ, ఇంకో జన్మ ఉండటాన్నీ ఎప్పుడూ చూడలేదు, వాటి గురించి మాట్లాడేవాళ్ళు ఏ ఆదారలతో చెబుతారో నాకెప్పుడూ అర్దం కాదు... నేనైతే ఎప్పుడూ చూడలేదు.. నమ్మలేదు.. నమ్మను కూడానూ... ఇలా ఆలోచిస్తుండే నాకు లైఫ్‌లో నిద్ర తప్పించి ఏదీ ట్రూ ఫన్ అని అనిపించలేదు... జీవితంలో అనుభవిస్తున్న టెంపరరీ నిద్రకి ప్రతి పగలున్నీ, ఒక ఇంటరెస్టింగు సినిమా సీన్ మద్యలో ఇంటర్వెల్లాగానూ, సీరియల్ బానిసలకి వాటి మద్యలో వచ్చే ఎడ్వర్టైజ్మెంట్లలాగానూ అనిపిస్తుంది... ఏం చేస్తాం, పూర్తిగా నిద్ర పోవాలంటే నొప్పిలేకుండా అవ్వదాయే... చట్టం దృష్టిలో అది ఒక నేరమాయే... నా అనే వాళ్ళందరికీ అది ఒక శోకమాయే...... అందుకే అందాక అంటే సంపూర్ణమైన నిద్ర దానంతట అది వచ్చేదాక, టెంపరరీ నిద్రనే ఎంజాయ్ చేద్దామని డిసైడయ్యా... ఇది నేను డెబ్భై శాతం నిద్రలో ఉండగా టైప్ చేసిన ఆర్టికల్, కాబట్టి అక్షర దోషాలుంటాయ్, వాటిని మీరు నిద్రలోనే చదివేసి అర్ధం చేసుకోండి....... చదివితే చదివారు, నేను తెలిసినవాళ్ళెవరూ, ఈ పోస్టు రాశానని మా ఇంట్లో వాళ్ళకి చెప్పకండి... ఏమి లేదు వాళ్ళు మళ్ళీ నా కోసం టీ కెటిల్ పట్టుకుని,నన్ను ఇన్సోమ్నియక్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తే కష్టం కదా... ఓకే నాకు బాగా నిద్రొస్తోంది.. గుడ్ నైట్... అండ్ సౌండ్ స్లీప్.. అండ్ నో డ్రీమ్స్ ప్లీజ్..... |
Friday, December 3, 2010
కొద్దిగా బోర్ కొడితేనూ..
బోర్ కొడుతున్నా కొన్ని సార్లు చెయ్యి దురద ఊరుకోదు... అలా తయారైనవే ఇవి...
|
Wednesday, December 1, 2010
Saturday, November 27, 2010
వెకిలి నవ్వొకటి
............నన్ను నేను మరచానని చెబితే... పంచభూతాలన్నీ నన్ను తమలో కలిపేసేందుకు ఆత్రత చూపించాయ్, వాటివైపు వెళ్ళలేక, అలాగే ఉండలేక సతమతమయ్యే నన్ను చూసి ఓ వెకిలి నవ్వొకటి నవ్వుకున్నాయ్........ |
Saturday, November 20, 2010
చలనాశక్య పావునైతినే....
విరహగీతం విరసగీతమై విరిజల్లు జడివానగా మారుతున్నట్లు వికటాట్టహాసం చేసే వికృత విధి వంచనలో చలనాశక్య పావునైతినే.. |
Tuesday, November 16, 2010
ఎందుక్కాదూ?
చెల్లా చెదురైన భాష సంస్కరణ వ్యాసునికే సాధ్యం కావచ్చు |
Thursday, November 11, 2010
Wall-E బావుంది.. :)
Wall-E సినిమా చూశారా, చాలా బాగుంది. భూమ్మీది వనరులన్నీ పూర్తిగా వాడేయబడి, పచ్చదనం అంతా మాయమైపోయే తరుణంలో, నివాసయోగ్యం కాని ఈ ప్రదేశం నుండి మిగిలి ఉన్న జనాల్నందర్నీ ఒక స్పేష్ షిప్‌లో నింపి అంతరిక్షంలోకి పంపించేస్తారు.. అక్కడి నుండి వాళ్ళ సామాన్య అవసరాలన్నీ రోబోట్లే చూసుకుంటూంటాయ్. భూమ్మీద ఉన్న డెబ్రిస్ అంతటినీ క్లీన్ చేసే భాధ్యత మన వాల్-ఇ అనే రోబోట్ చూసుకుంటుంది.. దాని దైనందిన జీవన విధానంలో ఆ చిన్ని రోబో చేసే పనులన్నీ నవ్వు తెప్పించటంతో పాటు, హృదయాన్ని కదిలించేలా.. బాగుంటాయ్. మొక్కలేమన్నా పెరిగే అనుకూలమైన మార్పు వాతావరణంలో వచ్చిందేమో అని పరీక్షించటానికి వచ్చే ఈవా అనే రోబోతో మన వాల్-ఈ కి లవ్ స్టార్టవుతుంది. భూమ్మీద దొరికిన ఒక్కగానొక్క మొక్కని స్పేష్‌షిప్‌కి తీసుకెళుతుంది ఈవా, దాని కోసం వాల్-ఈ కూడా వెళుతుంది.. ఇలా ఈ సంఘటనలతో భవిష్య-దర్పణాన్ని చూపించటంతో పాటుగా, మనుషులకి ఎలిమెంట్ ఆఫ్ ది హార్టు, వ్యాపారవేత్తలకి కమర్షియల్ ఎలిమెంటు ఐన రొమాన్సు, లవ్ లాంటివాటిని చక్కగా పొందుపరచి రూపొందించిన మంచి యానిమేషన్ మూవి Wall-E.
|
Sunday, November 7, 2010
ఓh Goడ్...!!
జీవితమెందుకు దేవుడా అని ప్రశ్నించాలంటే మనిషి నెగెటివ్‌గానే ఆలోచించాలా? నిరాశ ఉంటేనే తప్ప మనిషికి మోక్షం గుర్తు రాకూడదా, ఏమో... దేవుడున్నాడా? అంటే వచ్చే ప్రతి సమాధానమూ ప్రశ్నార్ధకంతోనే అంతమౌతుంది హహహ.. ఆశావాదినీ, నిరాశావాదినీ ఇద్దరినీ ఒకేలా చూడగలిగేది ఇద్దరే అనుకుంటా.. ఒకటి ఏమీ తెలియని పసి పిల్లలు, ఇంకొకటి అన్నీ మర్చిపోయిన పిచ్చివాళ్ళు... హహ.. నిజానికి ప్రశ్నల్ని సరిగా సంధించగలిగితే అవి ఫుల్‌స్టాపుల్ని చీల్చి చెండాడి ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి... అవి ఆశకీ, నిరాశకీ... జీవితానికీ, నిర్జీవితానికీ... ఇలాంటి అన్నిటికీ అతీతమైన స్థితికి మనల్ని లాక్కుపోతాయి... ఈ క్రింది కవితలో దేవున్నే నిందిస్తూ సంధించిన పదాలే ఆ స్థితికి నిదర్శనం... |
Thursday, November 4, 2010
నిన్ను లతలు పెనవేస్తున్న ఆ తరుణం...
"సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ, ఓ శుభ ముహూర్తాన...." అన్నట్లుగా అద్భుతంగా కనిపించిందీ వృక్ష-లతా కౌగిళి ఒకానొక సాయం సంధ్యవేళ... అంత దగ్గిరగా పెనవేసుకుపోయిన ఆ దృశ్యాన్ని తిలకించగలిగే ఏ జీవికైనా ఆనందం అతిశయమై హృదయం స్పందించి తీరుతుంది(హృదయం ఉన్నట్లైతే)... రియలిస్టులకి(అంటే నా దృష్టిలో హృదయం లేనివాళ్ళు అని అర్దం), ఆ తీగకి చెట్టు అనేది ఆధారం మాత్రమే, చెట్టు ఆధారం ఇవ్వలేనిదైతే తీగ దానిని అసరా చేసుకోదు అని అంటారు వాళ్ళు... అనంతమైన ఆనందాన్నిస్తాను ఆస్వాదిస్తావా అని ప్రకృతి అడిగితే, నాకదేమీ అక్కర్లేదు.. బాగా బతికేదీ, బ్రతికించేదీ ఏదైనా ఉంటే నా మొహాన పడేయ్ లేకుంటే మూసుకుని కూర్చో అని ప్రకృతికి కూడా చెప్పేవాళ్ళు ఆ రియలిస్టులు... వాళ్ళకి ప్రేమ కూడా ఒక అవసరం ఆధారంగానే పుడుతుంది... వేసుకునే బట్టలకీ, తినే ఆహారానికీ ఇచ్చినంత ఇంపోర్టెన్సు మాత్రమే దేనికైనా సరే ఇచ్చే ముముక్షువులూ, స్థితప్రజ్ఞులూ వారే... వాళ్ళకి living ఒక passion, feelings ఒక lesion... వాళ్ళ విషయంలో వాళ్ళని తప్పు పట్టేందుకు మీకు ఒక్క అవకాశం కూడా లభించదు, ప్రపంచమంతా వాళ్ళ తత్వంతోనూ, వాళ్ళతోనూ నిండి ఉంది.. మీకు రియలిస్టులు ఒక వేళ నచ్చితే ప్రేమించానని చెప్పొద్దు, వాళ్ళకది పట్టదు, వాళ్ళది నమ్మరు... నేను పోస్టు చేసిన కవితకీ పైన చెప్పిన సోదికీ సంభందమేంటని అడగద్దు, ఎందుకంటే అడిగినా నేను చెప్పను, ఒక వేళ మీరు ఏదైనా interpret చేసుకుంటే, మిమ్మల్ని రియలిస్టని అనేస్తాను... నాకు తెలిసి నా వరకూ, ప్రపంచంలో అంతకంటే పెద్ద తిట్టు ఇంకొకటి లేదు.... ;) |
Sunday, October 31, 2010
కేయూరాని న భూషయంతి పురుషం..(my view on art of communication)
ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ మీద సంస్కృతంలో ఒక మంచి శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో వాక్చాతుర్యం అనేది ఒక నిజమైన, మరియు శాశ్వతమైన అలంకారంగా పేర్కొనబడింది... చంద్రహారాలూ, లేపనాలూ, పన్నీటి స్నానాలూ, పూల మాలలూ అలంకారాలు కాదూ, సంస్కారంతో కూడిన(contextual interpretation needed) వాక్కు సరైన అలంకారమౌతుందీ, వాక్కు అనే అలంకారమే లోకాలలోకెల్లా మంచి అలంకారం అని చెప్పబడింది... కేయూరాని న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా భర్తృహరికి వాక్కు అనే అలంకారంతో పాటు, ఆచరణ అనే అసంక్రమిక ఆస్తి గురించి మనసులో తట్టలేదేమో.. అప్పటి పరిస్థితుల ప్రభావంలోనూ, దేశ కాల మాన స్థితిగతులలోనూ ఆచరణకి అంత ఆధరణ లేకనో అలా కాక తను ప్రేమతో ఇచ్చిన పండు చేతులు మారిన విధానంతో, జీవితం అనే విషయంలో కన్నులు తెరిచి మోక్షపదం వైపు దృష్టి మరలిపోవటం వలననో మరి తెలియదు. కానీ అలంకారం అలంకారమే కానీ మనిషి కాదు, మనిషేంటో తెలియజేసేది అతని ఆచరణ, వ్యవహారం... simply speaking work and worth of human makes him what he/she really is. అందుకనే ఆంగ్లంలో కూడా చెబుతారు Actions speak louder than Voice అని... పై శ్లోకాన్ని విమర్శిస్తుందా అనేటట్లుండేది ఒక వేమన పద్యం అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను హహహహ్!! ప్రస్తుత ప్రపంచం అంతా vacuumలో పెట్టిన ఇనుము అయస్కాంతం తనని attract చేసిన వైపు దూసుకుపోతున్నట్టు ప్రయాణిస్తుంటే, నీతులెన్ని చెప్పి ఏం లాభం లే, ఇటు తనకీ పనికిరావు, అటు వాటిని చదివేవాడికీ పనికిరావనేమో ప్రస్తుత కాలపు రచయితలెవరూ అలాంటివి రాయటానికి పూనుకోవట్లేదు... ఏదేమైనా ఒకటి మాత్రం నిజం కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవటం అనేది, సౌండు బాక్సుల్లేని మ్యూజిక్ సిస్టం లాంటి పరిస్థితి. వాళ్ళ బుర్రలో/చేతల్లో చేవ ఎంతుందో మనకీ and/or వాళ్ళకీ తెలియకపోయినా తెలియాల్సిన అవసరం లేకుండానే, వాళ్ళ మాటల్తోనే చిలుక జోస్యం నుండి టీవీ యాంకరింగ్ వరకూ నిరాటంకంగా మరియు దగ'ధ్ధగా'యమానంగా సాగుతున్న జీవితాలు.. భర్తృహరి శ్లోకానికి ఉదాహరణలు.. :) |
Friday, October 29, 2010
నేను నువ్వైన నా ప్రేమలో...
.........ఏ విషయాన్నైనా ఎంతో సులభంగా భావించగలిగిన మనిషి, తన నిజమైన ప్రేమ విషయంలో అలా భావించలేడు, పరిస్థితులు తనని వెక్కిరిసున్నా, వెక్కి వెక్కి ఏడుస్తాడే తప్ప, వెనక్కి మరలి ఆ విషయాన్ని మరచిపోలేడు... నిజమైన ప్రేమ మరుపుకి రావాలంటే పునర్జన్మమెత్తాలి (అదంటూ ఉంటే)..... మరి ఆమెకిదంతా అర్దం కాదెందుకనో............ |
Thursday, October 28, 2010
ఏ బాధాతప్త హృదయుని శాపమో...!!
మనసుని మీటే స్వప్న స్వరాలెన్నో, వాటి సోయగాల లాలనలో ప్రియుడు తన నిజ ప్రదేశాన్ని వీడి ఎక్కడెక్కడో విహరిస్తాడు... ఆ ఊహా యుటోపియా లోకాల్లో ఎంత దూరం వెళ్ళినా, అది ఒక యుటోపియాగానే తనకి మిగిలిన కారణం గుర్తురాగానే, కన్నీరు మున్నీరౌతాడు... మాట పెగలని రోధనల సాక్షిగా, ఆవిరైపోయిన కన్నీరే ఆధారంగా, ఒంటరిదైపోయి మిన్నకుండి చూస్తున్న హృదయమే తన ఆసరాగా... :( |
Wednesday, October 27, 2010
అదృష్టానిది సంకుచిత హృదయం ఫ్రెండూ...
నువ్వు అడిగిన సాయం ఎవరూ చెయ్యకపోవటం ఒంటరితనం కాదు ఫ్రెండూ... నీకు కావాల్సిన సాయం చెయ్యమని నిన్ను కూడా నువ్వు అడగలేని పరిస్థితి ఎదురైతే అది నిజమైన ఒంటరితనం.... అందుకే నీకు నీకంటే మంచి ఫ్రెండు కనీసం ఒకరన్నా ఉండాలి, ఏ ఎల్లోరా శిల్పం వల్లనో నువ్వొక శిలా విగ్రహమైపోతే, నువ్వడక్కుండానే ఒక ట్రాలీలో తీసుకెళ్ళి కనీసం నిన్ను నిమజ్జనం చెయ్యటానికైనా ఉండాలొకరు... కానీ అదృష్టానిది సంకుచిత హృదయం... నువ్వూ, నేనూ ఏమీ చెయ్యలేం ఫ్రెండూ...... |
Sunday, October 24, 2010
కాలమైనా చెబుతుందో లేదో??
...........................వాడెప్పుడూ అంతే, బాధ కలిగితే తట్టుకోలేడు, అప్పుడప్పుడూ ఒక్కడే కూర్చుని బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటాడని ఎవరో చెబితే విన్నాను, ఏమి జరిగిందో తెలియదు.. కానీ వాడి మనసు మనసులో లేదు.. నవ్వులో జీవం లేదు.. మాటలో ఉండాల్సిన భావం కనిపించట్లేదు.. కనిపిస్తే ఎంతసేపట్లో తనని ఒంటరిగా వదిలేస్తామా అన్నట్లు మొహం పెడతాడు. కారణమేంటో చెప్పడు, ఎప్పుడూ అంతా దాచుకునే ఇంట్రావర్టేమో, మొహంలో భావాల్ని పులుముకుని కనిపిస్తాడు.. ఏమిట్రా అది సైకోలాగా అంటే, మొహం రెండు చేతుల్లో దాచేసి, ఎవరికీ తెలియకుండా తన అరచేతి చారల్నే, కన్నీటి ప్రవాహపు దారుల్లా భావిస్తాడు, మొండోడు, బండోడు, గుండే తనకి లేదంటాడు, దాని అవసరమూ లేదంటాడు... ఎప్పుడూ, ఎదురు చూస్తున్నానంటాడు, దేని కోసమో ఎవ్వరికీ చెప్పడు, కాలమైనా చెబుతుందో లేదో............................................ |
అసలు తెలుగులో నాకు తెలిసిన తెలుగెంతంటే..
ఉదయాన్నే టిఫిన్ చేద్దామని మెస్‌కి వెళ్ళినపుడు ఫ్రెండ్సుతో అలా అలా మాట్లాడుతుండగా, ఎవరికి ఎన్నెన్ని భాషలొచ్చు అనే విషయం చర్చలోనికొచ్చింది.. దానికి నా సమాధానంగా నాకు మూడు భాషలు తెలుసు తెలుగు యావరేజీ, ఇంగ్లీషు బిలో యావరేజీ, హిందీ బిలో పావర్టీ లైన్ అని చెప్పాను.. ఆ ఎక్స్ప్రెషన్‌కి అందరం నవ్వుకుంటుండగా.. నా ఫ్రెండొకడన్నాడు, "నువ్వు రాసిన కవితలు తెలుగు తెలిసినోళ్ళే అర్దం చేసుకోటానికి కష్టపడుతున్నారు, నీ తెలుగు యావరేజీయా" అని. దానికి సమాధానంగా, అలా అనే వాళ్ళు చిన్నప్పట్నుంచీ కాన్వెంట్సులో బాగా కేజీలు కేజీలు చదివి ఉంటారులే కాని, కవితలు రాయటానికి పరమోత్కృష్టమైన భాషా జ్ఞానమేమీ అవసరం లేదూ అని చెప్పి అసలు తెలుగు అనబడే తెలుగుకీ, నాకు తెలిసినపాటి తెలుగుకీ ఉన్న తేడాని అక్కడే ఈ క్రింది కవితతో వివరించాను, ఇది విన్న తర్వాత ఆయన వేరే శబ్దాలేమీ చెయ్యలేదు ఈ విషయం పైన... |
వికసించే చిరునవ్వా..
నీ నైరాశ్యం నిమేషం, ఆనందం అనంతం, ఆశల భారాన్నీ.. భావాల బాధల్నీ.. ప్రక్కన పెట్టి, చిద్విలాసుడివై చిరునవ్వు నవ్వవోయి అని నాలోని రెండో మనిషి మొదటి మనిషిని ఊరడించిన సందర్భంలో లిఖితమైన ఈ కవనం, మీ కోసం... |
Wednesday, October 20, 2010
Tuesday, October 19, 2010
Sunday, October 17, 2010
పందికేం తెలుసు పన్నీరు వాసన...
ఇంటర్మీడియట్లో ఏమీ తెలియని వయసులో ప్రేమకి ఎంతో విలువ ఇచ్చే ప్రతివారూ, PG, Ph.D., లకి రాగానే, లవ్‌ని అదేదో గార్బేజీలో పడేయాల్సిన విషయంలాగా చూస్తారెందుకనో... ఏదో సామెత చెప్పినట్టూ పిగ్గీ బ్యాంకులో చిల్లర పోగు చేసుకుంటా డాడీ అనే పిల్లాడు పెరిగి, పందికేం తెలుసు పన్నీరు వాసన అన్నాడంట... |
నాస్తికుల ఊర్లో గుడి పూజారిలా ఐపోయింది నా పరిస్థితి..!!
Love అంటే ఎందుకో వాళ్ళకి అంత అసహ్యమూ, insecurity లాంటివి... వాళ్ళకే కాదు వీళ్ళకీ చులకనే... I think "LOVE" is at wrong phase of యుగచక్రం... it doesn't have sustenance on this earth... Its true irony from many people, they say some letter code and say that they feel better that than love... ఛా!! నాస్తికుల ఊర్లో గుడి పూజారిలా ఐపోయింది నా పరిస్థితి.. |
Saturday, October 16, 2010
Thursday, October 14, 2010
Tuesday, October 12, 2010
Monday, October 11, 2010
సక్సెస్...
success కాట్లకుక్కలా వచ్చి నిన్ను కాటేయాలంటే... దాన్ని రెచ్చగొట్టి రెచ్చగొట్టి వదిలేసే భాద్యత నీ మీదే ఉంది... ఇంకెవరిచేతో రెచ్చగొట్టిస్తే అది వాళ్ళకోసం వెళిపోతుంది.... |
Sunday, October 10, 2010
ఆ ద్రవమంతా ఉపద్రవమై...
గుండె నిండా ప్రేయసిపై ప్రేమని నింపుకుని తనకి వ్యక్తపరచలేని స్థితిలో తను కనిపిస్తూ, ఏమీ మాట్లాడలేని ఆ పరిస్థితి, శరవేగంతో ప్రయాణిస్తున్న నీరు సుడిగుండమై, సహాయమందించమని చెయ్యి చాచి, వేస్తున్న గావుకేక గొంతు అంచుని దాటక ముందే ఆ ద్రవమంతా ఉపద్రవమై జలగర్భంలోనికి లాక్కుపోతున్న భావన కలుగుతుందెందుకో... |
Saturday, October 9, 2010
నిరర్ధకమో...?
పల్లవించిన ప్రేమ పరవశించిన నా హృదయంలో ప్రేయసి ముద్రించు సుందర అద్దకమో, లేక ప్రేయసియే లేని ఓ ప్రశ్నార్ధకమో, అదీ కాక ఒక పరిపూర్ణ నిరర్ధకమో...?? |
Thursday, October 7, 2010
ఆమె జ్ఞప్తికి వస్తే...
ఊహాలోకమే నిజమై, నిజమైన ఈ లోకమే ఊహల్లోకి జారిపోతే?... ఎంత బాగుంటుందో!!.. ప్రేయసి జ్ఞాపకాలే తన ఊపిరి ఐనట్లుగా భావించే ఈ ప్రియుని ఆరాధన, ఆమెని ఎప్పటికి చేరుతుందో, ఎలా చేరుతుందో.. అలా చేరేటప్పటికి, ఎవరో కవిగారు చెప్పినట్లు 'నువ్వు వలచావని తెలిపేలోగా నివురైపోతానేమో'; నీకు నేను మాటై తెలపాలా, నా కన్నుల్లో భావాలు నీకు తెలియవా అని మనసు పొరలు దాటి బయటకి రాని వేదన, కన్నులకు తన గోడు మొర పెట్టుకుంటే, కరిగినపోయిన ఆ కళ్ళే, కన్నీళ్ళై నేలని తాకాయి... నువ్వెంత వెతికినా కనిపించని లోతులకి ఇంకిపోయాయి... |
Wednesday, October 6, 2010
ఆవేదన..
............నా జీవితం తెరచిన తెల్లకాగితపు పుస్తకం, దానిపై తన పేరు రాసి సొంతం చేసుకోమంటే, వాళ్ళంతా కాగితాలు చింపి నలిపి వెళ్ళిపోతున్నారు మిత్రమా............ |
Tuesday, October 5, 2010
Monday, October 4, 2010
తలుపు తియ్యని నా మనసులో...
ప్రేమని వ్యక్తపరచాలనుకునే అబ్బాయికి, అంతర్లీనంగా ఎన్ని సంఘర్షణలో... పాపం అందులో కూడా ఆశావాదం గెలవటానికి తను పడే పాట్లు, మనసులోనే దైవానికి చేసే విన్నపాలు, ఏమి జరుగుతుందో అనిపించే భయాలు... ఇన్ని కలగలిపిన ప్రేమని జయప్రదం చేసుకోవటం అనే విషయాన్ని.. ఒక జీవితపు ఖర్చులా భావిస్తారెందుకో చాలా మంది.. |
Sunday, October 3, 2010
హ్యాపీ బర్త్ డే to మి
ఈ రోజు నా బర్త్ డే, మన బ్లాగ్ కమ్యూనిటీస్‌లో నాకు ఫ్రెండ్సు చాలా తక్కువ... నా బర్త్ డే సందర్భంగా కొత్త స్నేహాలని అహ్వానించాలని నా అభిలాష.. మరి నాతో ఫ్రెండ్సిప్ చేస్తారా ఎవరైనా? |
Saturday, October 2, 2010
ఆర్య ఆట :)
నేను ఆర్యా ఆట(గులకరాయిని గ్లాసులో వెయ్యటం లేదా.. గ్లాసుని డస్టు బిన్లో వెయ్యటం లాంటివి) ఆడే ప్రతిసారీ, నా లవ్ సక్సెస్ అనే చూపెడుతుంది.. (అంటే అది వేస్తున్న కంటెయినర్లో కాకుండా ప్రక్కన పడితే నా లవ్ సక్సెస్ ఔతుంది అనుకుంటా లెండీ).... ఏంటో లవ్ సక్సెస్ అనే చూపించినా.. లవర్ దొరకదే... this is too much కదా?? |
Friday, October 1, 2010
బాబ్రీ వివాదాస్పదమైనప్పుడు తాజమహల్ ఎందుక్కాదూ?
తాజ్‌మహల్ కట్టడం భగ్నప్రేమకి చిహ్నమని భావించే కట్టడమని చరిత్రలో ఉన్నా.. కొన్ని ఆధారాలు నిజమైనట్లైతే, అది కూడా వివాదంలో అయోధ్య కంటే వేరే కాదనే చెప్పొచ్చు... ఆ విధంగా ఐతే దాని మీద ఎందుకు వివాదం చెలరేగలేదూ... వి.హెచ్.పీకీ, ఆర్.ఎస్.ఎస్ కీ దాని గురించి తెలియదా, లేకుంటే తెలిసిన దానిలో నిజం లేదా లేకుంటే వాళ్ళు రాముని తప్ప శివుని పూజించరా? Base for argument: CLICK HERE |
Tuesday, September 28, 2010
నా (అ)ధర్మ సందేహా(శా)లు...
|
Thursday, September 23, 2010
అదియూ ధిక్కారమాయే.. చీత్కారమాయే...
నా వైఖరికి నేను బాగా అప్పున్న సమయంలో టైప్ చేసిన కవిత ఇది.. తన ఉనికినే ఎప్పుడూ రహస్యంగా ఉంచే దేవుడు కూడా తనకి సహాయం చెయ్యడని తలచిన మనిషి, బహుశా ఇలా భావించే అవకాశం లేకపోలేదు.. |
Tuesday, September 21, 2010
Sunday, September 19, 2010
చెవిటివాని ముందు శంఖమే...
గరళం నా భోజనమైనంత మాత్రాన అమృతం నాకు విషమంటావా కష్టం నా బాటైనంత మాత్రాన దుఃఖం నా మిత్రుడే అంటావా ప్రేయసి నాకు లేనంత మాత్రాన ప్రేమకి నేనర్హుణ్ణేనంటావా నష్టం నన్నిష్టపడినంత మాత్రాన మరణమే నా శరణమంటావా నువ్వేమంటావో అనేయ్ నా అంతః శత్రువా, నీ ప్రతి మాటా నాకు చెవిటివాని ముందు శంఖమే ... |
Saturday, September 18, 2010
Wednesday, September 15, 2010
సంక్రాంతి :)
ప్రస్తుతం వర్షాల విసురుకి అతివృష్టి భయం పట్టుకుంది జనాలకి, కానీ వాటిని సమయానుగుణంగా సద్వినియోగం చేసుకునేవారికి, వీటి వలన వచ్చే దిగుబడు ఒక సంక్రాంతి కలగా కనపడుతుంది... ఆ ఆలోచనకి స్వప్నదర్పణ చిత్తరువు, నేను మూనిరుడు సంక్రాంతి మీద రాసిన ఈ కవిత. ఓ లుక్కేయండి మరి... |
Sunday, September 12, 2010
నా పేరు, యానిమేషన్లో...
ఒక మూడేళ్ళ క్రితం అంటే నేను ఎమ్మెస్సీలో ఉండగా ఈ ఆర్టు గీశాను.. ఈ ఆర్టుని HCUలో F హాస్టల్లో నా రూమ్‌కి నేమ్ బోర్డు లాగా ఒక పది నెలలు కంటే ఎక్కువ కాలమే మెయింటెయిన్ చేశాను.. నాకు బాగా నచ్చటం వలన స్క్యాన్ తీసి యానిమేషన్ బిల్డ్ చేశాను. లవ్ సింబల్ ప్రక్కనే పాములా ఉండే L ఇంకా కన్నులా ఉండే i.. టోటల్‌గా "లవ్లీ" మరలా లవ్ సింబల్‌ని చూస్తే అందులో బ్లూ M, బ్లాక్ O, ఇంకా రెడ్ కలర్ U తో పాటు ప్రక్కనే L, i మొత్తం ఆ బొమ్మని ఇంగ్లీషులో రెండుసార్లు చదివితే.. లవ్లీ మౌళీ(Lovely Mouli) అనేటట్లుగా కనపడుతుంది... నా పేరు శివుని పేరన్నమాట.. శివునికి ఆభరణాలు నాగుపాము ఇంకా చంద్రుడు... అదీ కాక మూడో కన్ను ఉంటుంది శివునికి బొమ్మలో i మద్యలో ఉన్న కన్ను శివుని త్రినేత్రాన్ని గుర్తుకు తెస్తుంది.. ఈ విధంగా ఇటు ఆంగ్లాన్నీ, అటు పురాణాన్నీ కలిపి చిత్రించానన్నమాట.. మీకు నచ్చిందా? :) |
Saturday, September 11, 2010
పెన్నాన్‌హ్యాండ్ డ్రాయింగ్..
ఏదో ఆలోచిస్తుండగా, ఆ ఆలోచనల్ని బొమ్మలో చూపించాలని ఇలా గీసేశాను, కానీ నా ఆలోచన కంటే, నా బ్లాగ్ పాఠకుల ప్రజ్ఞాశక్తి అద్భుతమని భావించి, ఈ బొమ్మకి అర్దాన్ని మిమ్మల్ని, మీ భావాలతోనే వివరించమని అడుగుతున్నాను... రాస్తారా మరి వ్యాఖ్యల్ని.. :) |
Friday, September 10, 2010
జఘన లోలకపు గజగామిని...
నీ నడుమే అందం, నడకే నాట్యం అనేటట్టుగా.. ఆమె నడిస్తే, ఆ నడకలో ఉండే అందానికి నా లే-మ్యాన్ ల్యాంగ్వేజీలో నాకు తెలిసిన మూడు నాలుగు రకాల పదాలు, ఏదో చెప్పేయాలని ఇలా ఇలా ఈ కవితలా మీ ముందుకి ఉబికి వచ్చేశాయ్... వాటికీ తెలీదు అంతటి అందాన్ని వర్ణించటానికి, నా హ్యాండీక్యాప్ ల్యాంగ్వేజే కాదూ, మాంచి హ్యాండ్సమ్ ల్యాంగ్వేజీ కూడా సరిపోదని.. భాషలో తప్పుల్ని చూడక... భావంలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ.. |
Subscribe to:
Posts (Atom)