నా బ్లాగుని చూడటానికి వచ్చిన మీకు సుస్వాగతం :) - హే నీదీ నాదీ సిమిలర్ కలర్ డ్రెస్ అన్నాను, అంతే సేమ్‌ పించ్ అని గట్టిగా గిల్లేసిందామె, అంత వరకూ పించ్ అంటే, డయేరియాకి చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపిన నీటి గురించి గవర్నమెంట్ పని గట్టుకుని ఇచ్చే యాడ్‌లో మాత్రమే విన్నాను, మొదటిసారిగా ఇలా కూడా పించ్‌ని వాడతారని అర్దమైంది, నిజంగా భుజం కందిపోయింది తెలుసా, పాపం నా మీద ఆమెకి అంత పగ ఎందుకో అనుకున్నాను సేమ్‌ పించ్ అంతరార్ధం తెలియక ముందు. <౦> మొన్నీమధ్యన ఒక రోజు నా మానాన నేను ఉప్పులేని పప్పేసుకుని అన్నం తింటుంటే ఒకడొచ్చి క్రికెట్ స్కోరెంతా అన్నాడు, నాకు తెలియదు నేను క్రికెట్ చూడను అంటే, నువ్వు దృవాల్లో పెంగ్విన్‌లాగా పుట్టాల్సినోడివి ఇక్కడ పుట్టేశావని తిట్టేసి వెళ్ళిపోయాడు, అంటే క్రికెట్ చూడకపోవటం అంత పెద్ద తప్పా?? :( <౦> చిన్నప్పుడు అమ్మాయిలంతా, వద్దు వద్దంటున్నా పట్టుకుని నలిపేసి మరీ ముద్దులు పెట్టేసేవారు, కొంతమందైతే వాళ్ళు ఆంటీలని, పెళ్ళైందని కూడా మర్చిపోయేవారు, అదే ఇప్పుడైతే ఇలా బయటకి వెళితే ఆడవాళ్ళంతా అలా ఆమడ దూరం వెళ్ళిపోతున్నారేంటీ చెప్మా అని ఒకడి సమక్షంలో గట్టిగా అనేశాను, దానికి వాడు,"అంటే చిన్నప్పుడు చెమట కంపు అంతగా ఉండదు కద సార్ ",అని వాడి దారిన వాడు పోతుండగా, వాడి సంచీ మీదున్న డియోడరెంట్ కంపెనీ లోగో చూశాక అర్దమయ్యింది వాడి చెమట కంపు వెనకాల అంతరార్ధం, shit he vanished the tinge of fun & romance in the above statement. <౦> (20Sep2010) మంచబ్బాయ్ అంటే మంచాల క్రింద దూరేవాడంట, చిన్నప్పుడు నన్నందరూ మంచబ్బాయ్ మంచబ్బాయ్ అని ప్రోంప్ట్ చేశారు తూచ్, తొండి నేనొప్పుకోను... నా రూములో మంచం క్రింద అన్నీ బ్యాగులే ఉన్నాయ్.. ఎలా దూరాలని వాళ్ళు అనుకుంటున్నారూ? <౦> ఛీ నా జీవితం, నా ప్రోటీన్ సీక్వెన్సు చూసి UKG స్టూడెంటొకడేమో నాకు ABCDలు ఆర్డర్లో రాయటం రాదన్నాడు, నేను తక్కువ తిన్నానా.. పుస్తకాల్లో మరి అడ్డదిడ్డంగానే రాస్తారు కదా వాళ్ళనేమీ అనవేం అంటే.. వెక్కిరించి మరీ అన్నాడు నీకు అది కూడా తెలీదా వాటిని వర్డ్సనీ, సెంటెన్సెస్ అనీ అంటారు, వాటికి మీనింగు అవీ గట్రా ఉంటాయ్, నువ్వు రాసినవాటికి మీనింగూ లేదూ ఆర్డరూ లేదూ అన్నాడు, చుట్టు పక్కల్లో చెంచాలేవీ లేవు కానీ లేప్పోతే అందులో నీళ్ళేసి దూకేసేవాణ్ణి.. వాడ్ని మళ్ళీ కనపడనీ అప్పుడు చెబుతాను.. <౦> పరకాయ ప్రవేశంలో మీకేమైనా ప్రవేశం ఉందా.. నేను అందులో సిధ్ధహస్తున్నని మా తమ్ముడంటూంటాడు, అదెలాగరా అంటే.. నేను వాడితో మాట్లాడినప్పుడల్లా వాడికి తెలీకుండానే సగం బ్రెయిన్ తినేస్తానంట, ఇంతకీ వాడు నన్ను తిట్టాడంటారా, పొగిడాడంటారా.. <౦> క్లాసురూములో మీరెప్పుడైనా నిద్రపోయారా, మీరేమో కానీ నేనైతే మా డిగ్రీలో ప్రతిమా మేడం క్లాసుని insomnea పేషెంట్లకి ప్రిస్క్రిప్సన్‌గా రాస్తాను, పాపం రోజూ ఎవరో ఒకరు దొరికిపోయేవారు.. వాళ్ళకి తెలీదు నాలాగా కళ్ళు తెరిచి నిద్ర పోవటం ఒక కళ అని <౦> మా ఫ్రెండొకడున్నాడులే, ప్రతిజ్ఞ చేసేటప్పుడు "భారతీయుల్లో కొందరు నా సహోదరులు" అని స్పెసిఫిగ్గా చెప్పేవా.. ఏరా అలా అంటే వాడికి తెలిసిన వాళ్ళలో తొంభై శాతం మంది వాడి బావలు, బామ్మర్దులేనంట.. దీన్నే అంటారేమో ప్లెడ్జిలో ప్రాక్టికాలిటీ అని.. <౦> మీకో విషయం తెలుసా సవన్నా గడ్డి భూముల్లో గడ్డి ఆరు నుండి పదడుగులదాకా పెరుగుతుందంటే, వాటిని చూట్టానికి అక్కడికి తీసుకెళ్ళమని ఇంట్లో గొడవపెట్టేవాణ్ణి, ఏంటో‌చిన్న పిల్లలంటే అందరికీ అలుసే ఎవరూ పట్టించుకోరు(అప్పుడు NGC,Discovery మాకు వచ్చేవి కావు) <౦> మా ఫ్రెండొకండు ఐమ్యాక్సులో స్కేరీ హౌస్‌లో భయపెట్టే మనుషుల్ని "బాయ్యా" అని భయపెడతానన్నా.. వాడు భయపెట్టాడో‌లేదో‌తెలీదు కానీ వాడంటే మాత్రం మిగిలిన జనాలం భయపడటం స్టార్ట్ చేశాం..<౦> "పారా హుషార్ పారా హుషార్, తూరుపమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ దక్షిణమ్మా పారా హుషా..." నేను బాగా చిన్నప్పుడు ఈ పాట వింటున్నపు‌డు అనుకునేవాడిని దిక్కులన్నీ బాగానే ఉన్నాయి కానీ మద్యలో ఈ పారా హుషార్ ఎవరా అని, ఇప్పుడు తెలిసింది లెండి. మీకెప్పుడైనా అలా అనిపించిందా? అనిపించకపోయుండొచ్చులెండి, ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్లూ/ఇంటెల్లేడీసూ కాబట్టి.. <౦> జానెట్‌జాక్సన్ నాతో అంది "నువ్వు చాలా బ్యూటిఫుల్లుగా డ్యాన్సు చేస్తున్నావ్, నాతో డ్యాన్సు చేస్తావా" అని, కానీ కుదర్లేదు.. ఎందుకంటే నేను అప్పుడే నిద్ర లేచిపోయాను కదా... <౦> ఎవరన్నా అందమైన అమ్మాయి మిమ్మల్నెప్పుడైనా బుధ్ధావతారం అని అందా, అదేదో పొగడ్తనుకునేరు తిట్టంట(అంటే నేను ఒకసారి పొగడ్తనుకున్నాను లెండి).. <౦> ఎందుకనో జనాలంతా టేస్టీ అనటం మానేసి యుమ్మీ అంటున్నారు.. అదేదో "ఉమ్మి" లాగా వినిపిస్తుంది నాకు.. ఇదేటమ్మా, ఇలాగైపోనాదీ.. మా చిన్నప్పుడెప్పుడూ మేమెరగమమ్మా!!.. <౦> జీవితమంటే సరదాగా గడపటానికే అంటాన్నేను.. నాతో ఏకీభవిస్తారా?<౦> మీరు లావుగా ఉంటారా ఐతే రోజుకు మూడు సార్లు తల అడ్డంగా ఊపితే సన్నంగా ఐపోతారంట.. డాక్టర్లకి వేలు, లక్షలు పోసే బదులు ఇది బెటర్ కదా..?<౦> నేను ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటాను మొదట్లో నేను చెప్పేది వినటానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండేది అనుకునే వాడిని, కానీ తర్వాత్తర్వాత ఎవరూ లేకున్నా మాట్లాడేస్తుండే సరికి మా ఫ్రెండ్సు టెలీఫోన్ డైరక్టరీ చూస్తుండటం చూస్తూ ఉండే సరికి ఉత్సాహం ఉండబట్టలేక అడిగేశాను.. వాళ్ళు నా గురించే మెంటల్ హాస్పిటల్ నెంబరు వెతుకుతున్నారని తెలిశాక.. నా షట్టర్(మౌత్) క్లోజ్ చేసుకుని జనాలతో మాత్రమే మాట్లాడుతున్నాను<౦> ఆ మద్యనే ఒకబ్బాయిని అడిగాను మానవతా విలువలంటే తనకిష్టమేనా అని.. చాలా ఇష్టమని చెప్పాడు, ఎందుకని అడిగితే తన గర్లు ఫ్రెండు పేరు మానవత కాబట్టి అని చెప్పాడు.. అప్పుడర్దమైంది నీతులు ఎదుటవాడికి చెప్పటానికే అనే ట్రెండు పోయి చాలా రోజులైందని <౦> మీరెప్పుడైనా లవ్ ఫెయిలయ్యారా.. ఒక వేళ ఫెయిలైనట్లైతే మీరు చాలా ఫీలయ్యుంటారు కదా.. కానీ ఏ పరిస్థితిలో కూడా మీది తప్పని ఖచ్చితంగా ఒప్పుకోరు కదా.. నాకు తెలుసు మీరు ఒప్పుకోరని<౦> మీరెప్పుడైనా రజినీకాంతులాగా రెండు చేతులతో రెండు పెన్నులు పట్టుకుని సంతకాలు ఒకేసారి పెట్టటానికి ప్రయత్నించారా..ఫన్నీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి... ఈ సుత్తి ఇంతటితో ఆపుతున్నా.. మళ్ళీ ఇంకెప్పుడైనా సుత్తి కొట్టే మూడొస్తే.. కొత్త సుత్తితో‌ మీ నెత్తి పగలగొట్టేందుకు సిద్దమౌతా...

Pages

Friday, July 23, 2010

హౌస్ హస్బండ్...

వహవా కాన్సెప్ట్ వింటూంటేనే చాలా అద్భుతంతా ఉంది.. హ్యాపీగా పెళ్ళి చేసుకుని.. రోజూ భార్య ఆఫీసుకెళ్ళి వస్తూ సంపాదిస్తూ ఉంటే.. ఇంట్లో వంట చేస్తూ ఆమె రాగానే "హాయ డార్లింగ్, ఏంటి ఈ రోజెలా గడిచింది", అంటూ వేడి వేడి కాఫీ కప్పొకటి ప్రేమతో ఆమెకందించి... తన అలసట తీరేలా.. కాసేపు మాట్లాడి... ఉతికి ఇస్త్రీ చేసిన టవలొకటి తన చేతికందించి స్నానానికి పంపించి వంటకి సరుకులు సామాన్లు సిధ్ధం చేసుకుంటూ ఫాస్టు ఫాస్టుగా వంట చేస్తూ.. మద్యలో ఆమె వచ్చి.. "ఆ తొక్కలో వంకాయ కూర నీకు సరిగ్గా వండటం రాదు.. కాస్త ఆమ్లెట్ వెయ్యొచ్చుగా", అంటూ ఏవేవో సలహాలిస్తూ.. అలా వెళ్ళి సోఫాలో కూలబడి ఎల్జీ ఎల్‌ఇడీ టీవీ రిమోట్ కంట్రోల్ పని పడుతూంటే.. అర్ద గంటలో వంట రెడీ చేసి.. అరముద్దలను గోముగా టేబుల్ స్పూన్లో పెట్టి తినిపిస్తూ.. మద్యలో నా తలపుల కారణంగా తను పొలమారితే.. గలాసుతో మంచి నీళ్ళు తాగించి.. "నువ్వు నాలో సగ భాగం కాదు నా ప్రియతమా, నువ్వే నేను", అని చెప్పి.. తన హృదయాంతరాళంలోనికి చొచ్చుకునిపోయి.. తరువాయి బాగంలో రసాస్వాదనానంద ఢోళికా సుమమధురాధర రసాస్వాధనారాధాకులమై........................!!

 ఇలా.. ఇలా.. చెబుతూ పోతే ఈ పేరాగ్రాఫ్ ఎప్పటికీ అవ్వదేమో... కానీ ఇంతకి ముందెవరూ ఈ రకంగా అనటం నేను వినలేదు.. 

"బాబూ నీకు పెళ్ళి చేసేస్తే మాకో గొడవొదిలిపోతుందిరా.." ప్రతి ఒక్కరి అమ్మ కూడా యుక్త వయస్సు వచ్చిన తన పిళ్ళాడితో చెప్పే మాట ఇది.. అంటే పెద్దవాళ్ళ గొడవొదిలిపోయి ఆ గొడవేదో చిన్నవాళ్ళకి అంటించాలని అనుకుంటా.. దురదగొండాకుని మనకి తెలియకుండా అంటించేయటమంటే ఇదేనేమో.. తర్వాత తోలూడితే మాత్రం వాళ్ళకేం పోయిందీ..  మా ఫ్రెండొకడికి పెళ్ళి సంభందాలు వెతుకుతున్నప్పుడు ఆడ పెళ్ళివాళ్ళడిగారంట.. ఏం బాబూ ఏం వెలగబెడుతున్నావని (ఇలాగే కాకున్నా కొద్దిగా గౌరవ పదజాలంతోనే అడిగారంట).. "నేను యూనివర్సిటీలో పిహెచ్.డి. చేస్తున్నానండీ.." తలని సగర్వంగా పైకెత్తి.. పెళ్ళి చూపులకోసం మాత్రమే స్పెషల్‌గా కొన్న కళ్ళజోడుని సరి చేసుకుంటూ హుందాగా అన్నాడు మావాడు.. అంటే ఇంకా చదువుతున్నావన్నమాట..(ఇండైరెక్టుగా నీక్కూడా పెళ్ళికావాలా అని అన్నమాట), అసలు విషయం ఏంటంటే అమ్మాయి తండ్రికి పిహెచ్.డి. అంటే ఏంటో తెలియదంట.. అదేంటని ఆ సదరు మామ వరుసకి చెందినాయన ఆయన తమ్మున్నడిగితే.. వాళ్ళ తమ్ముడిచ్చిన సమాధానమేంటంటే, "అదేనన్నయ్యా, ఉద్యోగం రాకపోతే హాస్టల్లో పడి తింటూ, టైం వేస్టు చేస్తారు కదా అదే.." అన్నాడంట, అది విని మా వాడికి మొహమెక్కడ పెట్టుకోవాలో తెలియక.. అమ్మాయిని చూడకుండానే వెనక్కొచ్చేశాడంట.. ఏం చేస్తాం ఎనక్కొచ్చాక వాడు మాకందరికీ భగవద్గీత చెప్పేశాడు, అది వినలేక మేం చచ్చాం... 

ఏం నమ్మట్లేదా... మానేయండీ.. ఔను మరి.. హ్యాపీగా ఎటువంటి షంటింగూ లేకుండా అద్భుతంగా ఉంటూ ఎవరి దాదాగిరీ లేకుండా మనం ఉండాలనుకోటం తప్పా చెప్పండీ.. ఏంటో సంతోషంగా ఉంటే చూడలేరనుకుంటా ఈ పెద్దవాళ్ళంతా.. "ఈ పెద్దోళ్ళున్నారే.."....

పెళ్ళి చేసుకుంటే... మీ ఆవిడకి ఎలా నచ్చితే అలా ఉండాలి.. లేకపోతే ఆమె ఫీలౌతుంది.. పొరపాటున సోది చెప్పే వాగుడుకాయైతే.. ఆమెని కార్నివోరస్ పర్సన్ కోవలోకి తీసుకోటం మంచిది.. కొన్నాళ్ళకి మీ బ్రెయినంతా తినేయబడి మీరు భోంచేస్తున్నప్పుడు కూడా నోట్లోంచే ఎందుకు తినాలి, నవ రంధ్రాలున్నాయి కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడదాం లాంటి క్రియేటివ్ పధ్ధతుల గురించి ఆలోచించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇంకో కేటగిరీ అమ్మాయిలుంటారు వీళ్ళు జనరల్‌గా ఏమీ మాట్లాడరు.. వాళ్ళని మనమే అర్దం చేసుకోవాలంట.. వాళ్ళకేం కావాలో చెప్పకుండానే తెలుసుకుని అలా మనకి నచ్చినా నచ్చక పోయినా చేసేస్తూనే ఉండాలంట.. వీళ్ళ మాటల్లో "నీ చూపులు నా వీపుకి గుచ్చుకున్నాయ్" లాంటి పోకిరి సినిమా డైలాగులు చాలా చాలా వినిపిస్తూ ఉంటాయి.. ఐనా మనం మనల్ని మనం అర్దం చేసుకోటానికే చాలా సార్లు పని పెట్టుకుని ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సొస్తుంది, వీళ్ళనెలా భరిస్తాం చెప్పండి... మరో కేటగిరీ అమ్మాయిలుంటారు వీళ్ళకి మనమీద ప్రేమ పుట్టాలంటే మనకి మన పనితోపాటుగా ఏ ఫ్యాక్టరీనో లేక జువలరీ గని లాంటిదో ఉండాలి..

పోనీలే ట్రూ లవ్ చేసే అమ్మాయెక్కడా ఉండదా అని అనుకుందామంటే, హెల్లీ తోకచుక్క చూడ్డానికి అరవై సంవత్సరాల కాలం ఆకాశం చూస్తూ టైం వేస్టు చేసుకునే వాడిలా చూస్తారు మీ మిగులు జనాలందరూ.. ఒక వేళ మీరు హైదరాబాదులో ఉంటే ఎర్రగడ్డని, విశాఖపట్నంలో ఉంటే చినవాల్తేరునీ మీ అడ్డాగా చేసేందుకు ప్రయత్నించేవారు కూడా అందులో ఉంటారు..

బ్రతకాలంటే సంపాదించాలి.. అదే పెళ్ళి చేసుకుంటే, చచ్చినట్లు చచ్చో చెడో‌ సంపాదించాలి.... చాలా మంది అభిప్రాయం ప్రకారం.. తమరు మొగుడు/మగాడు టైప్ పదాలకర్హత సంపాదించాలనుకుంటే మినిమం ఒక బంగ్లా, కారూ, శాలరీ ఫెయిరూ మరియు మీరు లవ్లీ అయ్యుండాలంట...

ఒక వేళ పాత చింతకాయ పచ్చడి పులుపులాంటి అభిప్రాయాలేమైనా మీ దగ్గరున్నట్లైతే, మీ పని ఔట్.. ఏమంటే "నువ్వేమైనా పుడుంగువా, మొగుడైతే నాకేంటి.. నేనేమైనా అప్పలమ్మననుకున్నావా, మైండ్ యువర్ టంగ్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్.. " ఇలా దులిపేసి మీ చింత పులుపుని సింకులోకి కడిగి పారేస్తారంట... 

బహు పరాక్, బహు పరాక్.. ఇట్ సీమ్స్ దట్ పెళ్ళి ఈజ్ బహు చిరాక్ బహు చిరాక్... చెప్పండీ పెళ్ళవసరమా??

ఇంక పెద్దవాళ్ళ విషయానికొస్తే.. మనికిష్టం ఉన్నా లేకున్నా పెళ్ళి చేసేసి.. చేతులు దులిపేసి వాళ్ళు చిన్నవాళ్ళైపోతారు.. పొరపాటున మీరు మీ ఆవిడ అనే జీవంతో ఎక్కువగా మాట్లాడి.. మీ పెద్దోళ్ళతో తక్కువగా మాట్లాడారనుకోండి.. పెళ్ళయ్యాక వీడు బాగా మారిపోయాడు.. ఏం చేస్తాం అడ్డాలనాడు బిడ్డలు కానీ గెడ్డాల నాడా.. అని వాళ్ళు పక్కింటోళ్ళతోనో లేదా తెలిసినోళ్ళతోనో చెప్పటం.. వాళ్ళు ఒకవేళ మీకు క్లోజ్ ఐతే పర్సనల్‌గా మీటయ్యి మీకు ప్రైవేటు చెప్పేయటంలాంటి విషయాలన్నీ జరుగుతాయి.. ఒక వేళ మీ అవిడకీ మీ అమ్మగారికీ పడట్లేదనుకోండి.. ఎడ్వెర్టైజ్‌మెంట్లు లేకుండా టీవీ సీరియల్ చూసినట్లుంటుంది మీ జీవితం.....

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, కోకొల్లలు.. కానీ ఇవన్నీ ఎప్పుడంటే.. మీ మనసులో హస్బండంటే ఒక ఇది... మీరు చెప్పినట్లే మీ వైఫ్ వినాలి, ఆమొక కుక్కిన పేను.. వంటింటి కుందేలు కావాలి.. ఇలాంటి ఫీలింగ్సున్నప్పుడన్నమాట..

అలా కాకుండా మీరు ఈ ఆర్టికల్ ఫస్టు పేరాలో చెప్పినట్లు సిగ్గు పడకుండా(మీరు సిగ్గు లేకుండా అని అంటున్నారు.. నాకు వినపడింది) హౌస్ హజ్బండుగా ఉన్నారనుకోండీ.. ప్రేమకి ప్రేమ.. రిలాక్సుకి రిలాక్సు.. మీ పేరెంట్సుకి మీరే సేవ చేసుకోవచ్చు.. ఇలా అద్భుతంగా ఉంటుంది..... కాదా మరీ.. అమ్మాయిలు హౌజ్‌వైఫ్స్ కావచ్చు కానీ అబ్బాయిలు హౌజ్‌హజ్బండ్స్ కాకూడదా?.... "వై షుడ్ గర్ల్స్ హేవ్ ఆల్ ది ఫన్"






23 comments:

  1. konchem template change cheskovachuga. bheebhatsam ga undi. kallu baga strain autunnayi.

    ReplyDelete
  2. సున్నితం గా చెపుతూనే....నిజాలు కక్కేశారు కదండీ....ప్రతి ఒక్క పాయింట్ అక్షరాల నిజం.మరి మే ఛాయస్ ఏంటో...హుసే హస్బెండ్ అంటారా????

    ReplyDelete
  3. వై షుడ్ గర్ల్స్ హేవ్ ఆల్ ది ఫన్- మరేం.....తొందరగా హౌస్ హస్బెండయి ఆ తొక్కలో ఫన్ ఏదో అనుభవించేయండి.
    మీరన్న పరిస్థితే వస్తే... మీ పేరెంట్స్ కి మీరే సేవ చేసుకోవచ్చు.....వాక్యం మాత్రం కుదరదు. ఆమె సంపాదిస్తూ ఉంటే ఆమె తల్లి తండ్రులకి సేవచెయ్యాలి మీరు...
    మీరు సంపాదిస్తూ ఉంటే మీ పేరెంట్స్ కి సేవచేస్తున్నామా... మా పేరెంట్స్ ని ఉంచుకొని సేవచేస్తున్నమా....
    మీరు సరదాగా రాసినందుకు సరదాగా అడుగుతున్నా...లేదు మీరు సీరియస్సే అయితే ఆలోచించవలసిన పాయింట్లున్నాయి మరి

    ReplyDelete
  4. @రాణి:
    :) :) :) Thanks అండీ రాణి గారూ.. :)‌ :) :)

    ReplyDelete
  5. @Anonymous:
    నాక్కూడా మీలాగే టెంప్లేట్ నచ్చనప్పుడు మార్చేస్తా లెండీ..

    ReplyDelete
  6. @కవిత:
    ఏంటండీ కవితగారూ.. ఈ కాన్సెప్టు నచ్చి ఎవరైనా రెడీ ఔతున్నారా చెప్పండి... కండిషన్లేవీ పెట్టకపోతే.. నేను రెడీ అనే చెబుతానండీ...

    ReplyDelete
  7. Nice post :)..mee intlo pelli chestaamu antunnaara emiti meeku?

    ReplyDelete
  8. @సుధారాణి:
    మంచి పాయింటు లాగారండీ సుధారాణి గారూ.. ఐనా ఆమెని అంతగా ప్రేమించే వాడు, ఆమె తల్లిదండ్రులను మాత్రం ఎందుకు నిరాకరిస్తాడు చెప్పండి.. మీరు... అనగా జనరల్‌గా మీ ప్రశ్నల్లాంటి ప్రశ్నలున్న ఆడవాళ్ళు.. వాళ్ళ వాళ్ళ పేరెంట్సుకి సేవ చేసుకోపోతే.. నా దగ్గర పాయింటు లాగి ప్రయేజనమేముందండీ.. సరదాగా ఐనా.. సీరియస్‌గా ఐనా సరే.. ఐనా లాజిక్కుల్లాగేవాళ్ళు ఉద్యోగాలకి మాత్రమే పనికొస్తారు.. ప్రేమ, అభిమానాలుండేవాళ్ళు పెళ్ళికి పనికొస్తారు.. ఏంటంటారు..

    ReplyDelete
  9. @Rishi:
    అంటున్నారు అనే పదం కరెక్టు కాదండీ.. నా మీద జోకులేసుకుని భయపెడుతున్నారు... ఇంకా బెదిరింపులైతే లేవు.. పెళ్ళవసరమా అన్నందకు అరున్నర గంట క్లాసు పీకారు తెలుసా..

    ReplyDelete
  10. సరే...పాయింటుని మెచ్చుకున్నందుకు(?) థాంక్స్. పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు ముందే డిసైడింగ్ చేసుకోవాలన్నమాట....మేం లాజిక్కుగాళ్ళమా కాదా అని....
    ప్రేమ, అభిమానం వన్ సైడ్ ట్రాక్ అవడం వల్లేగా ఈ లాజిక్కులు తీయాల్సి వస్తోంది.
    ఓకె బ్రదర్...నిజంగా అంత అభిమానం చూపిస్తామంటే వద్దని ఎందుకనాలిట....
    మిష్టర్ పెళ్ళాం గా ఉండే అమ్మాయిని వెతుకుతాం...బయోడేటా పెట్టండి మరి.

    ReplyDelete
  11. అటుది ఇటు అయినా, ఇటుది అటు అయినా ఆ మురిపాల ముచ్చట్లన్నీ మహా అయితే మూడేళ్ళే కదా. ఆ తరువాత ఒకరికొకరు పాతబడి - ప్చ్ ఎందుకులెండి - మీ కలలని తుస్సుమనిపించడం.

    మహప్రభో - మీ టెంప్లేట్, కలర్స్ మారిస్తే నాలాంటి చదువరుల కళ్లకి కాస్తయినా శ్రమ తగ్గుతుంది.

    ReplyDelete
  12. ^ ఈ బ్లాగులో టెంప్లేట్, కలర్స్ మార్చాలని కోరే బదులు
    ఫైరుఫాక్సు / క్రోమ్ బ్రౌజరు తో స్టైలిష్ ఏడ్-ఆన్ కలిపి
    ఎవరికి కావలిసినట్లు వాళ్లు మార్చేసుకోండి :)

    సహాయం కావాలంటే :
    userstyles.org/styles

    groups.google.com/telugublog

    telugublogtutorial.blogspot.com

    superblogtutorials.blogspot.com

    ReplyDelete
  13. @సుధారాణి: అమ్మా తల్లే.... బయోడేటాలతోనీ.. పెళ్ళి పెద్దల వ్యవహారంతోనూ జరిగేవాటిని ఒప్పందాలంటారు... ఎవరి ఐడియా ఏమైనా కానీ.. పెళ్ళి ఒక ఒప్పందంలాగా ఉంటే.. జీవితం ఒక అడ్జెస్టుమెంటు ఔతుంది.... ఎప్పుడైనా గమనించారా.. ఎప్పుడైనా ఎవరైనా నచ్చిన అమ్మాయి కనిపించినపుడు అబ్బాయికి లేదా అబ్బాయి కనిపించినపుడు అమ్మాయికి.. వాళ్ళెవరో తెలియకపోయినా ఒక రకమైన infatuationలో ఉంటూ వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలని అనిపిస్తుంది చూశారా.. అలా అమెతో/అతనితో ఆ సదరు జీవి ఒక జీవిత కాలం అన్ని రకాల భాద్యతలు,బందాలు మరియు బరువులు ఉన్నప్పటికీ.. అదే infatuation state of feelingలో ఉంటూనే అది తగ్గకుండా, పరిస్థితులకి బానిస కాకుండా ఉంటే చాలా బాగుంటుంది కదండీ.. ఆప్పటిక్కానీ అర్దం కాదు ఈ సమాజానికి నిజమైన ప్రేమ అంటే శాశ్వతమైన infatuation+love+understanding అని.. ఒప్పందాలలో ఒకరినొకరు తక్కువ చేసుకోటానికే.. సగం జీవితం ఐపోతుంది... వింటానికి బాగానే ఉన్నా అలా నిజానికి అలాంటి అమ్మాయిలు ఎవరూ లేరనే కదా మీ అభిప్రాయం... ఏమోనండీ.. హెల్లీ తోక ఒకరి జీవితకాలంలో కనపడదని అదే లేదంటే‌ ఎలా చెప్పండీ..??

    ReplyDelete
  14. @శరత్ 'కాలమ్':
    అయ్యో శరత్‌గారూ... అటు తర్వాత ఏమీ లేదంటారా.. ఐతే మీ సలహాకి థాంక్సండీ... నా పాత ఫేవరేట్ ఐడియా ఐనట్టి.. "బద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ.." అనే కాన్సెప్టుతో శేష జీవితాన్ని కింగులా బతికేయొచ్చన్నమాట.. ఒకవేళ నా తోకచుక్క నాకు దొరికేసిందనుకోండి.. ఈ కాన్సెప్టుని అటకెక్కించేస్తాను.. కాకుంటే ఉల్కేదో తోకచుక్కేదో జాగ్రత్తగా చూసుకోవాలి మరి..
    :)

    అన్నట్లు నా టెంప్లేట్లో మీకు బ్లాక్ బ్యాగ్గ్రౌండ్ నచ్చలేదా.. అసలేమి నచ్చలేదు.. వైట్ బ్యాగ్గ్రౌండంటే.. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని ఈ కలర్ పెట్టానండీ..

    ReplyDelete
  15. మీ షష్టి పూర్తి లోపల హేలీ తోక(చుక్క)కనపడాలని కోరుకుంటున్నా.......గుడ్ లక్......

    ReplyDelete
  16. @ranjani: నా బ్లాగు విజిటర్సుకి సహాయం చేసినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండీ రంజని గారూ..

    ReplyDelete
  17. @సుధారాణి: పొరపాటున శతకం పూర్తైనా దొరక్కపోవచ్చు లెండి... మీ ఆశీస్సులకి నా దన్యవాదాలండీ

    ReplyDelete
  18. పెళ్ళి గురించి మీ రిసెర్చి బాగుంది.

    "......నోట్లోంచే యెందుకు తినాలి............"

    లాంటి క్రియేటివ్ పధ్ధతుల గురించి.....చాలా బాగుంది!

    ReplyDelete
  19. @కృష్ణశ్రీ:
    కృష్ణశ్రీ గారూ.. మీకు నా హృదయపూర్వక దన్యవాదాలండీ

    ReplyDelete
  20. తప్పకుండా.....
    మీరు టపాలు బానే రాస్తున్నారు గాని....
    మీ బ్లాగు చదువుతుంటే....కళ్ళు బైర్లు కమ్మి.....తలపోటు పట్టుకుంది.....
    మీ బ్లాగు మీకోసం రాసుకుంటే పర్లేదు...కానీ జనాలు కూడా చదవాలి అంటే మాత్రం అర్జెంటు గా మార్చండి.....
    ఒక టపా చదవ గానే ఇంకెప్పుడూ ఈ బ్లాగుకి రాకూడదు అనిపించింది....ఆ రంగుల వల్ల...

    ReplyDelete