ఉపకారికినుపకారము విపరీతముగాదు సేయ వివరింపదగున్ అపకారికినుపకారము నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతి నర్సరీ, కిండర్ గార్డెన్ ఇంకా అలాంటి స్థాయి నుండి చదువుకున్న వాళ్ళకి కూడా పైన చెప్పిన సుమతీ శతకంలో పద్యం దాని తాత్పర్యం తెలుసును.. ఐనా నాకు డౌటే అందుకే నేను చెబుతాను.. తాత్పర్యం: నీకు హెల్ప్ చేసేవాడికి నువ్వు హెల్ప్ చెయ్యటం పెద్ద గొప్పవిషయం కాదూ, కానీ నిన్ను హర్ట్ చెయ్యటానికి ప్రయత్నించినవాడికి కూడా నువ్వు హెల్ప్ చెయ్యగలిగితే అదీ గొప్ప.. అలా చెయ్యగలిగిన వాడే నేర్పరి.. నేర్పరి అంటే learnt అని అర్దం. పద్యాన్ని చదివేశారు కదా, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రండి.. ఆ పద్యం మన ప్రాక్టికల్ లైఫ్‌కి ఎంతవరకూ అవసరమంటారు? నిజంగానే ఆ శతక కాలానికీ ఇప్పటికీ స్థితి గతులు చాలా మారాయి కదా.. ఇప్పుడు నన్ను స్కూల్లో వేసి ఈ పద్యాన్ని చెబితే.. బయట ప్రపంచాన్ని గమనించే నేను రచయితని చిన్నచూపు చూస్తానేమో అనిపిస్తుంది.. ఈ పద్యాన్ని ఆదర్శంగా తీసుకునే తింగరోల్లెవరైనా వాళ్ళకి advantage లేనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసినవాళ్ళకి హెల్ప్ చేస్తారా.. పై లైన్లు ఓకే.. మూడో లైను అసలు సంభవిస్తుందా.. ఒక వేళ ఎవరి దగ్గరకైనా ఈ పద్యం తీసుకెళ్ళి హితోపదేశం చెయ్యాలని నేను తలిస్తే, వాళ్ళ వాదన క్రింది లైన్లలో ఉన్న వాక్యాలలాగానే ఉంటుందేమో... "అరటి తోలు చేయు ఎగతాళి కేక, విరిగిన నా నడ్డి మద్యనున్న వెన్నుపూసకెరుక, నాతో వాగకుండ చేరెదవా నీ ఇల్లు, లేక రాల్చనా నీ పల్లు పదనాల్గు రెల్లు" అదేంటీ నోటిలోని పల్లు ముప్పై రెండు కదా అనే కదా మీ డౌటు.. వావ్ మీరు బయాలజీలో బాగా స్ట్రాంగనుకుంటా.. కానీ ఇక్కడి లాజిక్కేంటంటే.. వాడప్పటికే హితోపదేశం చేసినవాడిని పీకి నాలుగు పల్లు రాలుస్తాడు.. కాబట్టి పల్లు పదనాల్గు రెల్లే.. మరి మీ "అమూల్"యమైన లేదా "హార్లిక్సు"ఐన అదీ కాకుంటే "బూస్టైన" అభిప్రాయమేమిటో.. ఐనా ఈ కాలంలో నేర్పరికి సుమతీ శతకంలోనే చాలా చక్కటి పద్యం ఉందని నా అభిప్రాయం.. "ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ" ఏం కాదంటారా.. కాకపోతే అందరికీ ఆ టాలెంటుంటుందా? ఏమో మరి? నేను మూడో తరగతి చదువుతున్నప్పుడొకసారి మా తాతయ్య నాకు పద్యాలు చెబుతూ ఈ పద్యం చదివి దాని గురించి చెప్పి ఏం అర్దమయ్యిందంటే ఏమీ చెప్పలేక చీవాట్లు తిన్నాను.. ఒక గంట దాని గురించే ఆలోచించాక ఆయన దగ్గరికే వెళ్ళి అప్పటి నా భాషా పరిజ్ఞాన లేమితో అక్కడున్న పదాలనే కొద్దిగా మార్చి చెబితే.. చీవాట్లు పెట్టివవారు కాస్తా పగలబడి నవ్వి తర్వాత వాళ్ళ స్కూల్లో కొలీగ్సుతో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకున్నారంట.. ఆ మార్చిన పద్యం ఎలా సాగిందంటే.. "ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటాడక అన్యుల మనముల్ నొప్పించి,తానొచ్చి తన్నించుకు తిరుగువాడె మౌళీ సుమతీ" నన్ను నేను పొగిడేసుకున్నానని మీకు జెలసీగా ఉంది కదా.. ఏం అవసరం లేదు కావాలంటే మీ పేరు చెప్పండి మిమ్మల్ని కూడా పొగుడుతాను.. అప్పటి మహానుభావులు రాసిన గొప్ప గొప్ప పద్యాలని ఈ కాలానికి చెందిన మనం.. సారీ సారీ.. "నేను" ఇలా తింగరి తింగరిగా చెప్పుకుంటున్నాను.. మరి మనం రాసే సాహిత్యంపైన ఇంకో శతాబ్దం తర్వాతవారు చేసే కామెంట్లేమిటో.. :) కానీ ఈ పోస్టులో నే టూ మచ్ సీరియస్సుగా, అస్సలు నవ్వకుండా, ముఖం బిగబట్టి మరీ అడిగే ప్రశ్నేంటంటే.. స్కూల్లో పిల్లలకి ఇలాంటి అప్రస్తుతమైన పద్యాలు అవసరమా, లేదా.. అసలవి అప్రస్తుతమా కాదా.. పద్య,గద్య పాఠ్యాంశాలన్నీ కొంతమంది స్థబ్ధ విద్యావంతుని ఆస్తులుగా భావిస్తున్నారు.. ఈ భావన నిజంగా నిజమా?? వాళ్ళే మన భాష మృత భాష కోవలోనికి చేరుతుందని భయపెడుతున్నారు.. దీన్ని మీరు ఒప్పుకుంటారా?? నేనైతే ఇవన్నీ మన పాఠ్యాంశాలలో భాగాలు కావాలంటాను.. కారణం మీ వివరణని లేదా వాదనని కామెంట్ల రూపంలో నాతో చర్చిస్తే చెబుతాను లేదంటే చెప్పను..
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Saturday, June 26, 2010
అపకారికినుపకారము.. కరెక్టేనా??
Thursday, June 24, 2010
కంప్యూటర్ అంటే.. ఒక మెషీన్ ఇంకో మెషీన్ ముందు కూర్చోటమేనా??
నెక్స్టు జెనరేషన్ కంప్యూటర్ అంటే.. ఒక మెషీన్ ఇంకో మెషీన్ ముందు కూర్చోటమేనా?? కానే కాకూడదంటాడు ఇండియన్ అని చెప్పునేందుకు మనందరం గర్వపడే ప్రణవ్ మిస్ట్రీ అనే MIT స్టూడెంట్.. కొత్తదనం నిండిన పపంచంలో.. కంప్యూటర్లోని మిధ్యా ప్రపంచంలోంచి, మన నిజ ప్రపంచంలోనికీ, నిజ ప్రపంచంలో నుండి మిధ్యా ప్రపంచంలోనికి అనుసంధానించబడి ఉండాలంటాడతను.. కంప్యూటర్ని, రెండు డబ్బాలు, ఒక కీ-బోర్డు ఇంకా ఒక మౌస్‌గా చూశాక.. పాత జెనరేషన్ మౌస్‌లో ఉండే బాల్ మూవ్మెంట్ సెన్సార్ నచ్చి ఆ టెక్నాలజీనీ వాడుకున్నాడంట తను.. ఒక రెండు మౌసులను వాడి వాటి సెన్సార్ వైర్లని త్రీడీ వ్యూలో ఉపయోగించేందుకు అనుగుణంగా తన సాఫ్టువేర్ని అలాగే ఆ త్రీడీని అనుభవపూర్వకంగా తెచ్చేందుకు అనుగుణంగా హార్డువేర్ని రూపొందించటం జరిగింది.. తన చేతిలో ఉండే సెన్సార్స్ ఏ ఆకృతిలో ఏమి చేస్తున్నాయో తన మెడలో వేసుకునే అతి చిన్న కంప్యూటర్ గుర్తిస్తుంది, దానికి అమర్చిన కెమెరా సెన్సరీ సిగ్నల్‌తో అనుసంధానించబడి మనకి కావాల్సిన సమాచారాన్ని అందించటం లేదా ఫోటోలు తియ్యటం ఇలా చాలా చాలా విషయాల్ని చేస్తుంది.. పేపర్లో ఉండే మ్యాపుల్ని చూపించగానే అప్పటి తత్కాళికమైన వాతావరణ స్థితిని అంతర్జాలం నుండి అందిస్తుంది.. ఒక ఎడ్వెర్టైజ్మెంటుని చూసి అందులో ఉన్న ప్రొడక్టు ఎక్కడెక్కడ అమ్ముతారో ఎడ్రసులతో సహా చూపిస్తుంది.. మీ రెండు చేతులకి ఆ సెన్సార్స్ కట్టి ఒక ప్రదేశాన్ని డైరక్షన్ చేస్తున్నట్లుగా పట్టుకున్నారంటే.. ఆటోమేటిగ్గా ఫోటో తీస్తుంది.. మీకు కావాల్సిన విషయాలను అందులోకి క్రోడీకరించుకున్న తర్వాత ఒక చిన్న గోడ లేదా ఏదన్నా ప్రదేశం మీద ఆ చిన్న కంప్యూటర్‌లోంచి వచ్చే కిరణాల్ని ప్రొజెక్ట్ చేసి మీకు కావాల్సిన విదంగా వాడుకోవచ్చు.. ఈ విషయాలన్నింటినీ తన మాటల్లోనే ఈ దిగువనివ్వబడిన వీడియోలో చూడండి...
|
Monday, June 21, 2010
ఆంగ్లంtoతెలుగు-నిఘంటువు...
| అంగ్లము నుండి తెలుగుకి (నిఘంటువు).. వీక్షించి.. నచ్చినచో అందరితో పంచుకొనుడి.. scanned పుస్తకాలు మంచివి ఇంకామైనా ఉంటే మీరునూ తెలియచెయ్యగలరని మనవి.. English Telugu Dictionary
|
సౌండ్స్ ఆఫ్ తెలుగు:(ebook)
| తెలుగు రాని తెలుగు జిజ్ఞాసువులెవరైనా తెలిసినవారుంటే.. ఈ పుస్తకంతో ఓపికున్నంత వరకూ కుస్తీ పట్టమనండి... ఇలా పుస్తకంతో పూర్తిగా తెలుగు నేర్చుకున్న ఇంగ్లీషోడి తెలుగు భాషా శబ్దాలని ఊహించుకుంటుంటే.. నాకైతే నవ్వు ఆగట్లేదు.. ఐనా సరే మన తెలుగు ఎలాగో ఒకలా నేర్పించెయ్యాలంతే.. !! 1. soundsOfTelugu
|
Sunday, June 20, 2010
కన్నీటి జలపాతం..
ప్రేయసి తలపులలో తలమునకలై ఆమెనే తన హృదయ దేవతలా కొలిచే ప్రియుని భావాల్ని అర్దం చేసుకునే స్థితిలో ప్రస్తుత ప్రపంచం లేదు.. యాంత్రిక జీవాలకదో హాస్యాస్పదం.. కానీ ప్రేమ ఘాడత తెలిసిన మనిషికి తెలుస్తుంది.. ఆ కన్నీళ్ళ విలువెంతో..
|
Saturday, June 19, 2010
CJ7: నాకు నచ్చింది...
ఒక చిన్న అబ్బాయి.. స్కూల్లో చదువుకుంటాడు, తన తండ్రి బాగా పేదవాడు కావటంతో.. సరైన బట్టలు, చెప్పులూ కూడా లేక అప్పుడప్పుడూ స్కూల్లో టీచర్ల చేత తిట్లు కూడా తింటూంటాడు.. అతడికి బొమ్మలంటే ఇష్టం కానీ, వాళ్ళ నాన్న కొనిపెట్టలేడు.. ఒక రోజు ఆ అబ్బాయికి ఒక ఏలియన్ డాగ్ దొరుకుతుంది.. కుళ్ళిన యాపిల్ని మంచి పండుగా మార్చగలిగే ఆ ఏలియన్ డాగ్‌ని చూసి ఎన్నెన్నో అద్భుతాల్ని ఊహించుకుంటాడు.. కానీ తాననుకున్న అద్భుతాలు వేటినీ ఆ కుక్కపిల్ల చెయ్యలేదు.. అద్భుతాలు ఒరగక సున్నా మార్కులొస్తే సున్నాకి పదిని చేర్చి తన తండ్రికి అబద్దాన్ని చూపెడతాడు.. నిజం తెలిసిన తండ్రి.. ఆ అబ్బాయిని తిడతాడు.. ఎప్పుడూ మోసం చెయ్యటం, అబద్దమాడటం, దెబ్బలాడటం లాంటివి చెయ్యకూడదని తాను చెప్పింది ఆ అబ్బాయి వినలేదని అంటాడు.. ఆ తర్వాత జరిగిన సంఘటనల పరిక్రమలో ఆ అబ్బాయి మంచి మార్కులతో పాసవుతాడు.. కానీ అతడి తండ్రి బిల్డింగ్ పనిలో యాక్సిడెంటై చావు, బ్రతుకుల మద్య ఉంటే.. బాదతో వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ ఆబ్బాయిని చూసిన ఏలియన్ డాగ్.. తన ప్రాణాన్నే ఇచ్చేసి.. పిల్లాడి తండ్రిని బ్రతికిస్తుంది.. ప్రాణం పోయిన ఆ ముద్దు ముద్దు ఏలియన్ డాగ్ ఒక బొమ్మగా మిగిలిపోతుంది.. చిన్న సినిమా, కథ.. పాత్రల సంఖ్య ఇలాంటివన్నీ తక్కువగానే ఉన్నా హృదయానికి హత్తుకునేలాగా తీశారు.. అందుకే అంటారనుకుంటే ప్రజ్ఞకి పనిముట్లు తక్కువున్నా/లేకున్నా.. తన ఉనికి చాటుకుంటుందని.. |
Friday, June 18, 2010
In resoponse to : దిక్సూచి (Mariners compass) కొనలు తిరిగే దిశలు మారుతాయా?
| In resoponse to : దిక్సూచి (Mariners compass) కొనలు తిరిగే దిశలు మారుతాయా? ^ | Nభూమి పై లైను భూమి అయస్కాంత బలాల డైరెక్షననుకోండి (N for north) మామూలుగా ఐతే కంపాస్‌లో south ముల్లు దాని వైపు చూపెడుతుంది... అదే మీరు భూమి యొక్క నిక్కచ్చైన అయస్కాంత దృవ ప్రదేశానికి వెళ్ళినట్టైతే అక్కడ అక్కడ కంపాసులో ముళ్ళు నిజానికి నిటారుగా నిలబడాలి.. కారణం: భూమి N - కంపాసు S దగ్గర ముళ్ళు నేలకి గుచ్చు కుంటే.. కంపాసులో N ని భూమి N వికర్షిస్తుంది కాబట్టి అది వ్యతిరేక దిశలో ఉంటుంది.. మీరు ఒక బరువు లేని స్థంభాన్ని అయస్కాంతంగా ఉత్తర దృవంలో నిలిపినట్లైతే.. దాని దక్షిణ దృవం నేలవైపు.. ఉత్తర దృవం ఆకాశం వైపు ఉంటాయి... అంతే కానీ అది వంగిపోయి రెండు కొనలూ ఆకాశం వైపు చూపదు.. ఆ ఉత్తర దృవమైనా ఆకాశం వైపు ఎందుకు తిరుగుతుందంటే.. ఎటు వెళ్ళినా భూమి యొక్క దక్షిణ దృవమే ఔతుంది కాబట్టి, ఆన్ని కోణాలలోంచీ సమమైన అయస్కాంత బలాలు లాగుతాయి కాబట్టీ.. ఎటువంటి కోణాలూ లేక నిటారుగా నిలుచుంటుంది.. రెండు ముళ్ళూ ఒక వైపు చూపించటం అనేది జరగదని మీకు విధితమయ్యిందని నా అభిప్రాయం, దానికి కారణం కంపాస్ ముళ్ళలో ప్రతి అణువూ ఒక అయస్కాంతమే, అంటే ఎక్కడ చూసినా మీకు రెండు దృవాలూ కనపడతాయి.. isolated poles సహజ అయస్కాంతంలో ఉండవు.. |
రెహమాన్ డ్యాన్సు టీచర్.. ;)
| ఇందాకే ఏ.ఆర్.రెహమాన్ పోస్ట్ చేసిన ట్విట్టర్ మెసేజ్ చూశాను... తన అల్టిమేట్ డ్యాన్స్ టీచర్ దొరికాడని రాసుంటే ఏంటా అని చూసే సరికి ఇదిగో youtubeలో ఈ వీడియో కనిపించింది... డ్యాన్సు మాత్రం.. ఇరగదేసేశాడా అబ్బాయ్.. అది మామూలు కేక డ్యాన్సు కాదు.. బహు కేక డ్యాన్సు, గావు కేక డ్యాన్సు.. చూసి ఎంజాయ్ చెయ్యండి. |
Thursday, June 17, 2010
^<^>^
| ..............చక్కగా వర్షం కురుస్తుంటే.. ఆ చల్లదనానికి ఒళ్ళంతా పులకించి చలితో ముడుచుకుని కూర్చుని... నేలని తాకి, పైకి గంతులేస్తూ లేచే చినుకు చుక్కల్ని చూస్తూ... నీలో కరిగిపోదామని చూస్తే........ |
Subscribe to:
Posts (Atom)

