| మనిషి వ్యక్తిత్వం మూడు రకాలంట అవి aggressive, assertive, depressive, ఆ మూడు రకాలలో డిప్రెసివ్ వ్యక్తిత్వం కలిగిన వాడికి ఉన్నన్ని కష్టాలు, వేరే ఏ రకంలోనూ ఉండవంట, కొంతమందికి ఈ డిప్రెస్సివ్ కండిషన్ ఒక యుటోపియాలాంటిది.. అలా డిప్రెసివ్‌గా ఉన్నప్పటి బాధని వాళ్ళకి తెలియకుండానే ఎంజాయ్ చేస్తుంటారు.. వాళ్ళ దగ్గర ఇలా అనకండి.. ఫీలైపోతారు.. కాకపోతే ప్రతి మనిషీ తన జీవితంలో ఈ మూడు స్థాయిల తాయిలాలనూ చవిచూసి కానీ జీవితం సడలించడు.. యాగ్రెసివ్ టైపు వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండండి.. అలాగే అసెర్టివ్ వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే వీళ్ళతో డీల్ చెయ్యటమే నిజమైన చాలెంజ్.. మీకు నచ్చిన పాప్యులర్ ఫిగర్లలో ఎక్కువ మంది ఈ కోవకి చెందినవారే.. నేను డిప్రెసివ్‌గా ఉన్నప్పుడు రాసిన కవిత క్రింది బొమ్మలో ఉంది... హృదయానికీ, మనసుకీ, ప్రేమకీ.. ఆ పదాలు వాడుతున్నందుకు వాటికి రెమ్యూనరేషన్ అడగవ్ కానీ.. అడిగే అలవాటుంటే బిల్‌గేట్సు కంటే రిచ్ ఐపోయుండేవవి... |
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Wednesday, June 9, 2010
భాష రాని హృదయంలో భావాలెన్నెన్నో...!?!?!?!?!
Tuesday, June 8, 2010
జవాబెట్లీయనే ఓ... నా హృదయమా...
నేను టైపు చేసి చదివాక నేనే వివశత్వానికి వశమయ్యాను.. ప్రేమంటే చచ్చేంత ఇష్టపడే మనిషికి ప్రేమ, ఎప్పుడూ దూరమైపోతే.. తను వ్యక్తపరిచే భావ పరంపరలో ఇదొక మచ్చు తునక.. ఆదరించబడుతుందో.. చీదరించబడుతుందో.. మీ పైనే ఆధారపడి ఉంది.. |
Monday, June 7, 2010
పోస్టుపోన్...
| మన ప్రపంచంలో ఉన్న symptoms ఏవీ ముందుగా కనపడనివ్వని అతి పెద్ద diseasesలో postponementని ఒకటిగా చెబుతాన్నేను, నా అంతట నేనే దాని బారిన చాలా సార్లు పడ్డాను, symptoms ఐతే కనపడవ్ కానీ.. పర్యవసానాలు చాలా ధారుణంగా ఉంటాయ్.. ప్రతి ఒక్కరికీ ఎపుడో ఒకప్పుడు దీని గురించి తెలిసొచ్చే ఉంటుంది.. |
Sunday, June 6, 2010
పడతుల్, వనితల్ నంగనాచులై...
| నాకు ఇలాంటోడు కావాలి, అలాంటోడు కావాలి.. నువ్వు వేస్టు, అందంగా లేవు, మొహం ఎప్పుడైనా అద్దంలోచూసుకున్నావా, నీకూ లవ్వు కావాల్సొచ్చిందా, నీ మొహానికి లవరెందుకు... ఇలాంటివి ఎప్పుడైనా వినాల్సొచ్చిందా.. అలా వినాల్సొచ్చినప్పుడు ఈ క్రింది కవిత కరెక్టనిపిస్తుందో కాదో మీరే చెప్పండి.. |
Saturday, June 5, 2010
నేను ప్రపంచ పౌరుణ్ణి...
| క్రికెట్టు జరుగుతూ ఉంటుంది, టీవీల ముందు గృహ జనులైనా, పుర జనులైనా గుంపులు గుంపులుగా అతుక్కుపోయి చూస్తూ ఉంటారు.. అందులో అప్పుడప్పుడూ ఇండియా కూడా ఆడుతుంది, కొన్ని సార్లు గెలుస్తుంది కూడానూ.. ఇండియా గెలిచిందని తెలిసిన కొన్ని క్షణాలపాటు కొన్ని కోట్ల ఊపిరితిత్తులు బిగ్గరగా గాలి పీల్చుకుని నిట్టూరుస్తాయి.. నిజంగా భరతమాత ప్రాణమున్న మనిషిలా ఉండుంటే, ఆ భారతీయతకి ఎంత సంతోషిస్తుందో.. ఎక్కణ్ణుచ్చొందండీ ఈ భారతీయత, ఇంత "భార"తీయత క్రికెట్లో మాత్రమే ఉందా లేక అన్నిట్లో ఉందా, అన్నిట్లో అంటే వేటిలో.. అంటే కొన్నిట్లో ఉండక్కర్లేదా.. కావచ్చు మరి, దొంగాడు భారతీయుడైనంత మాత్రాన ఇంటిలో సొమ్ముని దోచుకుపొమ్మని అడగం కదా అలాగే దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకోం కూడా.. పైన వేసిన సోది ఓకే మరి నువ్వేం చెప్పి ఏడవాలనుకుంటున్నావ్ అనుకుంటున్నారా?(మీ ఫీలింగు నాకర్దమైంది).. చెబుతాను కొద్దిగా ఓపిక పట్టండి.. భారతీయత అనేది స్వాతంత్ర పోరాటంలో ఏకీకృతమైన మనస్తత్వ వైఖరి, కొందరికది రక్తంలోజీర్ణమైతే ఇంకొందరికి భావంలోనే ఉండిపోయింది.. నా కల ఏంటంటే మనందరం ప్రపంచ పౌరుల్లా ఈ భూగోళమంతా మనదే(మనది అంటే ప్రపంచంలో అందరిదీనూ) అనేటట్లుగా మారిపోవాలని. కానీ ఎన్నో త్యాగాలు చేసి ""వేరొక""దేశంతో పోరాడితేనే కానీ భారతీయత అనే భావన అందరిలో రాలేదు, మరి నా ప్రపంచం అనే భావం మదిలో ఉరుకులు పరుగులు తీయాలంటే.. బహుషా మన మీద ఏలియన్సు అజమాయిషీ చెలాయించాలేమో.. అంటే ఇలా త్యాగాలు చేసి, ప్రాణాలు కోల్పోయి, పోరాటాలు సాగిస్తే కానీ ఒక జాతీయతా భావం రాదా? నిలదొక్కుకోదా? చాలా మంది ఔను అనొచ్చేమో కానీ, నాకు అవేమీ అవసరం లేకుండానే ఆ భావం కలిగింది.. ప్రతి తల్లీ మరొక తల్లి బిడ్డే కదా.. మరి మన భారత దేశం నైసర్గికంగా భూమాత బిడ్డ, ఆవాస పరంగా ప్రపంచానికి బిడ్డ.. కలసి ఉంటే కలదు సుఖం కదా మరీ.. లేదు ఇది జరిగే విషయం కాదంటారా?(మీ ఫీలింగు నాకు అర్దమైంది), భారతీయత లాగా ప్రపంచీయత దేని కోసం అంటారా? నేను నా పదాలతో చెబితే ఊక దంపుడవుతుంది, మీలో ఆ భావం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది.. ఎందుకంటే పదాలు భావాల్ని రేకిత్తించగలవ్ కానీ అవే భావాలు కాలేవు.. మీరనుకుంటున్నది కరెక్టే, ఇది జరిగే మాట కాదు.. కానీ ఎందుకో ఈ వినూత్న ప్రపంచ ఏకీకృత భావన అందిరిలో వచ్చి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఒక్క సారి ఊహించుకుంటుంటే నా మది పులకించిపోతుంది. వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ఆరంభమౌతుంది.. కానీ ఆరంభం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది.. కానీ అందరికీ నిర్ణయం "అవసరం" పైన ఆధారపడి ఉంటుంది.. ఇలాంటి భావన వ్యాపించి ప్రపంచ పౌరులందరూ ఒక నిర్ణయానికొచ్చేసరికే ఇంకొక వెయ్యి వేల ఏళ్ళు పట్టొచ్చు.. కానీ ఆ నా కల నిజమయ్యే రోజుకి నేను నాకు కానీ వేరెవరికీ కానీ తెలిసేందుకు అవకాశమే లేదు.. అవసరం అసలే లేదు.. విడిపోవాలనుకునే తత్వం పెంచి పోషించబడితే మనిషికి తాను నిల్చునే 6:3:3 ఘనపు అడుగుల ప్రదేశం మాత్రమే తన ప్రపంచంగా భావించే పరిస్థితి ఏర్పడుతుంది. నాకు తెలిసినంత వరకూ చెట్లకి ఆ భావన సమంజసంగా ఉంటుంది, ఎందుకంటే అవి అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థావర జీవులు కదా.. ఈ ఆర్టికల్ చదివించి మీ అమూల్యమైన సమయాన్ని వ్యర్ధపరచినట్లైతే క్షమించండి, కానీ.. దయ చేసి మీ అభిప్రాయాలని తెలపండి. |
Friday, June 4, 2010
మధుర అదరాలు...
| "ముద్దుకే ముద్దొచ్చే మందారం.. మువ్వల్లే మురిపించే సింగారం..." ఈ పాటొస్తున్నప్పుడు.. పెదాల మీదకి మనసు పోయి వాటిని వర్ణించాలననిపించింది.. వర్ణించగా క్రింది బొమ్మలో కవిత్వం పుట్టుకొచ్చింది.. కవిత్వానికి సరిపడే థీమ్ తయారు చెయ్యటానికి కనీసం రెండు గంటలు పట్టింది తెలుసా.. కానీ... వర్ణనలోనే పెదాలు ఇంత బాగుంటే, ముద్దులో ఇంకెంత బాగుంటాయో కదా.. ఏమో అనుభవమైనవాళ్ళకి తెలుస్తుంది.. మనకింకా టైము రాలేదులో.. టైమొచ్చాక కావాలంటే ఇంకో కొత్త కవిత కొత్తదనంతో వ్రాయొచ్చు.. |
Thursday, June 3, 2010
నేను ఎటకారస్తున్నా..!! :)
| ఇది మరీ ధారుణం కదండీ, ఏదో మాట వరసకి ఏదన్నా అంటే అలా ఎటకారస్తున్ననేస్తున్నారు వీళ్ళంతా. విషయమేంటంటే నా ఫ్రెండొకడున్నాడు వాడి దగ్గర నేనొక పుస్తకం తీసుకున్నాను (తీసుకున్నాను కానీ చదివేడిస్తే కదా), దాన్ని తిరిగిచ్చేద్దామంటే ఆ రోజు తీరిక లేక నా ఇంకొక ఫ్రెండుని రిక్వెస్టు చేసి ఆ పుస్తకాన్ని దాని "ఓనరు"డుకిచ్చేయమని చెప్పాను(ఓనరుడు అన్నానని వీడు నన్ను ఎటకారస్తున్ననేశాడు). ఇక్కడొచ్చిన చిక్కేంటంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ముఖపరిచయం లేదు, అందువలన బుక్కు ఇవ్వాల్సిన నా ఫ్రెండడిగాడు ఆ ఓనరుడి పోలికలు ఎలా ఉంటాయో చెప్పమని అడిగాడు. వర్ణనలు చెయ్యటానికి నేనేమీ కాళిదాసుని కాదు కదా ఐనా చెప్పాను, చిరంజీవికి గాలి తీసేస్తే వెలిగిపోతున్న మోహన్‌బాబు మొహంలాగా ఫేసూ, చొక్కాలో ఇల్లు కట్టుకుని బ్రతికేస్తున్నట్టు బాడీ (మనోడు బాగా సన్నంగా, పీలగా ఉంటాడులే), చీకేసిన తాటి టెంకెలాగా జుట్టూ (అంటే ఎలా ఉంటే అలా చెప్పకుంటే వీడు పోల్చుకోలేడు కదా మరి).. ఈ మహానుభావుడు వాడి దగ్గరకెళ్ళి పుస్తకమిచ్చేసి ఉత్సాహం ఆపుకోలేక వాడితో ఫ్రెండ్సిప్ చేసుకుని మరీ నేను చెప్పిన పోలికల్ని వాడికి లీక్ చేసేశాడు.. మన బుక్కు ఓనరుడిగాడికి బాగా మండినట్టుంది, వాడు ఫోన్ చేసి మరీ నన్ను ఎటకారస్తున్నని తిట్టేశాడు.. పాపం నేను. నిజాలు చెప్పినందుకు ఇలా తిట్లు కాయాల్సొచ్చింది.. వీడు, అదే ఓనరుడు నన్ను ఇంకోసారి కూడా తిట్టేశాడు, ఆ స్టోరీ ఏంటంటే.. వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు, నేను బిజీగా ఉండి చూసి కూడా తియ్యలేదు, కానీ ఆ విషయం చెబితే వాడు నమ్మడు ఇంకా ఫీలౌతాడు కూడానూ, బిజీ తగ్గిపోయిన తర్వాత నేనే వాడికి కాల్ చేస్తే ఫోన్ లిఫ్టు చెయ్యలేదెందుకని అడిగేశాడు.. ఫోను సైలెంటులో ఉందీ వినబడక తియ్యలేదని చెప్పా.. అంటే వైబ్రేషన్ లేదా అన్నాడు.. వైబ్రేషన్ ఉంది కానీ ఫోనేమో మెత్తటి ప్రదేశం మీద రెండు క్లోత్స్ మద్యలోఉండిపోయింది కాబట్టి తెలియలేదు అన్నా, నా నోటి దురదని వాడు క్యాచ్ చేసేశాడనుకుంటా డౌటొచ్చి డీటెయిల్డుగా చెప్పమన్నాడు.. ఏం చేస్తాం చెప్పాను.. "అది కాదురా ఫోను పోకెట్లో ఉందీ అది మరి రెండు క్లోత్సు మద్యలో ఉన్నట్టే కదా.. ఆ పోకెట్టేమో నా తొడపైన ఉంది, తొడంటే మరి మెత్తని ప్రదేశమే కదా, నువ్వంటే బొత్తిగా బోన్ గాడివి వైబ్రేషన్ వస్తే బాడీ అంతా ఊగిపోతుంది" అనే సరికి టపీ మని ఫోను పెట్టేశాడు, సాయంత్రం వరకూ వాళ్ళ వీధిలో గుమ్మం దగ్గర కర్ర పట్టుకుని మరీ నిల్చున్నాడంట, నేనా దారిలో వెల్తానేమో ఒక చూపు చూడొచ్చని.. మనమటువైపు వెళ్తే కదా, కోపం తగ్గాక ఫోన్ చేసి కనీసం ప్ఫది సార్లనుంటాడు నన్ను ఎటకారస్తున్నని.. ఏం నాకు కోపం రాదా నేను కూడా కర్ర పట్టుకుని నిల్చున్నా గుమ్మం దగర, వాడు కూడా మా ఇంటి వైపు రాలేదు. నేను కొంచెం లావుగా ఉంటానేమో(ఒక మోస్తరు కంటే చాలా తక్కువే) ఐనా మా మామయ్య నన్ను ఇద్దరు మనుషులంటాడు (కనీసం ఒకటింపావు కూడ ఉండనంటే వినడే). ఒక సారి తనూ నేనూ తన కారులో కూర్చున్నప్పుడు దానికి బ్యాటరీ బాగులేక(ఇది మెకానిక్ చెప్పాడు) స్టార్టు కాకపోతే, కారు ఇద్దరు కంటే ఎక్కువమంది ఉంటే వెళ్దంట అన్నాడు, మరి నువ్వు దిగిపోతే కారెవరు నడుపుతారూ అన్నాను.. దానికే ఆయన నన్ను ఎటకారస్తున్ననేశాడు.. మీరే చెప్పండీ నేను ఎటకారస్తున్నా మా మామయ్యనా.. ఏంటో నోట్లోవేలెడితే లాలీపాపలో షుగరెయ్యటం మర్చిపోయారేంటీ అని అడిగే అమాయకున్ని నేను, ఇలాంటోడ్ని అందరూ ఎటకారస్తున్ననేయడమేనంటా!!.. ఇదేమన్నా న్యాయంగా ఉందా..?? :) |
Wednesday, June 2, 2010
ఆ సౌందర్యమునకు ప్రకృతియే అచ్చెరువొందెనే..!!
ప్రకృతిలో సహజ అందాలు కన్నులకింపుగా అద్భుతంగా ఉంటాయి.. పాపం భాష.. నాలాంటి పామరుడి దగ్గర నుండి పండితుడి వరకూ ఎవరు ఆ అందాలని వర్ణించాలనుకున్నా.. ఆ అందానికి సంపూర్ణత్వాన్ని చేకూర్చగలిగే సత్తా తనలో లేక చేతులెత్తేస్తుంది.. అందుకే అంటూంటారు.. శ్రవణం బహు సామాన్యం.. దృశ్యం అద్భుతం.. అనుభవం సర్వస్వం మరియు సారస్వతం అని.. నిజమే కదా.. |
Tuesday, June 1, 2010
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. లైఫ్ సైన్సెస్ సూపర్ స్టార్...
| హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న జీవశాస్త్ర విభాగం యొక్క కట్టడాన్ని మీరు క్రింది ఫోటోలలో చూడొచ్చు... (మొన్నీమద్యనే ఇందులో ఒక చిన్న భాగం కూలిపోయి ఈ బిల్డింగు వార్తలకెక్కి జనాల ఆసక్తిని కూడా చూరగొన్నది) బిల్డింగు ప్లాను చాలా బాగుంది.. పెద్ద పెద్ద ల్యాబులు అంతా బేషుగ్గా ఉంది.. కానీ ఆఖరి ఫోటోని మీరు గమనించినట్లైతే మీకు మేడిపండు గుర్తొస్తుంది... ఔను ఒక మైక్రో న్యూటన్ ఫోర్సు(feathery touch) ఆ గోడ మీద చిటికెన వేలితో ప్రయోగిస్తే అక్కడ కనిపించే పెచ్చు ఊడిపోయిన ప్రదేశం ఏర్పడింది... కొత్తదనం కోరుకునే నేటి తరానికి ఎక్కువ కాలం మన్నే బిల్డింగెందుకులే అనుకున్నారేమో ఇంజినీరు, కాంట్రాక్టరూనూ... ఐనా సరే ఎక్కువ కాలం నిలవాలనే ఆశిద్దాం... Twinkle twinkle little star, life sciences super star (ఇది మా సెల్ఫు డబ్బా లెండి...) |
Subscribe to:
Posts (Atom)




