దుర్యోధనుడు కనుక ఇరవై ఒకటో శతాబ్ధంలో ఉండి, పాంచాలి అనే అమ్మాయికి లవ్ ప్రొపోజ్ చేసి ఫెయిలైతే ఆ డైలాగులు... బహుశా ఇలా ఉండొచ్చేమో.. దుర్యోధనుడి fans ఎవరైనా ఉంటే హర్టవ్వద్దు ప్లీజ్.. "పాంచాలీ పంచ లవర్విసర్జకీ.. ఏటే ఏటేటే.. నీ ఎర్ర బస్సు తప్పి పోయిన తొక్కటాట్టహాసమూ.. ఎంత మరువ యత్నించినను మరుపునకు రాక.. కిడ్నీలని వెన్ను పూసతో గుచ్చినట్లు.. నీ ఎకిలి నవ్వులే నా చెవిలో మార్మ్రోగుచున్నవే.. అహో బేవార్సి బచ్చాల తిలకుండనై రోజుకి ఇరవై గంటలు పడుకునే బద్దక ధవుళేయుండనై .. స్నేహ, గురు, బందు మిత్ర పరివారమంతయూ బూతులు తిడుతున్ననూ దులుపుకొని పోగలుగు నిస్సిగ్గరినై.. ఎదవెవరన్న వేయి మందిలో మొదట చేయెత్తు ధైర్యశాలినై, వెర్రిబాగులతనములో సహస్ర వీరతాళ్ళ సమన్వితుడనై.. అమానధనుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక ఒళ్ళు బలిసి పగులబడి నవ్వుటయా? అహో! తన విసర్జక లవర్లలో నన్నూ ఒకడిగా భావింపక, సమ్మానింపక లవర్ధర్మ పరిశ్చక్తయై.. లజ్జా విముక్తయై.. ఆ బంధకి నన్నేల గేళి చెయ్యవలె.. ఔనులే! లవర్నొదిలేసిన lassకి లజ్జేమి! సిగ్గేమి! పంచ లవర్ విసర్జక పాతకి యని ఎరింగియూ నేనేల ట్రై చేయవలె? ఎదవకి ఇంత కంటే గొప్ప ఫిగరు దొరకదని సరిపెట్టుకుందునా? ఐనా అది ఒప్పుకొనునా? ఐననూ నేనసలు ఎందుకు ప్రేమించవలె? ప్రేమించితిని పో! దీనినెందుకు గాంచవలె? గాంచితిని పో ! ప్రేమించ డిసైడెందుకు అవ్వవలే? డిసైడైతిని పో! నేనెందుకు ప్రొపోజ్ చెయ్యవలె? చేసితిని పో! అదలా ఎర్ర బస్సు తప్పోయిన తొక్కటాట్టహాసమెందుకు చేయవలె? చేసినది పో! దానికి నేనెందుకు ఫీలవ్వవలె? హతవిధీ! హతవిధీ! హతవిధీ! అవమాన జ్వాలలు ప్రజ్వరిల్లుతున్నవి మామా! పాంచాలి కృతావమాన మానసుడనై .. అవమానాతిమాన వర్జితుడనై .. మర్యాధిక్రమనయయి మేల్కొనుండుటయా? ముసుగు తన్ని నిద్ర పోవుటయా? ఛీ! ఛీ! ఆడుదానిపై పగ సాధింపలేక ముసుగు తన్ని నిద్రపోయాడని అపఖ్యాతి ఆపై వేరొకటియా! ఇప్పుడేది కర్తవ్యం! మేల్కొనుటయా? నిద్ర పోవుటయా?"
|
మనసు చేసే కేరింతలని పలకలేక నిస్సహాయ ఐన నా స్వరానికి అక్షర స్వరమై నిలచిన నా మనో ప్రతిబింబం.. నా ఈ అంతర్మధనం...
Tuesday, June 29, 2010
పాంచాలీ పంచ లవర్ విసర్జకీ..!!
Subscribe to:
Post Comments (Atom)
Super ..
ReplyDelete-- Badri
@Anonymous Thank you very much Badri
ReplyDelete~by Chandramouli
keka...
ReplyDeleteమర్యాధిక్రమనయయి మేల్కొనుండుటయా? ముసుగు తన్ని నిద్ర పోవుటయా?
ReplyDeleteidi ultimate.... :)
@venuram: చాలా చాలా దన్యవాదాలండీ వేణుగారూ..
ReplyDeleteanna kevvu keka anna, nuvu films lo dilog writer ga try cheyochu kada anna.
ReplyDelete@g ravi: Thank you veru much Ravi.. అవకాశాలు దొరికితే వ్రాయటానికి నేను రెడీయే... నీకేమైనా తెలిస్తే చెప్పు... వెతుక్కోవటానికి నాకు టైం సరిపోవట్లేదు.. మొత్తం టైం ల్యాబులోనే ఐపోతుంది..
ReplyDelete